Strait of Hormuz | హర్మూజ్‌ను తెరిపించేందుకు రంగంలోకి దిగిన యూరోపియన్ దేశాలు
Strait of Hormuz | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి భరోసా కల్పించేందుకు యూరోపియన్ దేశాలు (European countries) రంగంలోకి దిగాయి. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ సహా యూరోపియన్ దేశాలు జపాన్‌తో కలిసి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.
International | Published On Mar 20, 2026, 10.58 am IST
Strait of Hormuz | గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) పరిస్థితులు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో మధ్యప్రాచ్యం (Middle East) రణరంగంగా మారింది. ఇరాన్ సైతం గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఫలితంగా ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మూసుకుపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే హర్మూజ్‌లో వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి భరోసా కల్పించేందుకు యూరోపియన్ దేశాలు (European countries) రంగంలోకి దిగాయి.
యూకే, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ సహా యూరోపియన్ దేశాలు జపాన్‌తో కలిసి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఈ మేరకు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల పట్ల ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. హర్మూజ్ జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి, ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాయి. "గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులను, గల్ఫ్ దేశాల్లోని చమురు, గ్యాస్ ప్లాంట్లు వంటి పౌర మౌలిక సదుపాయాలపై దాడులను, ఇరాన్ దళాలు హర్మూజ్ జలసంధిని మూసివేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము" అని యూరోపియన్ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
అంతేకాదు, వాణిజ్య నౌకలపై దాడులు, సముద్రంలో మైన్‌లు అమర్చడం, డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడటం వంటి చర్యలను ఇరాన్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. హర్మూజ్ జలసంధిని అడ్డుకోవడానికి ఇరాన్ ప్రయత్నించడం అంతర్జాతీయ శాంతిభద్రతలకు పెను ముప్పు అని పేర్కొన్నాయి. ఇరాన్ చర్యల ప్రభావం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలపై, ముఖ్యంగా అత్యంత బలహీన వర్గాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.
Also Read..
Stock Markets | యుద్ధ తీవ్రత పెరిగినా.. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు..
Iran War | ఇరాన్‌తో యుద్ధంలో 16 యుద్ధ విమానాలను కోల్పోయిన అమెరికా
Qatars LNG Exports | ఇరాన్ దాడితో ఖతార్‌కు భారీ నష్టం.. ఎల్ఎన్‌జీ ఎగుమతులు ఐదేళ్లపాటూ బంద్
సంబంధిత వార్తలు

Crude Oil | ముడి చమురు ముప్పు.. బ్యారెల్ ధర 150 డాలర్లకు..?
సెప్టెంబర్ 15, 2026

Vladimir Putin | వారి వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతోంది : పుతిన్
సెప్టెంబర్ 12, 2026

US Iran Conflict | ‘యుద్ధ నియమాలు మారాయి.. బదులు ఊహించని విధంగా ఉంటుంది’: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
సెప్టెంబర్ 6, 2026
తాజావార్తలు
- ●Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి
- ●Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..
- ●Telangana Employee JAC Meeting | ఉద్యోగ సంఘాల జేఏసీతో ఈ నెల 18న ప్రభుత్వ కీలక సమావేశం
- ●KCR | కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలు!
- ●Oil Palm Cultivation Telangana | ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణే టాప్
- ●Flipkart | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026.. అక్టోబర్ 9 నుంచి భారీ సేల్..

Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి

Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..

Telangana Employee JAC Meeting | ఉద్యోగ సంఘాల జేఏసీతో ఈ నెల 18న ప్రభుత్వ కీలక సమావేశం

KCR | కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలు!



