Iran War | ఇరాన్‌తో యుద్ధంలో 16 యుద్ధ విమానాలను కోల్పోయిన అమెరికా
Iran War | ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. ఈ యుద్ధం కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న అమెరికా.. అదే సమయంలో అత్యాధునిక యుద్ధ విమానాలను కూడా కోల్పోవాల్సి వస్తోంది.
International | Published On Mar 20, 2026, 10.23 am IST
Iran War | ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. ఈ యుద్ధం కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న అమెరికా.. అదే సమయంలో అత్యాధునిక యుద్ధ విమానాలను కూడా కోల్పోవాల్సి వస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ యూఎస్‌కు చెందిన కనీసం 16 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి (16 US Military Aircraft Destroyed). వీటిల్లో 10 MQ-9 రీపర్ డ్రోన్లను (Reaper strike drones) శత్రు దళాలు కూల్చగా.. మరికొన్ని యుద్ధంలో దాడికి గురైనట్లు తెలిసింది.
కువైట్‌లో 'ఫ్రెండ్లీ ఫైర్' కారణంగా మూడు అమెరికా ఎఫ్-15 (F-15) విమానాలు కూలిపోయిన విషయం తెలిసిందే. అదేవిధంగా పశ్చిమ ఇరాక్‌లో (Iraq) ఇంధనం నింపే విమానం KC-135 Tanker కుప్పకూలి ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది మరణించారు. ఆ తర్వాత సౌదీ అరేబియా (Saudi Arabia)లోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ (Prince Sultan air base)పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో అమెరికాకు చెందిన ఐదు రీఫ్యూయలింగ్ విమానాలు (Refueling Planes) దెబ్బతిన్నాయి.
ఇప్పటి వరకూ ఇరాన్ రక్షణ వ్యవస్థలు కేవలం మానవరహిత రీపర్ డ్రోన్లను మాత్రమే కూల్చివేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తిని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వీటిలో కనీసం తొమ్మిది గాల్లోనే ధ్వంసమవగా.. జోర్డాన్‌లోని ఓ విమానాశ్రయంపై జరిగిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో మరొకటి దెబ్బతిన్నది. మరో రెండు రీపర్ డ్రోన్లు ప్రమాదాల్లో ధ్వంసమయ్యాయి.
అమెరికా ఎఫ్-35 ఫైటర్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
ప్రపంచంలోనే అత్యాధునిక ఫైటర్ జెట్‌గా పేరుపొందిన అమెరికా ఎఫ్-35 లైట్నింగ్-2 యుద్ధ విమానం (F-35 Fighter Jet) ఎమర్జెన్సీ లాండింగ్ (Emergency Landing) కలకలం సృష్టించింది. ఇరాన్‌పై సైనిక చర్యల్లో పాలుపంచుకున్న ఆ యుద్ధ విమానం అకస్మాత్తుగా వెనుదిరిగి సమీపంలోని అమెరికా సైనిక స్థావరంలో అత్యవసరంగా దిగిపోయింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (US Central Command) కూడా ధ్రువీకరించింది. ఎఫ్-35 విమానం సురక్షితంగా లాండ్ అయ్యిందని, పైలట్ సేఫ్‌గా ఉన్నారని వెల్లడించింది. ఇరాన్ క్షిపణి ఢీకొనడంతోనే ఇలా జరిగి ఉండవచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే యూఎస్ ఎఫ్-35 యుద్ధ విమానంపై తాము దాడి చేశామని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read..
ఇరాన్ దాడితో ఖతార్‌కు భారీ నష్టం.. ఎల్ఎన్‌జీ ఎగుమతులు ఐదేళ్లపాటూ బంద్
ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడులు నిలిపేస్తాం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లారో ఇక అంతే!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి
- ●Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..
- ●Telangana Employee JAC Meeting | ఉద్యోగ సంఘాల జేఏసీతో ఈ నెల 18న ప్రభుత్వ కీలక సమావేశం
- ●KCR | కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలు!
- ●Oil Palm Cultivation Telangana | ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణే టాప్
- ●Flipkart | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026.. అక్టోబర్ 9 నుంచి భారీ సేల్..

Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి

Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..

Telangana Employee JAC Meeting | ఉద్యోగ సంఘాల జేఏసీతో ఈ నెల 18న ప్రభుత్వ కీలక సమావేశం

KCR | కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలు!






