Middle East Conflict | పశ్చిమాసియాలో ఘర్షణలు.. 14 మంది నావికులు సహా 22 మంది భారతీయులు మృతి
Middle East Conflict | పశ్చిమాసియాలో (Middle East Conflict) కొనసాగుతున్న ఘర్షణ కారణంగా ఇప్పటివరకు 22 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14 మంది భారతీయ నావికులు (Seafares) ఉన్నారు.
Middle East Conflict | త్రినేత్ర న్యూస్: పశ్చిమాసియాలో (Middle East Conflict) కొనసాగుతున్న ఘర్షణ కారణంగా ఇప్పటివరకు 22 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14 మంది భారతీయ నావికులు (Seafares) ఉన్నారు. ఈ మేరకు ని భారత విదేశాంగ (MEA) శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) వెల్లడించారు. ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. దురదృష్టవశాత్తూ ఘర్షణలు జరుగుతున్న ప్రాంతంలో 14 మంది నావికులతో సహా 22 మంది భారతీయులు మరణించాని చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలో (Gulf Region) నివసిస్తున్న భారతీయులు, అక్కడ పనిచేస్తున్న నౌకా సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు.
అక్కడి భారతీయ పౌరులతో రాయబార కార్యాలయాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని వెల్లడించారు. ప్రాంతీయ అస్థిరత కారణంగా సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులు మరణించారని చెప్పారు. పశ్చిమాసియాలోని (West Asia) భారత దౌత్య కార్యాలయాలు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాయని, ప్రమాదకర సముద్ర మార్గాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులు, నావికుల భద్రత, సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాయని వెల్లడించారు.
ట్రావెల్ అడ్వైజరీ..
సౌదీ అరేబియాలో (Saudi Arabia) ఇటీవల విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు, ముఖ్యంగా ఉమ్రా యాత్రకు వెళ్లిన భక్తులకు సహాయం చేసేందుకు జెడ్డాలోని (Jeddah) భారత కాన్సులేట్ జనరల్ కొత్త ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది. భారత్‌కు తిరిగి రావాలనుకునే ప్రయాణికుల కోసం అదనపు విమాన సర్వీసులు, ప్రత్యామ్నాయ మార్గాల వివరాలను వెల్లడించింది. భారతీయ నగరాలకు విమాన కనెక్టివిటీనీ పునరుద్ధరించడానికి, విస్తరించడానికి సౌదీ విమానయాన అధికారులు, వాణిజ్య విమానయాన సంస్థలు, కమ్మూనిటీ గ్రూపులతో సమన్వయం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
జెడ్డా, మదీనా (Madinah) విమానాశ్రయాల నుంచి సౌదీ విమానయాన సంస్థలు భారత్‌కు విమానాలను నడుపుతున్నాయని, ఇతర అంతర్జాతీయ విమానయాన సంస్థల ద్వారా వాటి అనుసంధాన కేంద్రాల మీదుగా ఒక స్టాప్‌తో భారతదేశానికి చేరుకునే అవకాశం ఉందని అడ్వైజరీలో పేర్కొన్నారు. తూర్పు, మధ్య ప్రాంతాలలో చిక్కుకుపోయిన ప్రయాణీకులకు సహాయం చేయడానికి, ప్రైవేట్ సౌదీ విమానయాన సంస్థ ఫ్లైనాస్ (Flynas) దమ్మామ్, రియాద్ నుంచి లక్నో, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోజికోడ్, కొచ్చి వంటి ప్రధాన భారతీయ నగరాలకు అదనపు విమానాలను ప్రకటించిందన్నారు.
సంబంధిత వార్తలు

Saudi Arabia Houthi Deal | యుద్ధం ఆపేందుకు రూ.8,400 కోట్లు?: హౌతీలతో సౌదీ సీక్రెట్ డీల్.. తెరవెనుక ఇరాన్ చక్రం!
అక్టోబర్ 27, 2026

Saudi Airport | సౌదీ ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు మృతి
అక్టోబర్ 22, 2026

Flights Cancelled | మరో వారం రోజులు.. సౌదీ అరేబియాకు భారత విమాన సర్వీసులు రద్దు
అక్టోబర్ 17, 2026
తాజావార్తలు
- ●Sanjay Gaikwad | ఆత్మహత్య చేసుకునే రైతుల అంత్యక్రియలకు ఎవరూ హజరుకావొద్దు: ఎమ్మెల్యే సంజయ్
- ●ISRO URSC Recruitment | పదో తరగతి, ఐటీఐ అర్హతతో.. ఇస్రోలో టెక్నీషియన్, డ్రైవర్ పోస్టులు
- ●వంద సీట్లు.. అంత ఈజీనా? కాంగ్రెస్ ధీమా వెనుక లెక్కేంటి?
- ●Harish Rao | తప్పుడు లెక్కలు చెప్పి వాస్తవాల నుంచి తప్పించుకోలేరు.. మంత్రి ఉత్తమ్‌పై హరీశ్ ఫైర్
- ●Horoscope | అక్టోబర్ 29 రాశిఫలాలు.. ఈ రాశివారు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం!
- ●NHRC | ఐశ్వర్య మృతిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ

Sanjay Gaikwad | ఆత్మహత్య చేసుకునే రైతుల అంత్యక్రియలకు ఎవరూ హజరుకావొద్దు: ఎమ్మెల్యే సంజయ్

ISRO URSC Recruitment | పదో తరగతి, ఐటీఐ అర్హతతో.. ఇస్రోలో టెక్నీషియన్, డ్రైవర్ పోస్టులు
వంద సీట్లు.. అంత ఈజీనా? కాంగ్రెస్ ధీమా వెనుక లెక్కేంటి?

Harish Rao | తప్పుడు లెక్కలు చెప్పి వాస్తవాల నుంచి తప్పించుకోలేరు.. మంత్రి ఉత్తమ్‌పై హరీశ్ ఫైర్



