త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJP protest | ఢిల్లీలో కొన‌సాగుతున్న సీజేపీ నిర‌స‌న‌లు.. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌కు శ‌ర‌ద్ ప‌వార్, అర‌వింద్ కేజ్రీవాల్‌

CJP protest | ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ (Jantar Mantar) వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నిర‌స‌న కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో కాక్రోచ్ పార్టీ నిర‌స‌న‌ల‌కు ప‌లు పార్టీలు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ (Sharad Pawar), ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) ఇవాళ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద సీజేపీ నిర‌స‌న చేస్తున్న స్థ‌లికి వెళ్లారు.

D

National | Published On Jul 21, 2026, 5.26 pm IST

CJP protest | ఢిల్లీలో కొన‌సాగుతున్న సీజేపీ నిర‌స‌న‌లు.. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌కు శ‌ర‌ద్ ప‌వార్, అర‌వింద్ కేజ్రీవాల్‌
Advertisement

CJP protest | ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ (Jantar Mantar) వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నిర‌స‌న కొన‌సాగుతోంది. వేలాది మంది నిర‌స‌న‌కారులు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌కు చేరుకొని కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వ‌ర్షంలోనూ నిర‌స‌న కొన‌సాగిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో కాక్రోచ్ పార్టీ నిర‌స‌న‌ల‌కు ప‌లు పార్టీలు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ (Sharad Pawar), ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) ఇవాళ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద సీజేపీ నిర‌స‌న చేస్తున్న స్థ‌లికి వెళ్లారు. అక్క‌డ సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కేతో మాట్లాడారు. ఆ త‌ర్వాత ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) సైతం సీజేపీకి మ‌ద్ద‌తు తెలిపారు. నిన్న చ‌లో సంస‌ద్ సంద‌ర్భంగా విద్యార్థుల‌పై లాఠీఛార్జ్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు.

నిన్న జ‌రిగిన చ‌లో పార్ల‌మెంట్ మార్చ్ ఉద్రిక్త‌త‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. దీంతో పోలీసులు నిర‌స‌న‌కారుల‌పై లాఠీఛార్జ్ చేశారు. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో 100 మందికిపైగా నిర‌స‌న‌కారులు గాయ‌ప‌డ్డారు. ప‌లువురు పోలీసుల‌కు సైతం గాయాల‌య్యాయి. ఈ నిర‌స‌న‌ల అనంత‌రం పోలీసులు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద గుడారాలను తొలగించారు. అయిన‌ప్ప‌టికీ ఇవాళ సీజేపీ జంతర్ మంతర్ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని తమ నిరసనను కొనసాగిస్తోంది.

వాంగ్‌చుక్‌కు ఊర‌ట‌..

ఇదిలా ఉండ‌గా.. ఢిల్లీలో నిరాహార దీక్ష కొన‌సాగిస్తున్న ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త సోన‌మ్ వాంగ్‌చుక్‌కు భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌ను చికిత్స కోసం స‌ఫ్ధ‌ర్‌జంగ్ ఆసుప‌త్రి నుంచి గురుగ్రామ్‌లోని మెదాంతా ఆస్పత్రికి తరలించేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమ‌తించింది. ప్ర‌స్తుతం ఆయ‌న సీజేపీకి మ‌ద్ద‌తుగా స‌ఫ్ధ‌ర్‌జంగ్ ఆసుప‌త్రిలో నిరాహార దీక్ష కొన‌సాగిస్తున్నారు.

Also Read..

మోదీ రాజీనామా చేయాలి.. ప్ర‌ధాని ఇంటి ముందు బైఠాయించిన రాహుల్‌

ఎఫ్‌ఐహెచ్ వ‌ర‌ల్డ్ క‌ప్‌.. జ‌ట్టును ప్ర‌క‌టించిన హాకీ ఇండియా..!

ఓఆర్ఆర్ స‌ర్వీస్ రోడ్డులో న‌వ‌జాత శిశువు ల‌భ్యం

Advertisement
Advertisement