Hockey India | ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్.. జట్టును ప్రకటించిన హాకీ ఇండియా..!
Hockey India | ఆగస్టు 13 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరుగనున్న ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్ కోసం హాకీ ఇండియా సోమవారం మెన్స్ జట్టును ప్రకటించింది. 20 మంది సభ్యులు గల జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Hockey India | ఆగస్టు 13 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరుగనున్న ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్ కోసం హాకీ ఇండియా సోమవారం మెన్స్ జట్టును ప్రకటించింది. 20 మంది సభ్యులు గల జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులో సీనియర్, యువ ఆటగాళ్లకు పెద్దపీట వేశారు. గోల్ కీపింగ్ విభాగంలో మోహిత్ హెచ్ఎస్ సూరజ్ కర్కేరా.. డిఫెన్స్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, యశ్‌దీప్ సివాచ్ చోటు దక్కించుకున్నారు. మిడ్‌ఫీల్డ్‌లో మన్‌ప్రీత్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్‌లతో పాటు నీలకాంత శర్మ, యువ ఆటగాళ్లు రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్ లలాగేకు చోటు కల్పించారు. ఎటాకింగ్‌లో మన్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, శిలానంద్ లక్రా ఉన్నారు.
ఈ సందర్భంగా కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ మాట్లాడుతూ భారత హాకీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు ఈ జట్టుకు గొప్ప అవకాశం ఉందని తెలిపారు. జట్టు సమతూకంగా ఉందని, అనుభవం, ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్ల సరైన కలయికతో ఉందని.. యువ ఆటగాళ్లు తమ పేరుప్రతిష్టలతో కాకుండా, తమ ప్రదర్శనతో జట్టులో స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. ప్రెస్సింగ్, కౌంటర్ అటాకింగ్, బాగా ఆడడం ఆనేది కేవలం మా వ్యూహాత్మక గుర్తింపు మాత్రమే కాదని ఫుల్టన్.. ఇది ఈ బృందం ప్రతిరోజూ కలిసి శిక్షణ పొందే.. ఆలోచించే విధానమని తెలిపారు. తాము ఎక్కువ దూరం ఆలోచించడం లేదని.. ఒకేసారి ఒక మ్యాచ్‌పై దృష్టి పెట్టే మనస్తత్వంతో మ్యాచ్ ఆడుతామన్నారు. భారత జట్టు ప్రపంచకప్ సాధించి 50 ఏళ్లు అయ్యిందని.. భారత హాకీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించే అవకాశం ఈ జట్టుకు ఉందన్నారు.
భారతదేశ షెడ్యూల్ ఇలా..
ఇంగ్లాండ్, పాకిస్తాన్, వేల్స్‌తో పాటు పూల్ డీలో ఉన్నది. భారత్ తన పూల్-స్టేజ్ మ్యాచ్‌లన్నింటినీ నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్వీన్‌లో ఆడనుంది. భారత్ తొలి మ్యాచ్‌ను ఆగస్టు 15న వేల్స్‌తో, ఆ తర్వాత ఆగస్టు 17న ఇంగ్లాండ్‌తో, ఆగస్టు 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడుతుంది. ఎఫ్ఐహెచ్ ప్రపంచ కప్ తొలి మూడు ఎడిషన్లలో కాంస్యం (బార్సిలోనా 1971), రజతం (ఆమ్‌స్టర్‌డామ్ 1973), స్వర్ణ (కౌలాలంపూర్ 1975) పతకాలను గెలుచుకుంది. ప్రస్తుతం మరోసారి సత్తాచాటాలని భావిస్తోంది.
ప్రపంచ కప్ కోసం భారత పురుషుల హాకీ జట్టు..
గోల్‌కీపర్లు: మోహిత్ హెచ్ఎస్, సూరజ్ కర్కెరా.
డిఫెండర్లు: జర్మన్‌ప్రీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, యష్‌దీప్ సివాచ్.
మిడ్‌ఫీల్డర్లు: రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్ లాలగే, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, నీలకాంత శర్మ, వివేక్ సాగర్ ప్రసాద్.
ఫార్వర్డ్‌స్: దిల్ప్రీత్ సింగ్, షిలానంద్ లక్రా, సుఖ్‌జీత్ సింగ్, మన్‌దీప్ సింగ్, అభిషేక్.
తాజావార్తలు
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!




