త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ఈజ్ బ్యాక్ – భర్త, కూతురితో హైదరాబాద్‌లో ల్యాండైన ప్రియాంక చోప్రా

భ‌ర్త నిక్ జోన‌స్‌, కూతురు మాల్తీతో క‌లిసి ఆదివారం హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గ్లోబ‌ల్ స్టార్‌ ప్రియాంక చోప్రా సంద‌డి చేసిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఈ ఫొటోల్లో అల్ట్రా మోడ్ర‌న్ లుక్‌లో ప్రియాంక క‌నిపించింది. వార‌ణాసి షూటింగ్ కోస‌మే ప్రియాంక చోప్రా హైద‌రాబాద్ వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Jul 26, 2026, 3.43 pm IST

Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ఈజ్ బ్యాక్ –  భర్త,  కూతురితో హైదరాబాద్‌లో ల్యాండైన ప్రియాంక చోప్రా
Advertisement

Priyanka Chopra |  మ‌హేష్‌బాబు వార‌ణాసి మూవీతో దాదాపు ఎనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌బోతుంది గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా. ప‌ద‌మూడు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ట్రైమ్ ట్రావెల్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో మందాకిని అనే పాత్ర‌లో ప్రియాంక చోప్రా క‌నిపించ‌బోతుంది. యాక్ష‌న్ ప్ర‌ధానంగా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఈ హాలీవుడ్ బ్యూటీ రోల్ సాగుతుంద‌ని అంటున్నారు.

భాగ్య‌న‌గ‌రంలో...

ప్ర‌స్తుతం వార‌ణాసి షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఆర్ఎఫ్‌సీలో వేసిన ఓ పీరియాడిక‌ల్ సెట్‌లో మ‌హేష్‌బాబుతో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నాడు డైరెక్ట‌ర్ రాజ‌మౌళి. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రియాంక చోప్రా ఆదివారం హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. ప్ర‌తిసారి ఒంట‌రిగానే ఇండియాకు వ‌చ్చిన ఈ బ్యూటీ ఈ సారి మాత్రం భ‌ర్త‌, కూతురితో క‌లిసి భాగ్య‌న‌గ‌రంలో అడుగుపెట్ట‌డం అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ఫొటోలు వైర‌ల్‌....

భ‌ర్త నిక్ జోన‌స్‌, కూతురు మాల్తీల‌తో క‌లిసి ప్రియాంక చోప్రా ఆదివారం హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. వీటిలో బ్రౌన్ క‌ల‌ర్ డ్రెస్‌లో క‌ళ్ళాద్ధాలు ధ‌రించి అల్ట్రా మోడ్ర‌న్ లుక్‌లో ప్రియాంక క‌నిపించింది. కూతురు మాల్తీని ఎత్తుకొని నిక్ జోన‌స్ ఔట్ అండ్ ఔట్ బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో క‌నిపించాడు. ప్రియాంక‌, నిక్ జోన‌స్ ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.

లాస్ట్ షెడ్యూల్‌....

సోమ‌వారం నుంచి వార‌ణాసి షూటింగ్‌లో ప్రియాంక చోప్రా తిరిగి జాయిన్ కానున్న‌ట్లు స‌మాచారం. ఈ షెడ్యూల్‌తోనే ఆమె పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వార‌ణాసి కోసం ప్రియాంక చోప్రా 30 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్‌ను స్వీక‌రించిన‌ట్లు సమాచారం. తెలుగులో ఓ సినిమా కోసం అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న హీరోయిన్‌గా వార‌ణాసితో ప్రియాంక రికార్డ్ క్రియేట్ చేసింది.

హాలీవుడ్‌లో...

ఇటీవ‌లే ప్రియాంక చోప్రా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె పోస్ట‌ర్‌ను రాజ‌మౌళి రిలీజ్ చేశారు. ఇందులో చేతిలో గ‌న్ ప‌ట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో గ్లోబ‌ల్ స్టార్ క‌నిపించింది. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న వార‌ణాసి రిలీజ్ కాబోతుంది. వార‌ణాసికి కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో అమ్రితో పాటు జ‌డ్జిమెంట్ డే సినిమా చేస్తోంది ప్రియాంక చోప్రా.

https://www.instagram.com/reel/DbPnfSzv-Kq/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

 

Advertisement

తాజావార్తలు

Advertisement