త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Infant | ఓఆర్ఆర్ స‌ర్వీస్ రోడ్డులో న‌వ‌జాత శిశువు ల‌భ్యం

Infant | శంషాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డు స‌ర్వీస్ రోడ్డు స‌మీపంలోని ఎయిర్‌పోర్టు కాల‌నీ బ్రిడ్జి వ‌ద్ద గుర్తు తెలియ‌ని న‌వ‌జాత శిశువు ల‌భ్య‌మైంది. మంగ‌ళ‌వారం ఉద‌యం ఆడ‌బిడ్డ‌ను గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

S

Hyderabad | Published On Jul 21, 2026, 5.06 pm IST

Infant | ఓఆర్ఆర్ స‌ర్వీస్ రోడ్డులో న‌వ‌జాత శిశువు ల‌భ్యం
Advertisement

Infant | త్రినేత్ర‌.న్యూస్ : శంషాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డు స‌ర్వీస్ రోడ్డు స‌మీపంలోని ఎయిర్‌పోర్టు కాల‌నీ బ్రిడ్జి వ‌ద్ద గుర్తు తెలియ‌ని న‌వ‌జాత శిశువు ల‌భ్య‌మైంది. మంగ‌ళ‌వారం ఉద‌యం ఆడ‌బిడ్డ‌ను గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. తెల్ల‌ని సంచిలో శిశువును చుట్టి ఉంచిన‌ట్లు పోలీసులు తెలిపారు.

అయితే శిశువు రెండు, మూడు రోజుల క్రిత‌మే జ‌న్మించిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ప‌సికందును శంషాబాద్‌లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం అమీర్‌పేట‌లోని శిశు విహార్‌కు త‌ర‌లించారు. అక్క‌డే ప‌సిబిడ్డ‌కు సంర‌క్ష‌ణ క‌ల్పించ‌నున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఆర్‌జీఐఏ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. శిశువు కోసం ఎవ‌రైనా సంప్ర‌దించాలంటే.. ఆర్‌జీఐఏ పీఎస్ - 8712663319, ఆర్‌జీఐఏ ఎస్‌హెచ్‌వో - 8712663310, ఎస్సై ఇంద్ర‌సేనారెడ్డి - 8712663313 నంబ‌ర్ల‌ను సంప్ర‌దించొచ్చు అని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement