Abhijeet Dipke | మేం కాక్రోచ్‌లం.. అంత త్వరగా పోయేవాళ్లం కాదు.. : సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే
Abhijeet Dipke | జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న యువత డిమాండ్లకు కేంద్రం దిగివచ్చింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే ఆధ్వర్యంలో యువత సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిజీత్ దిప్కే యువతనుద్దేశించి ప్రసంగించారు.
Abhijeet Dipke | జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న యువత డిమాండ్లకు కేంద్రం దిగివచ్చింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే ఆధ్వర్యంలో యువత సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిజీత్ దిప్కే యువతనుద్దేశించి ప్రసంగించారు. "విద్యార్థి ఐక్యత వర్ధిల్లాలి. మనం గెలిచాం" అంటూ స్పందించారు. "ప్రజాస్వామ్య విజయం"గా అభివర్ణించారు. ప్రభుత్వాలు రాజీనామా చేయవని ప్రజలు అంటున్నప్పటికీ, తాను దీన్ని సాధించానని దిప్కే పేర్కొన్నారు. తనను తాను "బొద్దింక" (cockroach) అని పిలుచుకుంటూ.. తాను అంత త్వరగా వెళ్లిపోయేవాడిని కాదన్నారు. దిప్కే మరో రెండు కొత్త డిమాండ్లను కూడా లేవనెత్తారు. నిరసనల సమయంలో వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు నిరసనకారులపై నమోదు చేసిన కేసులన్నింటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలని, ఒక్కో కుటుంబానికి రూ.కోటి వరకు పరిహారం ఇవ్వాల్సిందేనన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాక్రోచ్ జనత పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. నీట్ వ్యవహారంతో పాటు పలు అంశాలపై దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. ఆదివారం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించాలని కోరింది. నిరసనకారులు, యువత, విద్యార్థులు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేసింది. ఈ ర్యాలీని శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని చెప్పింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనను తెలియజేయాలని, ఎలాంటి అపశ్రుతులకు తావులేకుండా క్రమశిక్షణతో ప్రదర్శన చేయాలని సూచించింది. అంతకు ముందు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశ యువతనుద్దేశించి ప్రసంగించారు. గత పదిరోజులుగా జరిగిన పరిణామాలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంగా ఆయన రాజీనామా గురించి వెల్లడించారు. భారత యువశక్తే బలమని పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద నెలకొన్న పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలుచుకోకూడదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, దేశం ఐక్యంగా ఉండాలని.. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టాలని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Sonam Wangchuk | ఇది భయం వీడిన ప్రజల విజయం : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సోనమ్ వాంగ్‌చుక్
- ●Ponnam Prabhakar | ఇదొక వ్యక్తి రాజీనామా కాదు.. అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భం
- ●Tamannaah | హీరోయిన్లను గ్లామర్ డాల్స్‌లా చూస్తారు - సౌత్ ఇండస్ట్రీపై తమన్నా కామెంట్లు
- ●Bandi Sanjay | ముందు దేశం.. ఆ తర్వాతే పార్టీ : కేంద్ర మంత్రి బండి సంజయ్
- ●Gold Price | బంగారం కొనేముందు ఈ లెక్క తెలుసుకోండి.. జువెలరీ షాపుల్లో మోసపోకుండా ఉండాలంటే ఇదే సీక్రెట్..
- ●Jagadeesh Reddy | జెన్‌జీకి రాజకీయాలు తెలుసు.. దేశ నిర్మాణానికి వారు సిద్ధంగా ఉన్నరు

Sonam Wangchuk | ఇది భయం వీడిన ప్రజల విజయం : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సోనమ్ వాంగ్‌చుక్

Ponnam Prabhakar | ఇదొక వ్యక్తి రాజీనామా కాదు.. అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భం

Tamannaah | హీరోయిన్లను గ్లామర్ డాల్స్‌లా చూస్తారు - సౌత్ ఇండస్ట్రీపై తమన్నా కామెంట్లు

Bandi Sanjay | ముందు దేశం.. ఆ తర్వాతే పార్టీ : కేంద్ర మంత్రి బండి సంజయ్




