త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | కృష్ణా, భీమా నదులపై కర్ణాటక అక్ర‌మ ప్రాజెక్టులు.. తెలంగాణ‌కు నీళ్లు వ‌చ్చే ప‌రిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud | కృష్ణా న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలోని ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో భ‌విష్య‌త్‌లో క‌రువు తాండ‌వించే ప్ర‌మాదం ఉంద‌ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కృష్ణా, భీమా నదులపై కర్ణాటక అక్ర‌మంగా ప్రాజెక్టులు క‌డుతుంద‌ని దీంతో భ‌విష్య‌త్‌లో తెలంగాణ‌కు నీళ్లు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Jul 26, 2026, 3.44 pm IST

Srinivas Goud | కృష్ణా, భీమా నదులపై కర్ణాటక అక్ర‌మ ప్రాజెక్టులు.. తెలంగాణ‌కు నీళ్లు వ‌చ్చే ప‌రిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్
Advertisement

Srinivas Goud | త్రినేత్ర‌.న్యూస్ : కృష్ణా న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలోని ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో భ‌విష్య‌త్‌లో క‌రువు తాండ‌వించే ప్ర‌మాదం ఉంద‌ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కృష్ణా, భీమా నదులపై కర్ణాటక అక్ర‌మంగా ప్రాజెక్టులు క‌డుతుంద‌ని దీంతో భ‌విష్య‌త్‌లో తెలంగాణ‌కు నీళ్లు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మాజీ మంత్రి ల‌క్ష్మారెడ్డి, ప‌లువురు బీఆర్ఎస్ నేత‌ల‌తో క‌లిసి శ్రీనివాస్ గౌడ్‌.. కృష్ణా, భీమా నదులపై కర్ణాటక కడుతున్న అక్రమ ప్రాజెక్టులను సంద‌ర్శించారు. కర్ణాటకలోని గూడూరు వద్ద కృష్ణానదిపై అక్రమంగా ఏర్పాటు చేసిన హైడ్రాలిక్‌ గేట్లను పరిశీలించింది. ఈ సంద‌ర్శ‌న అనంత‌రం శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.

కర్ణాటకలోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిపోయాయి. తెలంగాణలో నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయి. తుంగభద్రలో సిల్ట్‌ తీయక పూడికతో నిండిపోయింది. అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోకపోతే మనకు నీళ్లు ఉండవు. హైడ్రాలిక్‌ గేట్లు పెట్టి చుక్క నీరు రాకుండా చేస్తున్నారు. హైడ్రాలిక్‌ గేట్లు వెంటనే తీసేయాలని డిమాండ్ చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికాకపోతే పాలమూరు ఎండిపోతుంది. ఈ ప్రాజెక్టు ప‌నులు 10 శాతం మాత్ర‌మే మిగిలి ఉన్నాయ‌ని, వాటిని పూర్తి చేస్తే నీళ్లు వ‌స్తాయి. నీళ్లు వదలకపోతే పాలమూరు ప్రజలు చూస్తూ ఊరుకోరు. తుంగభద్ర డ్యాంలో తెలంగాణకు కూడా హక్కు ఉంది. కనీసం నాలుగు టీఎంసీల నీటిని కిందకు వదలాలి. నీళ్లు ఇచ్చేవరకూ తెలంగాణ ప్రజల పట్ల పోరాడతాం. తెలంగాణ ద్రోహిని ఇరిగేషన్‌ శాఖకు సలహాదారుడిగా రేవంత్ స‌ర్కార్ నియ‌మించింద‌ని శ్రీనివాస్ గౌడ్ ధ్వ‌జ‌మెత్తారు.

తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం : ల‌క్ష్మారెడ్డి

సాగు నీటి రంగంలో తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని, మరి ముఖ్యంగా పాల‌మూరు ఎడారిగా మారుతుంద‌ని మాజీ మంత్రి ల‌క్ష్మారెడ్డి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నీళ్ల కోస‌మే ఉద్య‌మం చేసి కేసీఆర్ తెలంగాణ‌ను సాధించారు. పాల‌మూరు జిల్లాను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ అధికారంలోకి రాగానే పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. పాలమూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని లక్ష్మారెడ్డి అన్నారు.

ఎగువన కర్ణాటక రాష్ట్రంఅక్రమ ప్రాజెక్టులు కడుతోంది. హైడ్రాలిక్‌ గేట్లు పెట్టి నీటిని వదలడం లేదు. మహబూబ్‌నగర్‌కు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత సీఎం రేవంత్‌ రెడ్డిదే. వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కోసం ఎంత దూరమైనా వెళ్తాం. కర్ణాటక ప్రాజెక్టులు పూర్తయితే మహబూబ్‌నగర్‌ జిల్లాకు కరువు వస్తుంది. కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యంతో రిజర్వాయర్లు నింపడం లేదు. కాంగ్రెస్‌ నాయకులకు ప్రాజెక్టులపై అవగాహన లేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కొని నీటి హక్కులను కాపాడాలని మాజీ మంత్రి ల‌క్ష్మారెడ్డి సూచించారు.

Advertisement
Advertisement