త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress protest outside PMs residence | మోదీ రాజీనామా చేయాలి.. ప్ర‌ధాని ఇంటి ముందు కాంగ్రెస్ ధ‌ర్నా

Congress protest outside PMs residence | హ‌స్తం పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు, ఎంపీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఢిల్లీలోని ప్ర‌ధాన మంత్రి నివాసం (PMs residence) ఎదుట ధ‌ర్నాకు దిగారు. ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.

D

National | Published On Jul 21, 2026, 4.46 pm IST

Congress protest outside PMs residence | మోదీ రాజీనామా చేయాలి.. ప్ర‌ధాని ఇంటి ముందు కాంగ్రెస్ ధ‌ర్నా
Advertisement

Congress protest outside PMs residence | నీట్ పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారంపై విద్యార్థుల నిర‌స‌న‌లు కొన‌సాగుతున్న వేళ కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ప్ర‌భుత్వంపై మ‌రింత ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress) రంగంలోకి దిగింది. ఈ మేర‌కు హ‌స్తం పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు, ఎంపీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఢిల్లీలోని ప్ర‌ధాన మంత్రి నివాసం (PMs residence) ఎదుట ధ‌ర్నాకు దిగారు.

కాక్రోచ్ పార్టీ చ‌లో సంస‌ద్ మార్చ్ సంద‌ర్భంగా విద్యార్థుల‌ను పోలీసులు అణ‌చివేశార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు ప్ర‌ధాని నివాసాన్ని ముట్టడించేందుకు ప్ర‌య‌త్నించారు. కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, డీకే శివకుమార్ స‌హా ప‌లువురు నేత‌లు ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ఆయన అధికారిక నివాసం ముందు బైఠాయించి నిర‌స‌న తెలిపారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను కేంద్రం అణచివేస్తోందని, పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చకు నిరాకరిస్తోందని కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు.

మ‌రోవైపు విష‌యం తెలుసుకున్న కేంద్ర మంత్రి జితేంద‌ర్ సింగ్ హుటాహుటిన అక్క‌డికి చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో మాట్లాడారు. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా ఆ ప్రాంతాన్ని క్లియ‌ర్ చేయాల‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌ధాని నివాసం స‌మీపంలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. కాంగ్రెస్ నిర‌స‌న‌ల‌తో ఢిల్లీ పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ప్ర‌ధాని నివాసం వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఆ మార్గంలో భారీగా పోలీసులు మోహ‌రించారు.

Also Read..

ఇక యూపీఐలో ఇంట‌ర్నెట్ లేకున్నా చెల్లింపులు.. త్వ‌ర‌లో కొత్త ట్యాప్ అండ్ పే ఫీచ‌ర్‌..

చేతికి బ్యాండేజ్‌తో సిద్ధార్థ్ - వెబ్ సిరీస్ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరో

తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం

Advertisement
Advertisement