త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | యాద‌వులు లేనిదే చ‌రిత్ర లేదు.. ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం: త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌

Talasani Srinivas Yadav | యాద‌వులు లేనిదే చ‌రిత్ర లేద‌ని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav) అన్నారు. యాద‌వులు శ్రీకృష్ణుడి వార‌సుల‌ని, నీతి నిజాయితీకి మారుపేర‌ని తెలిపారు.

G

Hyderabad | Published On Jul 26, 2026, 3.34 pm IST

Talasani Srinivas Yadav | యాద‌వులు లేనిదే చ‌రిత్ర లేదు.. ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం: త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌
Advertisement

Talasani Srinivas Yadav | త్రినేత్ర‌.న్యూస్‌: యాద‌వులు లేనిదే చ‌రిత్ర లేద‌ని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav) అన్నారు. యాద‌వులు శ్రీకృష్ణుడి వార‌సుల‌ని, నీతి నిజాయితీకి మారుపేర‌ని తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Sri Venkateshwara Swami Temple) ఆలయాన్ని మొదట తెరిచేది కూడా గొల్ల మిరాసి అని వెల్ల‌డించారు. విజయవాడలో యాదవ సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో జనాభా కలిగిన బలమైన సామాజిక వర్గం త‌మద‌న్నారు. అంతా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధిస్తామ‌ని, ఎవరి దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేద‌ని చెప్పారు.

రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా జాతి విషయానికి వచ్చే సరికి మనమంతా ఒక్కటిగా ఉండాల‌ని వెల్ల‌డించారు. కుల‌దైవం శ్రీ కృష్ణుడి జన్మదినం కృష్ణాష్టమిని ఘనంగా నిర్వహించాల‌ని సూచించారు. ఏ అవసరమొచ్చినా తాను ఉన్నానని గుర్తు పెట్టుకోవాల‌ని, త‌న పూర్తి అండదండలు ఉంటాయ‌న్నారు.

అంత‌కుముందు ఇంద్ర‌కీలాద్రిపై క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు. అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆల‌యం వెలుప‌ల మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మ దీవెనలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించానన్నారు. ఆషాఢ‌ మాసం (Ashada Masam) అంటే తెలంగాణలో ఒక పండుగ, బోనాలు సంబురాలు (Bonalu) అంబరాన్ని అంటుతాయ‌ని చెప్పారు. ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తార‌ని వెల్ల‌డించారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకు (Kanakadurgamma) 17 సంవత్సరాలుగా బోనం సమర్పించడం ఆనవాయితీగా వ‌స్తున్న‌ద‌ని తెలిపారు. అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందన్న భక్తుల విశ్వాసమ‌ని చెప్పారు. ఎల్ నినో (El Nino) ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయాని, అమ్మవారి చల్లని దీవెనలు తెలుగు రాష్ట్రాలపై ఉండాల‌న్నారు. విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాల‌ని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement