Rahul Gandhi | విద్యార్థులపై కాల్పులకు ఆదేశించింది ఎవరు? అమిత్ షాను నిలదీసిన రాహుల్
Rahul Gandhi | ఢిల్లీలో జులై 20న జరిగిన విద్యార్థుల ఆందోళనల సందర్భంగా దాడి ఘటన వ్యవహారంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆదివారం ఘాటు లేఖ రాశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై దారుణంగా బలప్రయోగం చేశారని ఆరోపించారు.
Rahul Gandhi | ఢిల్లీలో జులై 20న జరిగిన విద్యార్థుల ఆందోళనల సందర్భంగా దాడి ఘటన వ్యవహారంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆదివారం ఘాటు లేఖ రాశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై దారుణంగా బలప్రయోగం చేశారని ఆరోపించారు. కాల్పుల జరపాలని ఆదేశించి ఎవరూ? అని నిలదీసిన రాహుల్.. ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. పారదర్శకంగా, జవాబుదారీతనం ఉన్న విద్యా వ్యవస్థను కోరుతూ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారని రాహుల్ తెలిపారు. వారి డిమాండ్లను వినాల్సింది పోయి భద్రతా బలగాలతో బలప్రయోగానికి దిగారని ఆరోపించారు. దాడిలో వందలాది మంది విద్యార్థులు గాయపడ్డారని, మహిళా విద్యార్థులపై పోలీసులు దాడులకు పాల్పడ్డారని, వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని ఆరోపించారు.
వాళ్లు పోలీసులేనా..?
నిరసనల సందర్భంగా సాధారణ దుస్తుల్లో కనిపించిన కొందరు వ్యక్తులు విద్యార్థులపై దాడులు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై రాహుల్ ప్రశ్నలు లేవనెత్తారు. వారంతా పోలీసులా? వలంటీర్లా? ఎవరి ఆదేశాలతో వారిని అక్కడ మోహరించాంటూ నిలదీశారు. ఢిల్లీలో భద్రతా బలగాలన్నీ కేంద్ర హోంమంత్రి పరిధిలోనే పనిచేస్తాయని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు రాజ్యాంగబద్ధ హక్కని, నిరసనకారుల భద్రత కల్పించి వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. అయితే, విద్యార్థులపై జరిగిన హింస ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసిందని, దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైందన్నారు. దేశ భవిష్యత్ అయిన యువత ప్రశ్నలకు సమాధానాలు కోరుతోందని, వారి గొంతును అణచివేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కల్పించాలన్న విద్యార్థుల డిమాండ్‌ను చర్చల ద్వారా పరిష్కరించాల్సిందిపోయి బలప్రయోగానికి పాల్పడ్డారని రాహుల్ విమర్శించారు.
స్పష్టత ఇవ్వాలి..
మొత్తం ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బలప్రయోగానికి సంబంధించిన నిర్ణయం ఏ స్థాయిలో తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెల్లెట్ గన్ల వినియోగమే అత్యంత ఆందోళనకర అంశమని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. మీడియా, సామాజిక మాధ్యమాల కథనాల ప్రకారం పలువురు తీవ్రంగా గాయపడగా, ఓ జర్నలిస్టు కూడా బాధితుల్లో ఉన్నారని తెలిపారు. పెల్లెట్ గన్ తూటా తగిలి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచ్‌హాబ్‌ను తాను పరామర్శించానని, అతను ఒక కన్ను చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని పేర్కొన్నారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్, ఇతర ప్రాణాంతక ఆయుధాల వినియోగానికి కేంద్ర హోంమంత్రి అనుమతి ఇచ్చారా? ఇవ్వకపోతే ఆదేశాలు జారీ చేసింది ఎవరు? అని అమిత్ షాను రాహుల్ ప్రశ్నించారు.
छात्रों को मारने का आदेश किसने दिया? pic.twitter.com/NDwfka1UqO
— Rahul Gandhi (@RahulGandhi) July 26, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Srinivas Goud | తుంగభద్రపై అక్రమంగా డ్యామ్‌లు.. తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్
- ●Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ఈజ్ బ్యాక్ - భర్త, కూతురితో హైదరాబాద్‌లో ల్యాండైన ప్రియాంక చోప్రా
- ●Talasani Srinivas Yadav | యాదవులు లేనిదే చరిత్ర లేదు.. ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం: తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●Mann Ki Baat | అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి
- ●Servant Theft Cases | పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు.. మనం ఇచ్చే అవకాశమే నేరానికి కారణం: వీసీ సజ్జనార్
- ●Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - రజనీకాంత్‌కు పోటీగా!

Srinivas Goud | తుంగభద్రపై అక్రమంగా డ్యామ్‌లు.. తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్

Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ఈజ్ బ్యాక్ - భర్త, కూతురితో హైదరాబాద్‌లో ల్యాండైన ప్రియాంక చోప్రా

Talasani Srinivas Yadav | యాదవులు లేనిదే చరిత్ర లేదు.. ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం: తలసాని శ్రీనివాస్ యాదవ్

Mann Ki Baat | అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి






