Asaduddin Owaisi | యూపీ ఎలక్షన్స్: అఖిలేష్ యాదవ్‌కు అసదుద్దీన్ ఒవైసీ బంపర్ ఆఫర్.. ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ అంటూ బీజేపీ సెటైర్లు
యూపీ రాజకీయాల్లో కీలక పరిణామం. బీజేపీని ఓడించేందుకు అఖిలేష్ యాదవ్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమన్నారు ఒవైసీ. దీనిపై బీజేపీ వేసిన సెటైర్ ఏంటంటే?
- యూపీలో సమాజ్‌వాదీ పార్టీతో (SP) పొత్తుకు మజ్లిస్ (AIMIM) చీఫ్ ఒవైసీ సుముఖత
- ఎన్నికల తర్వాత ఏడ్చే బదులు, ఇప్పుడే మాట్లాడుకుందామని అఖిలేష్‌కు ఓపెన్ ఆఫర్
- ఓట్లను చీల్చడం ఇష్టం లేదని, హక్కుల కోసమే తమ ఫైట్ అని స్పష్టీకరణ
- ఇది ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని, అఖిలేష్‌కు ఒవైసీ 'ఫ్రెండ్ రిక్వెస్ట్' పంపారని బీజేపీ సెటైర్లు
Asaduddin Owaisi | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో (UP Politics) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 2027లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ నాటికి అధికార బీజేపీకి చెక్ పెట్టేందుకు ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ఓ భారీ ఆఫర్ ఇచ్చారు. సమయం మించిపోకముందే పొత్తుల (Alliance) పై చర్చలు ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు.
కలిసి పోటీ చేద్దాం.. ఇప్పుడే మాట్లాడుకుందాం
యూపీలో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మజ్లిస్ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదని ఒవైసీ స్పష్టం చేశారు. "నేను అఖిలేష్‌తో చేతులు కలపడానికి, పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మాట్లాడుకోవడానికి ఇదే సరైన సమయం. ఎలక్షన్స్ అయిపోయాక ఏడ్చి లాభం లేదు" అని మొరాదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఒవైసీ కుండబద్దలు కొట్టారు.
ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీని ఢీకొట్టే ప్రధాన ప్రతిపక్షంగా సమాజ్‌వాదీ పార్టీ నిలిచింది. అయితే, ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకుండా ఉండేందుకే తాను ఈ ఆఫర్ ఇస్తున్నట్లు ఒవైసీ తెలిపారు. "మేము పోటీ చేస్తే మీ ఓట్లు చీలిపోతాయని మీరు (అఖిలేష్‌ను ఉద్దేశించి) అంటున్నారు. అందుకే నేను మీతో కలిసొస్తానని చెబుతున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
మా ఫైట్ న్యాయం కోసమే..
ఏఐఎంఐఎం పోరాటం ఏ మతానికీ వ్యతిరేకం కాదని హైదరాబాద్ ఎంపీ ఒవైసీ మరోసారి గుర్తుచేశారు. "మా ఫైట్ అంతా గౌరవం, న్యాయం కోసమే. మేము చాప మీద కూర్చోవాలనుకోవడం లేదు, మాకు సమానత్వం కావాలి. అఖిలేష్ కుర్చీలో కూర్చుంటే, ఆ కుర్చీ ఎదురుగా ఒవైసీ కాలు మీద కాలేసుకుని కూర్చుని మరీ హక్కులు, న్యాయం గురించి మాట్లాడుతాడు" అని ఆయన తేల్చి చెప్పారు.
బీజేపీ రియాక్షన్: 'ఇది ఓటు బ్యాంకు పాలిటిక్స్'
ఒవైసీ కామెంట్స్‌పై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. దీనిని 'ఓటు బ్యాంకు రాజకీయాల కొలాబరేషన్' గా అభివర్ణించారు.
"బుజ్జగింపు రాజకీయాల్లో అఖిలేష్, ఒవైసీ ఎప్పుడూ పోటీ పడుతుంటారు. ఇప్పుడు 'కౌన్ బనేగా బడా భైజాన్' అనే పోటీని పక్కనపెట్టి.. భైజాన్ కొలాబరేషన్ (Collaboration) చేసుకుందామంటున్నారు. అందుకే అఖిలేష్ జీకి ఒవైసీ ఒక 'ఫ్రెండ్ రిక్వెస్ట్' (Friend Request) పంపారు" అని పూనావాలా సెటైర్లు వేశారు. ఈ ఇద్దరు నేతలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని ఆయన విమర్శించారు.
కాగా, పార్లమెంట్ ఎన్నికలకు ముందు సెమీ-ఫైనల్‌గా భావించే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 2027లో ఎన్నికలు జరగనున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Srinivas Goud | తుంగభద్రపై అక్రమంగా డ్యామ్‌లు.. తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్
- ●Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ఈజ్ బ్యాక్ - భర్త, కూతురితో హైదరాబాద్‌లో ల్యాండైన ప్రియాంక చోప్రా
- ●Talasani Srinivas Yadav | యాదవులు లేనిదే చరిత్ర లేదు.. ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం: తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●Mann Ki Baat | అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి
- ●Servant Theft Cases | పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు.. మనం ఇచ్చే అవకాశమే నేరానికి కారణం: వీసీ సజ్జనార్
- ●Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - రజనీకాంత్‌కు పోటీగా!

Srinivas Goud | తుంగభద్రపై అక్రమంగా డ్యామ్‌లు.. తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్

Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ఈజ్ బ్యాక్ - భర్త, కూతురితో హైదరాబాద్‌లో ల్యాండైన ప్రియాంక చోప్రా

Talasani Srinivas Yadav | యాదవులు లేనిదే చరిత్ర లేదు.. ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం: తలసాని శ్రీనివాస్ యాదవ్

Mann Ki Baat | అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి






