Namibian cheetah | రోజుకు రూ.35వేల మేకల్ని తింటున్న చీతాలు..!
Namibian cheetah | నమీబియా నుంచి తెచ్చిన (Namibian cheetah) జ్వాల (Jwala) మూడోసారి తల్లైంది. కూనోపార్క్‌లో ఆ చీతా తాజాగా ఐదు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ (Bhupender Yadav) ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
Namibian cheetah | దేశంలో అంతరించిపోయిన చీతాల (Cheetahs) పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆఫ్రికా నుంచి విడతల వారీగా చీతాలను భారత్‌కు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు తాజాగా కీలక మైలురాయిని చేరుకుంది. చీతాల కుటుంబం హాఫ్‌సెంచురీ దాటింది (Cheetahs cross half century).
నమీబియా నుంచి తెచ్చిన (Namibian cheetah) జ్వాల (Jwala) మూడోసారి తల్లైంది. కూనోపార్క్‌లో ఆ చీతా తాజాగా ఐదు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ (Bhupender Yadav) ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ మేరకు వీడియో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. వీటి రాకతో భారత గడ్డపై జన్మించి చీతా పిల్లల సంఖ్య 33కి పెరిగినట్లు తెలిపారు. వీటి రాకతో భారత్‌లో మొత్తం చిరుతల సంఖ్య సరికొత్త మైలురాయిని దాటినట్లు పేర్కొన్నారు. ఏకంగా హాఫ్‌సెంచురీ దాటి.. 53కు పెరగడం సంతోషకరమన్నారు.
దేశంలో అంతరించిపోయిన చీతాల (Cheetahs) పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆఫ్రికా నుంచి విడతల వారీగా చీతాలను భారత్‌కు తీసుకొచ్చింది. 2022, సెప్టెంబర్ 17న నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారత్‌కు తీసుకొచ్చింది. అందులో ఐదు ఆడ చీతాలు, మూడు మగ చీతాలు ఉన్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలు వచ్చాయి. వీటన్నింటినీ మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో వదిలారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పలు చిరుతలు మృతి చెందాయి. ప్రస్తుతం కూనో పార్క్‌లో 53 (తాజా కూనలతో కలిపి) చిరుతలు ఉన్నాయి.
ఏడాదిలో రూ.1.27 కోట్ల మేకల్ని తిన్న చీతాలు
మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కు (Kuno National Park)కు విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాల ఆహారం (Cheetah Meals) కోసం భారీగా ఖర్చు అవుతున్నట్లు ప్రభుత్వం (Madhya Pradesh government) ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రోజుకు రూ.35,000 ఖర్చు చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీకి వెల్లడించింది. 2024-25లో చీతాలకు ఆహారంగా వేసిన మేకల కోసం రూ.1,27,10,870 ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖేష్ మల్హోత్రా అడిగిన ప్రశ్నకు సీఎం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
Also Read..
బిడ్డ పుట్టిన క్షణం ఆ తండ్రి ఉద్వేగం చూడండి.. వీడియో షేర్ చేసిన డాక్టర్
ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ కొరత ఉండదు : బీజేపీ చీఫ్ రామచందర్ రావు
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






