Ramchander Rao | ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ కొరత ఉండదు : బీజేపీ చీఫ్ రామచందర్ రావు
Ramchander Rao | చమురు కొరత పేరుతో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు మండిపడ్డారు. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశంలో ఎక్కడా ముడి చమురు కొరత లేదు. ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ కొరత ఉండు అనేది వాస్తవం అని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో ముడి చమురు కొరత లేనే లేదు
దేశానికి సరిపడా నిల్వలు ఉన్నాయి
47 దేశాల నుంచి చమురు కొంటున్నాం
కాంగ్రెస్ చర్యల వల్లే పెట్రోల్ ధరల పెంపు
Ramchander Rao | త్రినేత్ర.న్యూస్ : చమురు కొరత పేరుతో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు మండిపడ్డారు. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశంలో ఎక్కడా ముడి చమురు కొరత లేదు. ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ కొరత ఉండు అనేది వాస్తవం అని ఆయన స్పష్టం చేశారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయలో రామచందర్ రావు సోమవారం మీడియాతో మాట్లాడారు.
రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతారో ఆయనకే తెల్వదు.. అది వేరే మాట. భారతదేశ ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలి. భయభ్రాంతులకు గురి చేయాలి అనేది రాహుల్ ఉద్దేశం. యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎక్కడ కూడా చమురు కొరత ఉండదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దేశానికి సరిపడా నిల్వలు ఉన్నాయి. దిగుమతులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. 2014కు ముందు భారతదేశం 14 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకునేది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక 47 దేశాల నుంచి మనం చమురు కొంటున్నాం. దాంట్లో రష్యా కూడా ఒక భాగం. ప్రస్తుతం యుద్ధం భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, పెట్రోల్ కొరత వస్తుందని కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోంది. ఇదంతా అబద్ధం. ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ కొరత రానే రాదు. 2012లో ఇరాన్ సప్లై ఆపింది. 2005లో యూపీఏ ప్రభుత్వం ఐఏఈఏ(అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ)లో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓటేసింది. దీంతో క్రూడ్ ఆయిల్ సప్లైని భారత్‌కు ఆపేసింది. ఈ పాపమంతా కూడా కాంగ్రెస్ పార్టీది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ నేతలు.. ఇవాళ ఇరాన్‌కు అనుకూలంగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. నాడు ఇరాన్ క్రూడ్ ఆయిల్‌ను నిలిపివేయడంతోనే పెట్రోల్ ధరలు పెరిగాయని రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంబంధిత వార్తలు

Telangana SIR Process | “ఒక వ్యక్తికి ఒకే ఓటు” కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
జులై 6, 2026

Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జులై 6, 2026

Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..
జులై 6, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



