Cheetah Cubs | కునో నేషనల్ పార్క్‌లో నాలుగు చీతా కూనల మృతి
Cheetah Cubs | త్రినేత్ర.న్యూస్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో (Kuno National Park) నాలుగు చిరుత కూనలు (Cheetah Cubs) మృతిచెందాయి. ఈ నాలుగు పిల్లలు నెల రోజుల క్రితమే జన్మించడం గమనార్హం.
Cheetah Cubs | త్రినేత్ర.న్యూస్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో (Kuno National Park) నాలుగు చిరుత కూనలు (Cheetah Cubs) మృతిచెందాయి. వాటి కళేబరాలను మరో జంతువు పాక్షికంగా తినేసింది. ఈ నాలుగు పిల్లలు నెల రోజుల క్రితమే జన్మించడం గమనార్హం.
ఏప్రిల్ 11న కేజీపీ12 అనే ఆడ చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే అవి షియోపూర్ పరిధిలోని వాటి గుహ సమీపంలో మృతిచెంది ఉన్నాయి. అవి పాక్షికంగా తినేయబడ్డాయని అధికారులు తెలిపారు. వాటి తల్లి క్షేమంగా ఉందని వెల్లడించారు. అవి మే 11న సాయంత్రం సజీవంగా కనిపించాన్నారు. మరో జంతువు దాడి చేయడం వల్లే ఈ పిల్లలు మరణించినట్లుగా కనిపిస్తున్నదని చెప్పారు. పోస్ట్‌మార్టం, సమగ్ర దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు.
ఈ నాలుగు చిరుత పిల్లల మరణం తర్వాత, ప్రస్తుతం దేశంలో 53 చిరుతలు ఉన్నాయి. కునో జాతీయ పార్కులో 50 చిరుతలు ఆశ్రయం పొందుతున్నాయని అధికారులు తెలిపారు. వాటిలో 33 చిరుతలు ఇక్కడే జన్మించాయన్నారు. మరో మూడు చిరుతలు గాంధీ సాగర్ అభయారణ్యంలో ఉన్నాయి. ప్రస్తుతం జీవించి ఉన్న చిరుతలన్నీ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాయని చెప్పారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బోట్స్‌వానా నుంచి తొమ్మిది చిరుతలను కునో జాతీయ పార్కుకు తీసుకొచ్చారు. వాటిలో ఆరు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి. అంతకుముందు, 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను తీసుకురాగా, 2023లో దక్షిణాఫ్రికా నుండచి 12 చిరుతలు కునో నేషనల్ పార్టుకు వచ్చాయి.
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






