Newborn | బిడ్డ పుట్టిన క్షణం ఆ తండ్రి ఉద్వేగం చూడండి.. వీడియో షేర్ చేసిన డాక్టర్
Newborn | అప్పుడే పుట్టిన బిడ్డ (Newborn)ను చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఓ తండ్రి భావోద్వేగానికి గురైన మధుర క్షణాలను చెన్నైకి చెందిన ఓ వైద్యురాలు (Chennai doctor) సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Newborn | బిడ్డకు జన్మనివ్వడమంటే తల్లికి పునర్జన్మ లాంటిది. అయితే, చిన్నారి రాక మాత్రం తండ్రి (father)కి సరికొత్త అనుభూతిని అందిస్తుంది. మొదటిసారి బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు కలిగే ఆ ఫీలింగ్ మాట్లలో వర్ణించలేం. ఆ క్షణం జీవితంలో కొత్త బాధ్యతలను, ప్రేమను, ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. తాజాగా అలాంటి అనుభూతే ఓ తండ్రికి కలిగిన మధుర క్షణాలు ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అప్పుడే పుట్టిన బిడ్డ (Newborn)ను చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఓ తండ్రి భావోద్వేగానికి గురైన మధుర క్షణాలను చెన్నైకి చెందిన ఓ వైద్యురాలు (Chennai doctor) సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఏముందంటే.. అప్పుడే పుట్టిన బిడ్డను డాక్టర్ లేబర్ వార్డు నుంచి బయటకు తీసుకొచ్చింది. అక్కడ డోర్ వద్ద వెయిట్ చేస్తున్న చిన్నారి తండ్రి వద్దకు వెళ్లింది. బిడ్డను అతని చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించగా.. ఆ తండ్రి ఒకింత ఆందోళన చెందాడు. చిన్నారిని చేతుల్లోకి తీసుకునేందుకు కంగారు పడ్డాడు. అయితే, డాక్టర్ అతడిని సర్దిచెప్పడంతో చివరికి చిన్నారిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత పసికందును చూసి ఆ తండ్రి మురిసిపోయాడు. ఒకింత ఉద్వేగానికి లోనయ్యాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను డాక్టర్ "ఫాదర్ మూమెంట్స్" అంటూ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటి వరకూ 198 మిలిన్ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాల్ని హత్తుకుంటోంది. నెటిజన్లు ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు.
https://www.instagram.com/reel/DVkemtbEe9B/?utm_source=ig_embed&ig_rid=6d790dbf-5d42-4b16-97be-f7b18913b7a5
Also Read..
ఇరాన్ చమురు కేంద్రాలపై ఐడీఎఫ్ దాడులు.. ఇజ్రాయెల్‌పై అమెరికా అసహనం
ఇరాన్‌తో యుద్ధం ముగింపుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నీరు పెట్టించే ఆ పాటకు 30 ఏళ్లు.. బడి ఈడు పిల్లల బతుకు గేయం అది..
సంబంధిత వార్తలు

Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా
జులై 6, 2026

Vande Bharat Express | భారీ వర్షాలకు నీట మునిగిన పట్టాలు.. దూసుకెళ్లిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. వీడియో
జులై 5, 2026

Empire State Building | సినిమా తరహాలో ప్రమాదకర స్టంట్స్.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
జులై 2, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



