Cheetah Meals | చీతాలకు ఆహారంగా మేకలు.. ఏడాదికి రూ.1.27 కోట్ల ఖర్చు
Cheetah Meals | మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కు (Kuno National Park)లో చీతాల ఆహారం కోసం ఏడాదికి రూ.1,27,10,870 ఖర్చు చేసినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh government) ప్రకటించింది.
Cheetah Meals | మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కు (Kuno National Park)కు విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాల ఆహారం (Cheetah Meals) కోసం భారీగా ఖర్చు అవుతున్నట్లు ప్రభుత్వం (Madhya Pradesh government) ప్రకటించింది. ఇందుకోసం రోజుకు రూ.35,000 ఖర్చు చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీకి వెల్లడించింది. 2024-25లో చీతాలకు ఆహారంగా వేసిన మేకల కోసం రూ.1,27,10,870 ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖేష్ మల్హోత్రా అడిగిన ప్రశ్నకు సీఎం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
కునో నేషనల్ పార్క్‌లో చీతాల ఆహారం కోసం ఒక సంవత్సరంలో ఎంత మొత్తం ఖర్చు అయ్యిందో తెలపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ముకేశ్ మల్హోత్రా అసెంబ్లీలో ప్రశ్నించారు. అలాగే రోజుకు ఎన్ని మేకలను ఆహారంగా ఇస్తున్నారో కూడా చెప్పాలని కోరారు. ఈ పార్క్‌లో ప్రస్తుతం ఎన్ని చీతాలు ఉన్నాయి..? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సీఎం మోహన్ యాదవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. చీతాల ఆహారం కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపు లేదని స్పష్టం చేశారు.
అంతేకాదు, ఒక రోజులో చీతాలకు ఎంత ఆహారంగా ఇవ్వాలనే ప్రత్యేక ప్రమాణాలు ఏమీ లేవని చెప్పారు. అవసరమైన విధంగా మాంసం అందిస్తారని వివరించారు. ప్రస్తుతం కూనో నేషనల్ పార్క్‌లో మొత్తం 32 చీతాలు ఉన్నట్లు తెలిపారు. అయితే, చీతాల ఆహారంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. ఫ్రీ రేంజ్ కోసం తీసుకువచ్చిన చీతాలను నిర్బంధంలో ఉంచారని, రూ.కోట్ల విలువైన మేకలను ఆహారంగా ఇవ్వడం ప్రాజెక్టు వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు చేస్తున్నారు. మరోవైపు విదేశాల నుంచి తెచ్చిన ఈ చీతాల సంరక్షణ, పునరావాసం కోసం ఇప్పటి వరకూ రూ.100 కోట్లకుపైనే ఖర్చు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Also Read..
Whatsapp SIM Binding | సిమ్ లేకుండా ఇక వాట్సాప్ పనిచేయదా..? ఏమేం నియమాలను విధించారు..?
Arvind Kejriwal | కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు.. కోర్టు తీర్పుపై మాజీ సీఎం భావోద్వేగం
Liquor Policy Case | లిక్కర్ కేసు.. కేజ్రీవాల్, సిసోడియా, కవితకు భారీ ఊరట
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






