Cheetah | దేశంలో పెరుగుతున్న చీతాల కుటుంబం.. మూడు కూనలకు జన్మనిచ్చిన గామిని
Cheetah | దేశంలో చిరుతల సంఖ్య మరింత పెరిగింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని కూనో జాతీయ పార్క్ (Kuno National Park)లో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 'గామిని' (Gamini) అనే చీతా (South African Cheetah) మూడు కూన పిల్లలకు జన్మనిచ్చింది.
Cheetah | దేశంలో చిరుతల సంఖ్య మరింత పెరిగింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని కూనో జాతీయ పార్క్ (Kuno National Park)లో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 'గామిని' (Gamini) అనే చీతా (South African Cheetah) మూడు కూన పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ (Bhupender Yadav) ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ మేరకు వీడియో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
భారత గడ్డపై జన్మించి చీతా పిల్లల సంఖ్య 27కి పెరిగినట్లు తెలిపారు. ఇక వీటి రాకతో భారత్‌లో మొత్తం చిరుతల సంఖ్య 38కి పెరిగడం సంతోషకరమైన విషయమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గామిని ఇది రెండో కాన్పు అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. చీతాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించి వాటి వృద్ధికి కృషి చేస్తున్న ఫీల్డ్ సిబ్బంది, వైద్యులను ఆయన అభినందించారు. మరోవైపు గామిని మూడు కూనలకు జన్మనివ్వడంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా హర్షం వ్యక్తం చేశారు.
https://x.com/byadavbjp/status/2023950598392213650
దేశంలో అంతరించిపోయిన చీతాల (Cheetahs) పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆఫ్రికా నుంచి విడతల వారీగా చీతాలను భారత్‌కు తీసుకొచ్చింది. 2022, సెప్టెంబర్ 17న నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారత్‌కు తీసుకొచ్చింది. అందులో ఐదు ఆడ చీతాలు, మూడు మగ చీతాలు ఉన్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలు వచ్చాయి. వీటన్నింటినీ మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో వదిలారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పలు చిరుతలు మృతి చెందాయి. ప్రస్తుతం కూనో పార్క్‌లో 38 (తాజా కూనలతో కలిపి) చిరుతలు ఉన్నాయి. వాటిలో 27 భారత్‌లో జన్మించిన కూన పిల్లలు. కాగా, దేశంలో చిరుత ప్రాజెక్ట్ కోసం కేంద్రం ఇప్పటివరకు రూ.112 కోట్లకు పైగా ఖర్చు చేసింది.
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






