Mumbai Rains | ముంబైలో భారీ వర్షం.. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం
Mumbai Rains | తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న ముంబై (Mumbai) వాసులకు తొలకరి చినుకు పలకరించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ ముంబై దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురిసింది.
Mumbai Rains | తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న ముంబై (Mumbai) వాసులకు తొలకరి చినుకు పలకరించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ ముంబై దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురిసింది. దీంతో నగరం మొత్తం తడిసిముద్దయింది. ప్రధాన రహదారులపై భారీగా వర్షపునీరు చేరింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
#WATCH | Maharashtra | An underpass in Mumbai's Andheri area was closed after it was flooded due to severe water logging amid heavy rains in the city.
A BMC Official Rhitik says, "... We have not been able to find a temporary solution for this severe water logging... Our… pic.twitter.com/QsN7WbXjYw
— ANI (@ANI) June 23, 2026
ముంబై, పాల్ఘర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రాబోయే మూడు గంటల పాటూ ముంబై, థానే, రాయగఢ్, పాల్ఘర్, సింధు దుర్గ్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సాధారణంగా రావాల్సిన తేదీ కంటే (జూన్ 10న) 13 రోజులు ఆలస్యంగా మంగళవారం నాడు నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ముంబైని తాకాయి. దీంతో తీవ్రమైన ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించినట్లైంది.
ఇక రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ముంబైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల మోకాళ్లలోతు నీళ్లు నిలబడ్డాయి. దీంతో ఉదయం ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల చెట్లు కూలి వాహనాలు దెబ్బతిన్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుండి బుధవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో నగరంలో 300 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు బీఎంసీ తెలిపింది.
#WATCH | Maharashtra | Waterlogging witnessed in parts of the Mumbai city as a result of continuous heavy rainfall since last night. Orange Warning issued for moderate to intense spells of rain in Mumbai, Thane, Raigad, Palghar, and Sindhudurg districts: BMC
(Visuals from Dadar… pic.twitter.com/Dk8AyZ6vkK
— ANI (@ANI) June 24, 2026
Mumbai after just 2 hours of continuous rains🥲🥲 pic.twitter.com/RxRyyV9MHI
— Jyoti (@virgojyoti02) June 24, 2026
Also Read..
అధిక వేడి.. ఉపశమనం కోసం నీటిలో మునిగి 40 మంది మృతి..!
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు.. కాస్త రికవర్ అయిన ఐటీ షేర్లు..
మద్యం తాగొద్దన్నందుకు.. కొడుకుతో కలిసి తల్లిని చంపిన కూతురు..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TG TET | తెలంగాణ టెట్ ఫలితాలు ఎప్పుండంటే?.. సర్కార్ బడుల్లో ఖాళీగా 14 వేల టీచర్ పోస్టులు!
- ●CM family Land Scam | సీఎం కుటుంబం వందల ఎకరాల భూ స్కామ్.. సంచలనం రేపుతున్న నివేదిక
- ●Meta Arena | మెటా నుంచి కొత్త ప్లాట్ఫామ్.. డబ్బుతో అవసరం లేని బెట్టింగ్ వేదిక..
- ●Revanth Reddy | సర్పై మరింత అప్రమత్తంగా ఉండండి.. అలాంటి వారిపై చర్యలు తప్పవు: సీఎం రేవంత్
- ●Shree Charani | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్గా శ్రీ చరణి
- ●Colombia Vs DR Congo | కొలంబియాను గెలిపించిన మునోజ్

TG TET | తెలంగాణ టెట్ ఫలితాలు ఎప్పుండంటే?.. సర్కార్ బడుల్లో ఖాళీగా 14 వేల టీచర్ పోస్టులు!

CM family Land Scam | సీఎం కుటుంబం వందల ఎకరాల భూ స్కామ్.. సంచలనం రేపుతున్న నివేదిక

Meta Arena | మెటా నుంచి కొత్త ప్లాట్ఫామ్.. డబ్బుతో అవసరం లేని బెట్టింగ్ వేదిక..

Revanth Reddy | సర్పై మరింత అప్రమత్తంగా ఉండండి.. అలాంటి వారిపై చర్యలు తప్పవు: సీఎం రేవంత్






