26/11 Terror Attacks | 26/11 ముంబై ఉగ్రదాడి.. అమరులకు ప్రముఖుల నివాళులు
26/11 Terror Attacks | భారత చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటైన 2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి (26/11 Terror Attacks)కి 18 ఏళ్లు. కొలాబా (Colaba) సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన పాకిస్థాన్ ఉగ్రవాదులు.. నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. సుమారు 60 గంటల పాటు సాగిన ఈ మారణహోమంలో విదేశీయులతో సహా 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. నాటి చీకటి రోజును గుర్తు చేసుకుంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
26/11 Terror Attacks | త్రినేత్ర న్యూస్ : 2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి (26/11 Terror Attacks) భారత చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయింది. భారత చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటైన ఈ ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా 18 ఏళ్లు పూర్తయ్యాయి. సుమారు 60 గంటల పాటు సాగిన ఈ మారణహోమంలో విదేశీయులతో సహా 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు.
ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో ఎందరో భద్రతా సిబ్బంది అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి వీరమరణం పొందారు. నాటి చీకటి రోజును భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను యావత్ దేశం స్మరించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఉగ్రదాడిలో అమరులైన వారికి నివాళులర్పించారు.
ప్రముఖుల నివాళులు
ముంబై 26/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) గురువారం నివాళులర్పించారు. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన సైనికులు, పోలీసు సిబ్బంది త్యాగాలను ఆమె స్మరించుకున్నారు. దేశం కోసం వారు చేసిన నిస్వార్థ సేవ, త్యాగాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఎన్నటికీ దేశ ఐక్యతను, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్ని రూపాల్లో ఉన్న ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా (Amit Shah), జైశంకర్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం ఉగ్రదాడి అమరవీరులకు నివాళులర్పించారు. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భద్రతా సిబ్బందికి సెల్యూట్ చేశారు. వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మర్చిపోదని పేర్కొంటూ ఎక్స్ వేదికగా ట్వీట్లు పెట్టారు.
ముంబైలో మారణహోమం
2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు కొలాబా (Colaba) సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించి.. నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ దాడికి అజామ్ ఛీమా కీలక సూత్రధారిగా గుర్తించారు. దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు అజామ్ శిక్షణ ఇచ్చినట్లు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాది కసబ్‌ను సజీవంగా పట్టుకున్నారు. కోర్టు ఉరి శిక్ష విధించడంతో 2012 నవంబర్ 21న పూణేలోని ఎరవాడ జైలులో ఉరి తీశారు. 26/11 పేలుళ్ల ఘటన మాత్రమే కాకుండా ఇతర బాంబు పేలుళ్లకు కూడా అజామ్ సూత్రధారిగా వ్యవహరించారు. 2006లో ముంబై రైళ్లలో జరిగిన బాంబు పేలుడు వెనుక అతని హస్తం ఉందని అప్పట్లో తేల్చారు. ఈ పేలుళ్లలో 188 మంది ప్రాణాలు కోల్పోగా.. 800 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. 26/11 దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన తహవూర్ రాణా (Tahawwur Rana)ను అమెరికా అధికారులు భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. భారత్‌కు తీసుకొచ్చిన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రాణాను విచారించి, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచింది.
Also Read..
వికసిత్ భారత్ నిర్మాణానికి రాజ్యాంగ విలువలే మార్గదర్శకం : ప్రధాని మోదీ
121 కిలోల బంగారు ఆభరణాలు.. తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడి భారీ విరాళం
చరిత్ర సృష్టించిన ఎన్ఎస్ఈ.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎక్స్‌ఛేంజ్‌గా రికార్డు..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●High Court | కోర్టు ధిక్కరణ కేసు.. సీపీ రమేశ్‌రెడ్డి, డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
- ●Indian Army microlight aircraft | రన్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్.. భారత సైన్యం అసాధారణ ఫీట్..!
- ●Drug-Free India Awareness March | డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులు.. ప్రతి 15 రోజులకు 100 మంది వస్తున్నరు: గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి
- ●Nifty 50 | నిఫ్టీ 31,700కు చేరే ఛాన్స్.. ముందున్న కీలక అడ్డంకి ఇదే..
- ●Arvind Dharmapuri | రాష్ట్రంలో ప్రారంభమైన కాంగ్రెస్ పతనం.. ఎన్నికల నాటికి పూర్తిగా భూస్థాపితం: ఎంపీ అర్వింద్
- ●TTD | 121 కిలోల బంగారు ఆభరణాలు.. తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడి భారీ విరాళం

High Court | కోర్టు ధిక్కరణ కేసు.. సీపీ రమేశ్‌రెడ్డి, డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష

Indian Army microlight aircraft | రన్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్.. భారత సైన్యం అసాధారణ ఫీట్..!

Drug-Free India Awareness March | డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులు.. ప్రతి 15 రోజులకు 100 మంది వస్తున్నరు: గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి

Nifty 50 | నిఫ్టీ 31,700కు చేరే ఛాన్స్.. ముందున్న కీలక అడ్డంకి ఇదే..






