Heat Wave | అధిక వేడి.. ఉపశమనం కోసం నీటిలో మునిగి 40 మంది మృతి..!
Heat Wave | ఫ్రాన్స్ (France)లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. 1947 తర్వాత ఇదే అత్యధికం. వేడి నుంచి ఉపశమనం కోసం ఫ్రాన్స్ వాసులు నదులు, కాలువల వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో దాదాపు 40 మంది నీటిలో మునిగి ఈత రాక ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
International | Published On Jun 24, 2026, 9.56 am IST
Heat Wave | ఫ్రాన్స్ (France)లో ఎండలు మండిపోతున్నాయి. ఇటీవలే రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (Heat Wave) నమోదవుతున్నాయి. వడగాల్పుల తీవ్రతకు తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. 1947 తర్వాత ఇదే అత్యధిక టెంపరేచర్ అని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వేడి కారణంగా పారిస్ వాసులు, పర్యాటకులు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు బీచ్‌లకు పరుగులు తీస్తున్నారు. అక్కడ నీటిలో మునుగుతూ ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో దాదాపు 40 మంది నీటిలో మునిగి ఈత రాక ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఫ్రాన్స్ అంతటా హీట్ అలర్ట్
మంగళవారం ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడి రోజుగా (Hottest Day) నమోదైందని ‘మెటియో ఫ్రాన్స్’ వాతావరణ (Meteo France forecaster) శాఖ అధికారులు తెలిపారు. నైరుతి ప్రాంతంలోని ఒక పట్టణంలో గరిష్టంగా 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతలతో ఫ్రాన్స్ వ్యాప్తంగా 1300కు పైగా పాఠశాలలు మూసివేశారు. ఈఫిల్ టవర్ (Eiffel Tower) వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. వేడి నుంచి ఉపశమనం కోసం ఫ్రాన్స్ వాసులు నదులు, కాలువల వద్దకు వెళ్తున్నారు. అక్కడ ఈత కొడుతూ సేదతీరే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి జూన్ 18 నుంచి ఇప్పటి వరకూ 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ప్రధాని తెలిపారు. మరణించిన వారిలో యువకులే ఎక్కువ అని చెప్పారు.
ఐరోపా వ్యాప్తంగా ఇదే పరిస్థితి..
ఇక ఐరోపా (Europe) అంతటా తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. బ్రిటన్, ఇటలీ, బెల్జియం, ఇటలీ, స్విట్జర్లాండ్, స్పెయిన్ దేశాలు వేడి తీవ్రతకు అల్లాడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదువుతున్నాయి. తీవ్రమైన వేడి కారణంగా పాఠశాలలు, పర్యాటక ప్రాంతాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రకారం.. ఐరోపా ఖండం ప్రపంచ సగటు కంటే రెండింతలు వేగంగా వేడెక్కుతోంది. ఈ కారణంగానే తీవ్రమైన వడగాల్పులు, వేడి వాతావరణ పరిస్థితులు సంభవిస్తున్నాయి.
Also Read..
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు.. కాస్త రికవర్ అయిన ఐటీ షేర్లు..
మద్యం తాగొద్దన్నందుకు.. కొడుకుతో కలిసి తల్లిని చంపిన కూతురు..
పెండ్లి పేరుతో మోసం చేశాడు.. ఐపీఎల్ ఆటగాడిపై యువతి ఫిర్యాదు
తాజావార్తలు
- ●Maheshkumar Goud | బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
- ●Anaswara Rajan | చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘కాకా’ ఫస్ట్ లుక్ విడుదల
- ●Kangana Ranaut | టార్గెట్ ఎప్పుడూ మహిళే.. ఆ ధోరణి ఎప్పుడు మారుతుందో..? : త్రిష వివాదంపై కంగన రనౌత్
- ●Kanohar Electricals IPO | కనోహర్ ఎలక్ట్రికల్స్ ఐపీవోకు విశేష స్పందన.. 31 శాతం లాభం అంచనా..
- ●MLA Veerlapalli Shankar | కేసీఆర్ చనిపోవాలి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు
- ●Leopard | గాయపడిన చిరుతను కాపాడేందుకు వెళ్లగా.. అధికారులపై దాడి.. షాకింగ్ వీడియో

Maheshkumar Goud | బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్

Anaswara Rajan | చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘కాకా’ ఫస్ట్ లుక్ విడుదల

Kangana Ranaut | టార్గెట్ ఎప్పుడూ మహిళే.. ఆ ధోరణి ఎప్పుడు మారుతుందో..? : త్రిష వివాదంపై కంగన రనౌత్

Kanohar Electricals IPO | కనోహర్ ఎలక్ట్రికల్స్ ఐపీవోకు విశేష స్పందన.. 31 శాతం లాభం అంచనా..






