Murder | మందు తాగొద్దన్నందుకు.. కొడుకుతో కలిసి తల్లిని చంపిన కూతురు..
Murder | మద్యానికి అలవాటు పడిన కూతురిని మందలించడమే ఆ తల్లికి పాపమైంది. తరచూ మందు తాగి (Alcohol Consumption) ఇంట్లో గొడవ చేస్తుండటంతో వద్దని చెప్పింది. దీంతో తన కొడుకుతో కలిసి కన్నతల్లిని చంపేసింది (Murder) ఓ మహిళ. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
Murder | త్రినేత్ర.న్యూస్: మద్యానికి అలవాటు పడిన కూతురిని మందలించడమే ఆ తల్లికి పాపమైంది. తరచూ మందు తాగి (Alcohol Consumption) ఇంట్లో గొడవ చేస్తుండటంతో వద్దని చెప్పింది. దీంతో తన కొడుకుతో కలిసి కన్నతల్లిని చంపేసింది (Murder) ఓ మహిళ. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
హసన జిల్లా హణ్ణినకెరెకు చెందిన జయమ్మ (70) అనే వృద్ధురాలికి భాగ్యలక్ష్మి (41) అనే కూతురు ఉన్నది. ఆమె భర్త కృష్ణ నాయక్ ఊళ్లో ఉంటూ పనిచేసుకుంటున్నాడు. వీరికి కుమరుడు కుశాల్ (26) ఉన్నది. భాగ్యలక్ష్మి (Bhagyalakshmi) తన కొడుకు కుశాలత్ కలిసి బెంగళూరులోని సుభాష్‌నగర్‌లోని మోనిషా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. జయమ్మ (Jayamma) అప్పుడప్పుడు తన కూతురు ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చి కొద్దిరోజుల పాటు ఉండి వెళ్లేది.
ఈ క్రమంలో భాగ్యలక్ష్మి, కుశాల్ (Kushal) ఇద్దరూ ఇంట్లోనే మద్యం తాగి కేకలు వేయడాన్ని గుర్తించిన జయమ్మ.. తన కూతురిని మందలించింది. అయినప్పటికీ ఆమెలో మార్పు లేదు. దీంతో అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న నివాసులు ఊళ్లో ఉంటున్న కుశాల్ తండ్రి కృష్ణ నాయక్‌ను పిలిపించారు. మద్యం మాన్పించేందుకు పునరావాస, సంస్కరణ కేంద్రానికి పంపించాలని చెప్పారు. దీంతో ఆయన తన కుమారుడు కుశాల్‌ను ఒక కేంద్రంలో చేర్పించారు.
కొద్ది వారాల తర్వాత ఇంటికి వచ్చిన కుశాల్.. మళ్లీ తల్లితో కలిసి తాగడం మొదలుపెట్టారు. దీంతో కుమారుడితో కలిసి తాగుతున్న తన కుమార్తెను జయమ్మ పలుసార్లు మందలించింది. ఇద్దరూ తమ తీరు మార్చుకోకపోగా వృద్ధురాలితో గొడవపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి వరకు తల్లీ కుమారుడు కలిసి మద్యం సేవించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన జయమ్మ తలపై కట్టెతో గట్టిగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతించెందారు. అయితే వృద్ధురాలు కేకలు వేయడంతో ఇరుగు పొరుగు ఫ్లాట్లలో ఉంటున్న వారు వచ్చి తలుపుతట్టారు. తన తల్లి స్నానాల గదిలో కాలుజారి మరణించిందని నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని.. తల్లీ, కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
సంబంధిత వార్తలు

Woman Kidnapped | దారుణం.. తీసుకున్న అప్పు కట్టలేదని.. మహిళను కిడ్నాప్ చేసి, నగ్నంగా వీడియో తీసి
సెప్టెంబర్ 5, 2026

Travel Bus | అనంతపురంలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం
సెప్టెంబర్ 4, 2026

Medical Emergency | దోహా నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానం.. మస్కట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Canada | కెనడా ఎదురుదెబ్బ.. అమెరికా ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు..
- ●Revanth meets Gaddam Prasad | స్పీకర్‌కు రేవంత్, భట్టి ఓదార్పు
- ●G2 Movie | ‘జీ2’లో అడివి శేష్‌కు జోడీగా ఫస్ట్ ఛాయిస్ వామికా కాదట.. ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?
- ●Shruti Haasan | స్టైలిష్ లుక్‌లో శ్రుతి హాసన్.. నెట్టింట ఫొటోలు వైరల్..
- ●Teenmar Mallanna | మా దళిత బిడ్డ కూర్చుంటే కళ్లు మండుతున్నయ్: తీన్మార్ మల్లన్న
- ●KTR and Harish Rao Arrest | ఎర్రవల్లి వద్ద హైటెన్షన్: 'ఎవడ్రా నువ్వు' అంటూ పోలీసుల జులుం.. కేటీఆర్, హరీష్ రావుల అరెస్ట్

Canada | కెనడా ఎదురుదెబ్బ.. అమెరికా ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు..

Revanth meets Gaddam Prasad | స్పీకర్‌కు రేవంత్, భట్టి ఓదార్పు

G2 Movie | ‘జీ2’లో అడివి శేష్‌కు జోడీగా ఫస్ట్ ఛాయిస్ వామికా కాదట.. ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?

Shruti Haasan | స్టైలిష్ లుక్‌లో శ్రుతి హాసన్.. నెట్టింట ఫొటోలు వైరల్..



