త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Akhilesh Yadav | బీజేపీకి ఇదే అతిపెద్ద రాజకీయ తప్పిదం కానుంది : అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav | కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ (Delimitation) బిల్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజకీయాల్లోనే అతిపెద్ద తప్పిదంగా మారుతుందని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) వ్యాఖ్యానించారు.

D

National | Published On Nov 27, 2026, 1.17 pm IST

Akhilesh Yadav | బీజేపీకి ఇదే అతిపెద్ద రాజకీయ తప్పిదం కానుంది : అఖిలేష్ యాదవ్
Advertisement

త్రినేత్ర న్యూస్ : నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లును తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న విష‌యం తెలిసిందే. ఈ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ బిల్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజకీయాల్లోనే అతిపెద్ద తప్పిదంగా మారుతుందని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు. కాగా, జనగణనను ఆలస్యం చేయడానికే మహిళా రిజర్వేషన్ చట్ట సవరణలను ప్రభుత్వం వాడుకుంటోందని అఖిలేష్‌ గతంలో ఆరోపించిన విష‌యం తెలిసిందే.

అసలు ఉద్దేశం అదే..

మ‌రోవైపు పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల వెనుక ప్ర‌భుత్వ ఉద్దేశాల‌ను కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేష్ (Jairam Ramesh) తీవ్రంగా ప్ర‌శ్నించారు. మహిళా రిజర్వేషన్ల కోసమే ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును ఆమోదించుకోవడమేనని ఆరోపించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు. మ‌హిళ‌ల‌కు మూడింట ఒక వంతు (33%) రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే నారీ శ‌క్తి వంద‌న్ అధినియం చ‌ట్టాన్ని 2023 సెప్టెంబ‌ర్‌లోనే పార్ల‌మెంట్ ఏక‌గ్రీవంగా ఆమోదించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

మహిళా రిజర్వేషన్ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చినప్పటికీ.. దానిని మూడేళ్లకు పైగా పక్కన పెట్టారని రమేష్ ఆరోపించారు. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను అపహాస్యం చేసి, ఎన్నికల ప్ర‌క్రియ‌ విశ్వసనీయతను దెబ్బతీసిన జ్ఞానేష్ కుమార్ చేతిలో నియోజకవర్గాల భౌగోళిక స్వరూపాన్ని నిర్ణయించే అధికారాలు పెట్టడం అత్యంత దారుణమని విమర్శించారు. ఒత్తిడిలో ఉన్న ప్రధాని ఈ నిరాశాజనక నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించుకోవడానికి ప్రభుత్వం మూడింట రెండొంతుల మెజారిటీ కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించిన జైరాం ర‌మేష్‌.. ప్రభుత్వ చర్యలను విపక్షాలు దృఢ సంకల్పంతో అడ్డుకుంటాయని స్పష్టం చేశారు.

Also Read..

లోక్‌సభలో మెజారిటీ కోసం మోదీ ప్రభుత్వం కుట్ర: కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు

అమిత్ షాకు జ్ఞాప‌క‌శ‌క్తి లోపించింది : చిదంబ‌రం

SIP మిస్ అయితే.. బ్యాంక్ ఖాతా, సిబిల్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా..?

Advertisement
Advertisement