Stock Markets | స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. రికవర్ అవుతున్నాయా..?
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమ ధోరణితో ట్రేడ్ అవుతున్నాయి. ఆరంభంలో స్వల్ప నష్టాలతో మొదలై సూచీలు ఇంట్రా డే కనిష్టానికి చేరినా తరువాత రికవర్ అయి ఇంట్రా డే గరిష్టానికి దగ్గర్లో ఉన్నాయి.ఇటీవలి కాలంలో దేశీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చోటు చేసుకుంటన్న అనేక రాజకీయ, ఆర్థిక పరిణామాలతోపాటు, తాజాగా ప్రధాని మోదీ చేసిన పొదుపు వ్యాఖ్యలపై మార్కెట్లు తీవ్రంగా స్పందించాయి.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమ ధోరణితో ట్రేడ్ అవుతున్నాయి. ఆరంభంలో స్వల్ప నష్టాలతో మొదలై సూచీలు ఇంట్రా డే కనిష్టానికి చేరినా తరువాత రికవర్ అయి ఇంట్రా డే గరిష్టానికి దగ్గర్లో ఉన్నాయి.ఇటీవలి కాలంలో దేశీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చోటు చేసుకుంటన్న అనేక రాజకీయ, ఆర్థిక పరిణామాలతోపాటు, తాజాగా ప్రధాని మోదీ చేసిన పొదుపు వ్యాఖ్యలపై మార్కెట్లు తీవ్రంగా స్పందించాయి. అంతకు ముందు రెండు రోజులుగా వరుసగా నష్టాల్లో ఉన్న మార్కెట్లు మోదీ వ్యాఖ్యల అనంతరం మళ్లీ రెండు రోజులు, మొత్తం కలిపి వరుసగా నాలుగు రోజులు భారీగా పతనమయ్యాయి. అయితే బుధవారం మాత్రం కాస్త కోలుకున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కెమికల్, మిడ్ క్యాప్ హెల్త్ కేర్ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అలాగే ఆటో, బ్యాంకింగ్, ఐటీ, రియాల్టీ రంగాలు ఒత్తిడిలో ఉన్నా, కాస్త పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు స్థిరంగా ఉన్నాయి.
మిశ్రమ ధోరణిలో సూచీలు..
బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ50 స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. 85 పాయింట్లకు పైగా లాభంలో ఉన్న నిఫ్టీ ప్రస్తుతం 23,466 వద్ద ఉండగా, సెన్సెక్స్ 140 పాయింట్లకు పైగా లాభంలో ఉండి 74,700 దిగువన ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్లలోనూ మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. టోక్యో కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల వరకు అమెరికా ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇక జపాన్ నిక్కీ 225 సూచీ 0.4 శాతం పెరిగింది. టోపిక్స్ 1 శాతం పెరగ్గా, ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ, ఏఎస్ఎక్స్ 200 సూచీ 0.5 శాతం పడిపోయింది. హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్ 0.3 శాతం నష్టపోగా, షాంఘై కంపోజిట్ మిశ్రమ ధోరణి ప్రదర్శిస్తోంది.
స్వల్పంగా తగ్గిన చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర 1.16 శాతం తగ్గి బ్యారెల్‌కు 106 డాలర్ల వద్ద ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 1.78 శాతం తగ్గి బ్యారెల్‌కు 96 డాలర్ల వద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి విలువ మళ్లీ పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 0.03 శాతం పతనమై 95.65 వద్ద ఉంది. అయితే మార్కెట్లలో ప్రస్తుతం వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. దేశీయంగా లేదా అంతర్జాతీయ ఏవైనా పరిణామాలు చోటు చేసుకున్నా, వార్తలు వచ్చినా అవి మార్కెట్లపై నేరుగా ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో సెషన్లోనూ భారీ జోష్.. కొనసాగుతున్న బుల్ ర్యాలీ..
జులై 6, 2026

SEBI | సెబీ కీలక నిర్ణయం.. ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్‌లకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..
జులై 6, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్, నిఫ్టీ పరుగులు..
జులై 6, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



