#StandWithHer | మౌనం వీడుదాం.. బాసటగా నిలుద్దాం: డీజీ చారుసిన్హా
#StandWithHer | త్రినేత్ర.న్యూస్: మహిళలపై వేధింపులు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా నేరమేనని, ఆ నిశ్శబ్దాన్ని వీడి బాసటగా నిలవడమే అసలైన పౌర బాధ్యతని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సిన్హా (Charu Sinha) అన్నారు.
#StandWithHer | త్రినేత్ర.న్యూస్: మహిళలపై వేధింపులు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా నేరమేనని, ఆ నిశ్శబ్దాన్ని వీడి బాసటగా నిలవడమే అసలైన పౌర బాధ్యతని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సిన్హా (Charu Sinha) అన్నారు. కేవలం చట్టాలు, పోలీసుల నిఘాతోనే భద్రత సాధ్యం కాదని, ప్రతి పురుషుడి ఆలోచనలో మార్పు వచ్చినప్పుడే మహిళలకు అసలైన రక్షణ లభిస్తుందని (Women's Safety) చెప్పారు. ఇందులో భాగంగా పురుషులను సామాజిక పోరాటంలో భాగస్వాములను చేసేందుకు ‘స్టాండ్ విత్ హర్’ (#StandWithHer) అనే వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ డిజిటల్ క్యాంపెయిన్ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నదని, దీనికి మద్దతుగా సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు.
సమాజంలో మహిళలపై జరిగే చిన్నపాటి అవహేళనలు మొదలుకుని దారుణమైన నేరాల వరకు చాలా సందర్భాల్లో పురుషులు మౌనంగా ఉండిపోతారని, అయితే ఆ నిశ్శబ్దం కూడా నేరానికి పరోక్షంగా మద్దతు ఇవ్వడమేనని స్పష్టం చేశారు. మౌనం వీడి బాధ్యతాయుతమైన పౌరులుగా గళమెత్తాలని, కేవలం ప్రేక్షకులుగా కాకుండా మార్పునకు నాంది పలికే నాయకులుగా ఎదగాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. డిజిటల్ వేదికగా సాగుతున్న ఈ కార్యక్రమంలో సినీ నటుడు అడివి శేష్‌తో పాటు విరాజిత, దీపక్ కరముంగికర్, శరత్ నల్లా, చిల్లర్ బాయ్ వంటి ప్రముఖులు భాగస్వాములయ్యారని తెలిపారు.
ఆ విధానం మారాలి..
ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఒక మహాసముద్రంతో పోల్చిన అడివి శేష్.. మహిళలపై వచ్చే అసభ్యకర వ్యాఖ్యలు, ట్రోలింగ్‌ను అంటుకునే ఇసుకగా అభివర్ణించారని, ఆ ఇసుకను తుడిచేయాల్సిన బాధ్యత ప్రతి పురుషుడిపై ఉందని సందేశమిచ్చారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఏదైనా ఫొటో లేదా వీడియోను షేర్ చేసే ముందు సదరు మహిళా మిత్రుల అనుమతి తీసుకోవడం ప్రాథమిక సంస్కారమని, అది వారి హక్కు అని గుర్తుచేశారు. వీధుల్లోనే కాకుండా కార్యాలయాలు, కుటుంబాల్లోనూ ఆడవారి పట్ల గౌరవం పెరగాలని, వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక వెక్కిరించడం లేదా బాడీ షేమింగ్ చేయడం వంటి ధోరణులు మారాలని సూచించారు.
రోల్ మోడల్‌గా..
ప్రతి పురుషుడు తన రోజువారీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని, తోటి పురుషులకు ఆదర్శంగా నిలిచి మహిళలకు భరోసా ఇచ్చేలా రోల్ మోడల్‌గా మారాలని ఆకాంక్షించారు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయంగా మారినప్పుడే సమాజంలో నిజమైన మార్పు వస్తుందన్నారు. ఇంట్లోని ఆడబిడ్డను ఎంతగా ఆదరిస్తామో, బయటి మహిళల పట్ల కూడా అదే గౌరవం చూపినప్పుడే సురక్షిత వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ఈ గొప్ప మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని, ఎక్కడైనా తప్పు జరుగుతున్నప్పుడు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోకుండా ధైర్యంగా ప్రశ్నించాలని చెప్పారు.
సంబంధిత వార్తలు

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
జులై 6, 2026

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
జులై 6, 2026

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
జులై 6, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



