Bhojshala-Kamal Maula | భోజ్‌శాల హిందువులదే.. పూజలు చేసుకోవచ్చు.. కోర్టు కీలక తీర్పు
Bhojshala-Kamal Maula | వివాదాస్పద భోజ్‌శాల-కమల్ మౌలా (Bhojshala-Kamal Maula) కాంప్లెక్స్ విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అది హిందూ దేవాలయం అని, సరస్వతీ దేవి (goddess Saraswati) క్షేత్రమని మధ్యప్రదేశ్ హైకోర్టు (MP High Court) ప్రకటించింది. అక్కడ హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతించింది.
Bhojshala-Kamal Maula | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ధర్ (Dhar) జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్‌శాల-కమల్ మౌలా (Bhojshala-Kamal Maula) కాంప్లెక్స్ విషయంలో ఆ రాష్ట్ర హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. అది హిందూ దేవాలయం అని, సరస్వతీ దేవి (goddess Saraswati) క్షేత్రమని మధ్యప్రదేశ్ హైకోర్టు (MP High Court) ప్రకటించింది. దశాబ్దాలుగా ఉన్న వివాదానికి ముగింపు పలుకుతూ అక్కడ హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతించింది.
కాగా, భోజ్‌శాల ఆలయ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇది దేవాలయం అని హిందూ సంఘాలు అంటుండగా, ఇది తమకే చెందినదని ముస్లిం సంఘాలు వాదిస్తున్నాయి. హిందూవులు వాగ్దేవి (సరస్వతి) దేవాలయంగా భావిస్తారు. ముస్లింలు దాన్ని కమల్ మౌలా మసీదుగా వ్యవహరిస్తుంటారు. ఈ వివాదం నేపథ్యంలో 2003లో ఈ ప్రదేశం హిందూ, ముస్లింలకు చెందినదని ఏఎస్‌ఐ (Archaeological Survey of India) తీర్పు చెప్పింది. అప్పటి నుంచి ఇక్కడ హిందువులు మంగళవారం పూజలు చేస్తే.. ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఇది తమకే చెందుతుందంటూ హిందువులు కోర్టును ఆశ్రయించాయి. ఇక్కడ నిరంతరం పూజలు చేసుకునే హక్కు కల్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
దీన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకించాయి. వివాదాస్పద స్థలం మసీదుకు చెందిందని ముస్లిం వర్గాల తెలిపాయి. దీంతో ఈ భోజ్‌శాల కాంప్లెక్స్ వివాదం నెలకొంది. ఇక ఈ వివాదాన్ని తేల్చాలని ఏఎస్‌ఐని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో 2024లో 98 రోజులపాటు పురావస్తుశాఖ సర్వే నిర్వహించింది. 2024 జులై 15న ఇండోర్ కోర్టుకు నివేదిక సమర్పించింది. నివేదిక ఆధారంగా ఇది దేవాలయమే అని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. అక్కడ సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకోవచ్చని ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. ఏఎస్‌ఐ నివేదిక, చారిత్రక సాక్ష్యాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read..
యూఏఈపై దాడులు ఆమోదయోగ్యం కాదు.. పశ్చిమాసియాలో శాంతికి సహకరిస్తాం : ప్రధాని మోదీ
వాతావరణ శాఖ చల్లటి కబురు.. మే 26 నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
భారత్ కు వాణిజ్య లోటు షాక్.. ఏప్రిల్‌లో భారీగా పెరిగిన దిగుమతులు..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్, నిఫ్టీ పరుగులు..
- ●Water Board | వాటర్‌బోర్డులో 965 ఉద్యోగాలు.. భర్తీకి అనుమతించిన ప్రభుత్వం!
- ●Wedding Cancelled | పెండ్లికి ముందే ఊరేగింపు.. డ్యాన్ చేయొద్దంటూ వధువుపై కోప్పడ్డ వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
- ●Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!
- ●Nampally Criminal Court | నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..
- ●Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్, నిఫ్టీ పరుగులు..

Water Board | వాటర్‌బోర్డులో 965 ఉద్యోగాలు.. భర్తీకి అనుమతించిన ప్రభుత్వం!

Wedding Cancelled | పెండ్లికి ముందే ఊరేగింపు.. డ్యాన్ చేయొద్దంటూ వధువుపై కోప్పడ్డ వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!






