Divorce for Snoring | రాత్రిళ్లు నీ గురక భరించలేపోతున్నా.. భర్తను విడాకులు కోరిన భార్య
Divorce for Snoring | త్రినేత్ర.న్యూస్ : వరకట్న వేధింపులు, గృహహింస కారణంగా చాలా మంది మహిళలు విడాకులు( Divorce ) కోరుకుంటారు. చివరకు కోర్టు మెట్లెక్కి విడాకులు కూడా తీసుకుంటారు. కానీ ఈవిడ మాత్రం తన భర్త గురక( Snoring )ను భరించలేకపోతున్నాను.. విడాకులు ఇవ్వండని దరఖాస్తు పెట్టుకున్నారు.
Divorce for Snoring | త్రినేత్ర.న్యూస్ : వరకట్న వేధింపులు, గృహహింస కారణంగా చాలా మంది మహిళలు విడాకులు( Divorce ) కోరుకుంటారు. చివరకు కోర్టు మెట్లెక్కి విడాకులు కూడా తీసుకుంటారు. కానీ ఈవిడ మాత్రం తన భర్త గురక( Snoring )ను భరించలేకపోతున్నాను.. విడాకులు ఇవ్వండని దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ విచిత్రమైన సమస్యకు ఫ్యామిలీ కౌన్సెలర్( Family Counselor ) చక్కటి పరిష్కారం చూపించారు. గురక అనేది సమస్యనే కాదు అని ఆ దంపతులకు తెలియజెప్పేలా చేశారు. విడాకులు అనే పదానికి స్వస్తి పలికి.. చివరకు మళ్లీ ఇద్దరు కలిసి ఉంటున్నారు.
రాత్రి వేళ భార్యకు ఊహించని సమస్య..!
మధ్యప్రదేశ్( Madhya Pradesh ) రాజధాని భోపాల్( Bhopal )కు చెందిన ఓ ఇద్దరు దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారిద్దరిది అన్యోన్యమైన దాంపత్య జీవితం. లగ్జరీ లైఫ్. ఆర్థిక సమస్యలు కూడా లేవు. అంతకు మించి కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు లేవు. సాఫీగా సంసారం జీవితం సాగిపోతోంది. కానీ రాత్రిళ్లు మాత్రమే భర్త నుంచి ఊహించని సమస్య భార్యకు ఎదురైంది.
సమస్య ఏంటంటే..?
తన భర్త బెడ్ మీద ఒరిగాడంటే చాలు.. గురక( Snoring ) పెడుతాడు. దీంతో ఆవిడకు నిద్రకు భంగం కలుగుతుంది. ఈ గురక కారణంగా ఆమెకు నిద్ర లేమి సమస్య ఏర్పడింది. గురక వల్ల సరిగ్గా నిద్రించలేకపోతున్నానని.. తమ ఐదేళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలకాలని ఆమె నిర్ణయించుకుంది. అంతేకాదు తనకు భర్త నుంచి విడాకులు కావాలని ఫ్యామిలీ కౌన్సెలర్ రీటా తులి( Rita Tuli )ని సంప్రదించింది.
నా భర్త చాలా మంచి వ్యక్తి..
నా భర్త చాలా మంచి వ్యక్తి.. నన్ను బాగా చూసుకుంటాడు. అత్తమామల వేధింపులు కూడా లేవు. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. ఉన్నదంతా ఒక్కటే సమస్య.. అది గురక. నా భర్త గురక పెట్టడం వల్ల రాత్రిళ్లు సరిగ్గా నిద్రించలేకపోతున్నాను.. నాకు విడాకులు ఇప్పించండి అని కౌన్సెలర్ రీటాను కోరింది బాధిత భార్య.
మూడు నెలల పాటు వేర్వేరుగా..
ఈ దంపతుల సమస్య విన్న కౌన్సెలర్ రీటా తులి ఆశ్చర్యపోయారు. వారిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. గురక పెడుతున్నాడని విడాకులు కోరడం సరికాదని బాధితురాలికి చెప్పారు. మూడు నెలల పాటు వేర్వేరుగా ఉండాలని సూచించారు. ఈ దూరం ఒకరి ప్రాముఖ్యత మరొకరికి తెలిసేలా చేసింది. ఈ క్రమంలో వారిద్దరి ఆలోచనలోనూ గొప్ప మార్పు తెచ్చింది. చిన్న కారణంతో వివాహ బంధానికి ముగింపు పలకడం సరైంది కాదని, కలిసి జీవించాలని ఇద్దరూ నిర్ణయించుకోవడంతో కథ సుఖాంతమైంది.
మరి మీ భర్త కూడా గురక పెడుతున్నాడని విడాకులు కోరుకునేరు సుమా..! అదో చిన్న సమస్య.. ఈ గురక నివారణకు ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి. వ్యాయామంతో పాటు యోగా, ధ్యానం చేస్తే గురకను దూరం పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Muharram | మొహర్రం ఊరేగింపులో పేలుడు.. పలువురికి గాయాలు.. వీడియో
జూన్ 26, 2026

Meenakshi Natarajan | నామినేషన్ తిరస్కరిస్తే.. ఈసీనే పరిష్కరించాలి : మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
జూన్ 12, 2026

Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●Argentina vs Cabo Verde | ముగిసిన కాబో వెర్డే పోరాటం
- ●Bhatti Vikramarka | అసలు రూట్లో కాకుండా డొంక మార్గంలో.. దారితప్పిన డిప్యూటీ సీఎం కాన్వాయ్..
- ●Egypt vs Australia | పెనాల్టీ షూటౌట్లో ఫరోస్ జోరు..
- ●Sun Transit in Cancer | కర్కాటక రాశిలోకి సూర్యుడు.. జూలై 16 నుంచి కుండపోత వర్షాలు..!
- ●Police Recruitment | పోలీసు శాఖలో 5 వేల కొలువులు.. త్వరలో నోటిఫికేషన్
- ●Horoscope | జూలై 4 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అదృష్టం అంతగా కలిసిరాదు!

Argentina vs Cabo Verde | ముగిసిన కాబో వెర్డే పోరాటం

Bhatti Vikramarka | అసలు రూట్లో కాకుండా డొంక మార్గంలో.. దారితప్పిన డిప్యూటీ సీఎం కాన్వాయ్..

Egypt vs Australia | పెనాల్టీ షూటౌట్లో ఫరోస్ జోరు..

Sun Transit in Cancer | కర్కాటక రాశిలోకి సూర్యుడు.. జూలై 16 నుంచి కుండపోత వర్షాలు..!



