త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Wedding Cancelled | పెండ్లికి ముందే ఊరేగింపు.. డ్యాన్ చేయొద్దంటూ వ‌ధువుపై కోప్ప‌డ్డ‌ వ‌రుడు.. ఆ త‌ర్వాత ఏమైందంటే?

Wedding Cancelled | పెండ్లి.. నూరేండ్ల పంట‌. వేర్వేరు కుటుంబాలు, ఆచార వ్య‌వ‌హారాలు, ఆలోచ‌న‌లు క‌లిగిన ఇద్ద‌రు వ్య‌క్తులు జీవితాంతం క‌లిసి ఉండేలా ముడివేసే బంధం. కానీ జంట‌గా జీవితాంతం క‌లిసి ఉండాల్సిన వారు.. చిన్న‌చిన్న కార‌ణాల‌కే విడిపోతున్నారు. కానీ ఇక్క‌డ పెండ్లి కాక‌ముందే (Wedding Cancelled) ఓ జంట విడిపోయింది.

G

National | Published On Jul 6, 2026, 9.34 am IST

Wedding Cancelled | పెండ్లికి ముందే ఊరేగింపు.. డ్యాన్ చేయొద్దంటూ వ‌ధువుపై కోప్ప‌డ్డ‌ వ‌రుడు.. ఆ త‌ర్వాత ఏమైందంటే?
Advertisement

Wedding Cancelled | త్రినేత్ర‌.న్యూస్‌: పెండ్లి.. నూరేండ్ల పంట‌. వేర్వేరు కుటుంబాలు, ఆచార వ్య‌వ‌హారాలు, ఆలోచ‌న‌లు క‌లిగిన ఇద్ద‌రు వ్య‌క్తులు జీవితాంతం క‌లిసి ఉండేలా ముడివేసే బంధం. కానీ జంట‌గా జీవితాంతం క‌లిసి ఉండాల్సిన వారు.. చిన్న‌చిన్న కార‌ణాల‌కే విడిపోతున్నారు. కానీ ఇక్క‌డ పెండ్లి కాక‌ముందే (Wedding Cancelled) ఓ జంట విడిపోయింది. చిన్న వివాదం కాస్తా.. క‌లిసి ఏడ‌డుగులు వేయాల్సిన వారిద్ద‌రిని దూరం చేసింది. అదెలా అంటారా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మార్కాపురం (Markapuram) జిల్లా రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన యువకుడి వివాహాన్ని, కంభం మండలం తురిమెళ్లకు చెందిన యువతితో పెద్దలు నిశ్చయించారు. ఆదివారం ఉదయం వేడుకకు ముహూర్తం పెట్టుకున్నారు. వ‌రుడి నివాసం వ‌ద్ద వివాహం. దీంతో శనివారం రాత్రి వధువుతో పాటు కుటుంబసభ్యులు చిన్నగానిపల్లికి వెళ్లారు. అనంత‌రం వధూవరులను వాహనం ఎక్కించి బంధువులు ఊరేగింపు నిర్వ‌హిస్తున్నారు. వివాహం కావ‌ల్సిన ఇద్ద‌రు వాహ‌నంలో ఉండ‌గా.. ఇరు కుటుంబాల వారు, స్థానిక యువకులు డ్యాన్స్‌ చేస్తూ కేరింతలు కొడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో వధూవరులూ డ్యాన్స్‌ చేయాలని కొందరు కోరారు.

దీంతో అమ్మాయి రెడీ అయింది. అబ్బాయి మాత్రం తాను డ్యాన్స్ (Dance) చేయ‌న‌ని చెప్పారు. వారు బ‌తిమాలినా ఒప్పుకోలేదు. నేను చేయ‌ను.. నువ్వూ చేయడానికి వీల్లేదంటూ అమ్మాయిని మందలించాడు. పెండ్లికి ముందే ఇలా కోప్ప‌డితే.. ముందుముందు ప‌రిస్థితి ఇంకెలా ఉంటుందోన‌ని.. అమ్మాయి తండ్రి కినుక వహించారు. వెంటనే తన కుమార్తెను వాహనం పైనుంచి దించి.. పెళ్లి వ‌ద్దు గిళ్లీ వద్దు.. అని సొంతూరికి తీసుకెళ్లాడు. వారితో కుటుంబ స‌భ్యులు, బంధ‌వులు వెళ్లిపోయారు. పెండ్లి తంతు నిలిచిపోవడంతో ఇరువైపుల వారూ కట్నకానుకల లావాదేవీలను సెటిల్‌ చేసుకున్నారు. అయితే అప్పటికే భారీగా ఖర్చు చేసిన వరుడి తరఫు వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement