Southwest Monsoon | వాతావరణ శాఖ చల్లటి కబురు.. మే 26 నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
Southwest Monsoon | ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు చెప్పింది. ఈ నెల 26 నాటికి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) కేరళ (Kerala)లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది.
Southwest Monsoon | ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు చెప్పింది. ఈ నెల 26 నాటికి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) కేరళ (Kerala)లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనికి అటు ఇటుగా 4 రోజుల వ్యత్యాసం ఉండొచ్చని పేర్కొంది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా రుతుపవనాలు 7 రోజుల వ్యత్యాసంతో జూన్ 1 నాటికి కేరళను తాకుతాయి. అక్కడి నుంచి ఉత్తర భారత దేశం దిశగా పయనించి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు చేరతాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఇండియాలో వర్షాకాలం ఉంటుంది. కాగా, గతేడాది మే 24నే కేరళలో రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మాత్రం మే 26వ తేదీన ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది.
మే 16 నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలించినప్పుడు సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన గాలులు బలపడతాయని, దీని వల్ల మేఘాలు ఏర్పడి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని.. దీనివల్ల రుతుపవనాలు అంచనా లేదీ కంటే ముందే వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
మరోవైపు రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐంఎడీ హెచ్చరించింది. ఈశాన్య భారతం, దక్షిణాది రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, దక్షిణ కర్ణాటక రాష్ట్రాల్లో రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ భారతంతోపాటూ రాబోయే రోజుల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఆ సమయంలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకూ ఉండొచ్చని తెలిపింది. ఈ వారం మొత్తం పశ్చిమ భారతం, మధ్య భారతంలో తీవ్రమైన వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది.
Also Read..
రాజీపడిన ప్రధాని.. అదానీ కోసమే అమెరికాతో ట్రేడ్ డీల్ : రాహుల్ గాంధీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమంగా ఓటేసిన విదేశీయులు.. 10 మంది అరెస్ట్
సనాతనాన్ని నిర్మూలించడం అంటే.. గుడికి వెళ్లొద్దని కాదు : ఉదయనిధి స్టాలిన్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mamitha Baiju | ఒకే సినిమాకు ఆరుగురు డైరెక్టర్లు - మమితా బైజు హీరోయిన్ - నిర్మాతగా కోలీవుడ్ స్టార్
- ●E20 పెట్రోల్‌పై వైరల్ ప్రచారానికి కేంద్రం చెక్.. 10 కీలక అంశాలపై పూర్తి క్లారిటీ..
- ●Amarnath Yatra 2026 | మూడు రోజుల్లో 56 వేల మంది దర్శనం.. 90% కరిగిపోయిన మంచు లింగం..!
- ●Mohanlal | నా వద్ద 10 ఏనుగు దంతాలు, 13 దంతపు విగ్రహాలు ఉన్నాయి: మోహన్ లాల్
- ●OTT | సెన్సార్ నుంచి 127 కట్స్ - ఓటీటీలో బ్యాన్ - వివాదాస్పద సినిమా సత్లుజ్ కథ ఏంటి?
- ●PM Modi Tour's | మూడు దేశాల పర్యనటకు మోదీ.. కీలక ఒప్పందాలపై చర్చించనున్న ప్రధాని

Mamitha Baiju | ఒకే సినిమాకు ఆరుగురు డైరెక్టర్లు - మమితా బైజు హీరోయిన్ - నిర్మాతగా కోలీవుడ్ స్టార్

E20 పెట్రోల్‌పై వైరల్ ప్రచారానికి కేంద్రం చెక్.. 10 కీలక అంశాలపై పూర్తి క్లారిటీ..

Amarnath Yatra 2026 | మూడు రోజుల్లో 56 వేల మంది దర్శనం.. 90% కరిగిపోయిన మంచు లింగం..!

Mohanlal | నా వద్ద 10 ఏనుగు దంతాలు, 13 దంతపు విగ్రహాలు ఉన్నాయి: మోహన్ లాల్





