త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Water Board | వాటర్‌బోర్డులో 965 ఉద్యోగాలు.. భ‌ర్తీకి అనుమ‌తించిన ప్ర‌భుత్వం!

Water Board | ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌. మ‌రో నోటిఫికేష‌న్‌కు రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ది. ఇప్ప‌టికే హోం శాఖ‌లో 7 వేల పైచిలుకు ఉద్యోగాల భ‌ర్తీకి ఆమోదం తెలిపిన ప్ర‌భుత్వం.. తాజాగా హైద‌రాబాద్‌లోని (Hyderabad) కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధి (క్యూర్‌)లో తాగునీటి సరఫరా చేస్తున్న వాటర్‌బోర్డులో (Water Board) 965 పోస్టులను భర్తీకి అనుమతించింది.

G

Hyderabad | Published On Jul 6, 2026, 9.59 am IST

Water Board | వాటర్‌బోర్డులో 965 ఉద్యోగాలు.. భ‌ర్తీకి అనుమ‌తించిన ప్ర‌భుత్వం!
Advertisement

Water Board | త్రినేత్ర‌.న్యూస్‌: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌. మ‌రో నోటిఫికేష‌న్‌కు రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ది. ఇప్ప‌టికే హోం శాఖ‌లో 7 వేల పైచిలుకు ఉద్యోగాల భ‌ర్తీకి ఆమోదం తెలిపిన ప్ర‌భుత్వం.. తాజాగా హైద‌రాబాద్‌లోని (Hyderabad) కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధి (క్యూర్‌)లో తాగునీటి సరఫరా చేస్తున్న వాటర్‌బోర్డులో (Water Board) 965 పోస్టులను భర్తీకి అనుమతించింది.

ఇందులో ఇప్పటికే 230 వరకు ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా వాటర్‌బోర్డులో క్షేత్రస్థాయిలో 735 పోస్టుల భర్తీకి అనుమతులిచ్చింది. ఈ ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ‌ను టీజీపీఎస్సీ (TGPSC) ద్వారా చేప‌ట్ట‌నుంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ వెలువ‌డే అవ‌కాశం ఉంది. వాటర్‌బోర్డు ప్రస్తుతం క్యూర్‌ పరిధిలోని మూడు రీజియన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లలో సేవలను అందిస్తున్న‌ది. అందులోని క్షేత్రస్థాయి సిబ్బందిలో ఎక్కువ మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే ఉన్నారు. దీంతో మెరుగైన సేవలు అందడం లేదనే అభిప్రాయాలున్నాయి. ఈ నేప‌థ్యంలో లైన్‌మెన్లు, జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, హెల్పర్లు, సూపర్‌వైజర్లు ఇలా దాదాపు వెయ్యి పోస్టులను మంజూరు చేయాలంటూ వాటర్‌బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం 735 పోస్టులను మంజూరు చేసింది. దీంతో ఇంజనీర్ల పోస్టులు 230, క్షేత్రస్థాయి ఉద్యోగాలు 735 కలిపి మొత్తం 965 కొలువులను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది.

మొత్తం ఖాళీలు: 965

  • ఇంజినీర్ పోస్టులు- 230
  • క్షేత్ర‌స్థాయి ఉద్యోగాలు- 735
Advertisement
Advertisement