PM Modi | యూఏఈపై దాడులు ఆమోదయోగ్యం కాదు.. పశ్చిమాసియాలో శాంతికి సహకరిస్తాం : ప్రధాని మోదీ
PM Modi | యూఏఈపై ఇరాన్ దాడులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్రంగా ఖండించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఘర్షణల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోందన్నారు. సమస్యల పరిష్కారానికి భారత్ ఎల్లప్పుడూ దౌత్య చర్చలకే ప్రాధాన్యత ఇస్తుందని నొక్కి చెప్పారు.
PM Modi | పశ్చిమాసియాలో (West Asia) శాంతిని నెలకొల్పేందుకు భారత్ సాధ్యమైనంత మేర అన్ని రకాల సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. అమెరికా-ఇరాన్ భీకర యుద్ధం నేపథ్యంలో ప్రధాని నేడు యూఏఈ (UAE) పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అబుదాబిలో (Abu Dhabi) ప్రధానికి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ అల్ నహ్యాన్ (Sheikh Mohammed bin Zayed Al Nahyan) ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాధినేతలు సమావేశమయ్యారు.
యూఏఈపై ఇరాన్ దాడులను ఈ సందర్భంగా ప్రధాని తీవ్రంగా ఖండించారు. యూఏఈని లక్ష్యంగా చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రస్తుత పరిస్థితిని యూఏఈ ఎంతో సంయమనంతో ఎదుర్కొంటున్న తీరును ప్రశంసించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఘర్షణల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోందన్నారు. సమస్యల పరిష్కారానికి భారత్ ఎల్లప్పుడూ దౌత్య చర్చలకే ప్రాధాన్యత ఇస్తుందని నొక్కి చెప్పారు.
అండగా ఉంటాం..
అదే సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా యూఏఈకి భారత్ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. యూఏఈలోని భారతీయుల రక్షణకు చర్యలు తీసుకున్నందుకు కూడా ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో అక్కడ నివసిస్తున్న భారతీయులను సొంత కుటుంబ సభ్యుల్లా ఆదుకున్నందుకు యూఏఈ ప్రభుత్వానికి మోదీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
పలు కీలక అంశాల్లో అవగాహన ఒప్పందం..
ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు కీలక అంశాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక, వ్యూహాత్మక రక్షణ సహకారంపై యూఏఈ, ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. పెట్రోలియం నిల్వలు, ఎల్‌పీజీ సరఫరా, షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాధినేతల సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. యూఏఈ పర్యటన తర్వాత ప్రధాని.. నెదర్లాండ్స్, స్వీడెన్, నార్వే, ఇటలీ దేశాలకు వెళ్లనున్నారు.
ప్రధానికి అరుదైన గౌరవం
ఇక ఈ పర్యటన సందర్భంగా ప్రధానికి అరుదైన గౌరవం లభించింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి (airspace) ప్రవేశించగానే.. ఆ దేశానికి చెందిన ఎఫ్-16 విమానం ఎస్కార్ట్‌గా వచ్చింది. అబుదాబిలో మోదీ విమానం ల్యాండ్ అయ్యే వరకూ ఆ ఫైటర్ జెట్ ఎస్కార్ట్‌గా వ్యవహరించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
వాతావరణ శాఖ చల్లటి కబురు.. మే 26 నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
రాజీపడిన ప్రధాని.. అదానీ కోసమే అమెరికాతో ట్రేడ్ డీల్ : రాహుల్ గాంధీ
సంబంధిత వార్తలు

Teejan Bai | తీజన్ బాయి ఇకలేరు.. మూగబోయిన జానపద లోకం
జులై 5, 2026

Ali Khamenei Funeral | ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల్లో అందరి దృష్టి ఆ చిన్న శవపేటికపైనే.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు!
జులై 4, 2026

PM Modi | 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా అధిగమించింది : ప్రధాని మోదీ
జులై 4, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్, నిఫ్టీ పరుగులు..
- ●Water Board | వాటర్‌బోర్డులో 965 ఉద్యోగాలు.. భర్తీకి అనుమతించిన ప్రభుత్వం!
- ●Wedding Cancelled | పెండ్లికి ముందే ఊరేగింపు.. డ్యాన్ చేయొద్దంటూ వధువుపై కోప్పడ్డ వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
- ●Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!
- ●Nampally Criminal Court | నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..
- ●Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్, నిఫ్టీ పరుగులు..

Water Board | వాటర్‌బోర్డులో 965 ఉద్యోగాలు.. భర్తీకి అనుమతించిన ప్రభుత్వం!

Wedding Cancelled | పెండ్లికి ముందే ఊరేగింపు.. డ్యాన్ చేయొద్దంటూ వధువుపై కోప్పడ్డ వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!



