Woman Parade | భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. అర్ధనగ్నంగా వివాహిత ఊరేగింపు
Woman Parade | ఓ వివాహిత తన ప్రియుడితో సహజీవనం చేయడమే నేరమైంది. ఇంకేముంది సభ్య సమాజం తలదించుకునేలా.. ఆమెకు గుండు గీయించి, మెడలో చెప్పుల దండేసి, అర్ధనగ్నంగా ఊరేగించారు.
Woman Parade | త్రినేత్ర.న్యూస్ : ఓ వివాహిత తన ప్రియుడితో సహజీవనం చేయడమే నేరమైంది. ఇంకేముంది సభ్య సమాజం తలదించుకునేలా.. ఆమెకు గుండు గీయించి, మెడలో చెప్పుల దండేసి, అర్ధనగ్నంగా ఊరేగించారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో జూన్ 30వ తేదీన చోటు చేసుకోగా, ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఉజ్జయిని జిల్లాలోని అర్నియావేగ గ్రామానికి చెందిన ఓ మహిళకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. ఓ రెండు, మూడేండ్లకు భర్తను వదిలేసి.. మరో యువకుడికి శారీరకంగా దగ్గరైంది. ఇక ఆ యువకుడితో మూడేండ్ల పాటు సహజీవనం చేసింది. ఆ తర్వాత అతను అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఆ యువకుడితో మళ్లీ ఆమె కలిసి ఉంటోంది.
ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు
వివాహిత ప్రవర్తపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తను వదిలేసి మరొకరితో కలిసి ఉండడం ఏంటి..? అత్యాచారం చేశాడని చెప్పి జైలుకు పంపి.. మళ్లీ అతనితోనే సహజీవనం చేయడం సరికాదంటూ గ్రామస్తులు మండిపడ్డారు.
గుండు గీయించి.. అర్ధనగ్నంగా ఊరేగించి
సదరు మహిళ పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఆమెను నడి బజార్లోకి లాక్కొచ్చి.. గుండు గీయించారు. అంతటితో ఆగలేదు.. మెడలో చెప్పుల దండేశారు. బట్టలను చింపేశారు.. చితకబాదారు. అనంతరం అర్ధనగ్నంగా ఊరేగించారు.
రంగంలోకి దిగిన పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు అర్నియావేగ గ్రామానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం 11 మందిపై కేసు నమోదు కాగా, ముగ్గురిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
🚨Shameless Madhya Pradesh : Woman Humiliated in Ujjain Village
In Arniya Vega village of Ujjain a woman was publicly humiliated on June 30 2026
Villagers dragged her, shaved her head and put slippers around her neck
She had left her first husband and remarried a local youth… pic.twitter.com/klIyqxP4h3
— Ramesh Tiwari (@rameshofficial0) July 3, 2026
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





