Trade Deficit | భారత్ కు వాణిజ్య లోటు షాక్.. ఏప్రిల్‌లో భారీగా పెరిగిన దిగుమతులు..
Trade Deficit | మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, షిప్పింగ్ అంతరాయాల ప్రభావంతో భారత్ వాణిజ్య లోటు (మెర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్) ఏప్రిల్‌లో భారీగా పెరిగింది. ఏప్రిల్ నెలలో ట్రేడ్ డెఫిసిట్ 28.38 బిలియన్ డాలర్లకు చేరింది. మార్కెట్ అంచనాలు 26.5 బిలియన్ డాలర్లుగా ఉండగా, మార్చిలో ఇది 20.67 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
Trade Deficit | మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, షిప్పింగ్ అంతరాయాల ప్రభావంతో భారత్ వాణిజ్య లోటు (మెర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్) ఏప్రిల్‌లో భారీగా పెరిగింది. ఏప్రిల్ నెలలో ట్రేడ్ డెఫిసిట్ 28.38 బిలియన్ డాలర్లకు చేరింది. మార్కెట్ అంచనాలు 26.5 బిలియన్ డాలర్లుగా ఉండగా, మార్చిలో ఇది 20.67 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత్ సరుకు ఎగుమతులు ఏప్రిల్‌లో 43.56 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మార్చిలో ఇవి 38.92 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అదే సమయంలో దిగుమతులు భారీగా పెరిగి 71.94 బిలియన్ డాలర్లకు చేరాయి. మార్చిలో దిగుమతులు 59.59 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
దిగుమతులు భారీగా..
సేవల ఎగుమతులు కూడా బలంగా కొనసాగినట్లు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్‌లో సేవల ఎగుమతులు 37.24 బిలియన్ డాలర్లుగా అంచనా వేయగా, సేవల దిగుమతులు 16.66 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వస్తువులు, సేవలు కలిపి భారత్ మొత్తం ఎగుమతులు ఏప్రిల్‌లో 80.80 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా వేశారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దేశమైన భారత్ తన ముడి చమురు అవసరాల్లో 80 శాతం కంటే ఎక్కువ మొత్తం కోసం విదేశాలపై ఆధారపడుతోంది. అలాగే వంటగ్యాస్ అవసరాల్లో దాదాపు 60 శాతం దిగుమతుల ద్వారానే నెరవేరుతున్నాయి. ఇందులో మధ్యప్రాచ్య దేశాల వాటా కీలకంగా ఉంది. ఇరాన్ సంబంధిత ఉద్రిక్తతలు కొనసాగడంతో హోర్ముజ్ జలసంధి మార్గంలో షిప్పింగ్‌కు అంతరాయాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి చివరి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు చేరాయి. దీంతో ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బలహీన కరెన్సీగా రూపాయి..
ఎనర్జీ ధరల షాక్ ప్రభావంతో రూపాయి కూడా ఒత్తిడికి లోనైంది. ఈ ఏడాది ఆసియాలో అత్యంత బలహీన కరెన్సీగా రూపాయి మారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. విదేశీ మారక నిల్వలను రక్షించడం, దిగుమతి ఖర్చులను నియంత్రించేందుకు విధాన నిర్ణేతలు (ఆర్‌బీఐ) జోక్యాలను పెంచుతున్నారు. ప్రధాని మోదీ ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని, వర్క్ ఫ్రం హోమ్ విధానాలను ప్రోత్సహించాలని, అవసరం లేని దిగుమతులు, విదేశీ ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ పశ్చిమాసియా దేశాల నుంచి భారత్ దిగుమతులు ఏప్రిల్‌లో సంవత్సర ప్రాతిపదికన 31.64 శాతం తగ్గి 10.47 బిలియన్ డాలర్లకు చేరాయని తెలిపారు. గతేడాది ఇదే కాలంలో ఇవి 15.32 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని చెప్పారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కీలక షిప్పింగ్ మార్గాల్లో అంతరాయాల కారణంగా దిగుమతులు తగ్గినట్లు వెల్లడించారు.
లోటు మరింత పెరగనుందా..
ఇక బంగారం దిగుమతులు కూడా గణనీయంగా తగ్గినట్లు సమాచారం. బ్యాంకులు కొనుగోళ్లు నిలిపివేయడంతో గోల్డ్ దిగుమతులు దాదాపు 30 ఏళ్ల కనిష్టానికి చేరినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. దీంతో మొత్తం ట్రేడ్ డెఫిసిట్ మరింత పెరగకుండా కొంతవరకు నియంత్రణలో నిలిచినట్లు భావిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ లోటు మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఏర్పడుతుందని అంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ali Khamenei Funeral | ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల్లో అందరి దృష్టి ఆ చిన్న శవపేటికపైనే.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు!
జులై 4, 2026

Petrol-Diesel Price | పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు..! సంకేతాలిచ్చిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్
జులై 2, 2026

Donald Trump Iran Deal | మళ్లీ బాంబులు వేస్తాం.. ఇరాన్‌తో డీల్ ఇంకా ఫైనల్ కాలేదు: జీ7 సమ్మిట్‌లో డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●Mamitha Baiju | ఒకే సినిమాకు ఆరుగురు డైరెక్టర్లు - మమితా బైజు హీరోయిన్ - నిర్మాతగా కోలీవుడ్ స్టార్
- ●E20 పెట్రోల్‌పై వైరల్ ప్రచారానికి కేంద్రం చెక్.. 10 కీలక అంశాలపై పూర్తి క్లారిటీ..
- ●Amarnath Yatra 2026 | మూడు రోజుల్లో 56 వేల మంది దర్శనం.. 90% కరిగిపోయిన మంచు లింగం..!
- ●Mohanlal | నా వద్ద 10 ఏనుగు దంతాలు, 13 దంతపు విగ్రహాలు ఉన్నాయి: మోహన్ లాల్
- ●OTT | సెన్సార్ నుంచి 127 కట్స్ - ఓటీటీలో బ్యాన్ - వివాదాస్పద సినిమా సత్లుజ్ కథ ఏంటి?
- ●PM Modi Tour's | మూడు దేశాల పర్యనటకు మోదీ.. కీలక ఒప్పందాలపై చర్చించనున్న ప్రధాని

Mamitha Baiju | ఒకే సినిమాకు ఆరుగురు డైరెక్టర్లు - మమితా బైజు హీరోయిన్ - నిర్మాతగా కోలీవుడ్ స్టార్

E20 పెట్రోల్‌పై వైరల్ ప్రచారానికి కేంద్రం చెక్.. 10 కీలక అంశాలపై పూర్తి క్లారిటీ..

Amarnath Yatra 2026 | మూడు రోజుల్లో 56 వేల మంది దర్శనం.. 90% కరిగిపోయిన మంచు లింగం..!

Mohanlal | నా వద్ద 10 ఏనుగు దంతాలు, 13 దంతపు విగ్రహాలు ఉన్నాయి: మోహన్ లాల్



