Nampally Criminal Court | నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..
Nampally Criminal Court | హైదరాబాద్‌లోని (Hyderabad) నాంపల్లి క్రిమినల్ కోర్టులో (Nampally Criminal Court) అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున కోర్డు భవనం మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Nampally Criminal Court | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని (Hyderabad) నాంపల్లి క్రిమినల్ కోర్టులో (Nampally Criminal Court) అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున కోర్డు భవనం మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
సిబ్బంది వేగంగా స్పందించడంతో మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించలేదు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే మంటల్లో కీలకమైన ఫైళ్లు ఎవైనా కాలిపోయాయా, జరిగిన ఆస్తి నష్టం గురించి ఇంకా తెలియ రాలేదు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్

Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?






