Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..
Venezuela Earthquake | ఇటీవల సంభవించిన వరుస భూకంపాలతో కకావికలమైన వెనిజులా (Venezuela Earthquake) ఇప్పుడిప్పుడే కోలకుంటుతున్నది. ప్రకృతి విలయం మిగిల్చిన విషాదం నుంచి క్రమంగా తేరుకుంటున్నది.
International | Published On Jul 6, 2026, 8.18 am IST
Venezuela Earthquake | త్రినేత్ర.న్యూస్: ఇటీవల సంభవించిన వరుస భూకంపాలతో కకావికలమైన వెనిజులా (Venezuela Earthquake) ఇప్పుడిప్పుడే కోలకుంటుతున్నది. ప్రకృతి విలయం మిగిల్చిన విషాదం నుంచి క్రమంగా తేరుకుంటున్నది. గత నెల 24న సెకన్ల వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో వచ్చిన రెండు భారీ భూకంపాలతో వెనిజులా వణికిపోయిన విషయం తెలిసిందే. వందల సంఖ్యలో భవనాలు, నివాసాలు కుప్పకూలాయి. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 3,342 మంది మరణించారు. మరో 16,740 మంది గాయపడ్డారు. ఈ మేరకు నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ జోర్గ్ రోడ్రిగ్జ్ తెలిపారు. 6,462 మందిని కాపాడామని చెప్పారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం 17,345 మంది గల్లంతయ్యారు. భూకంప బాధితుల కోసం తాత్కాలికంగా 80 క్యాంపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
థాంక్యూ భారత్..
భారీ భకంపంతో విలవిలాడిన వెనిజులాను ఆదుకునేందుకు భారత్ నడుం భిగించింది. భూకంప బాధితులకు మానవతా సాయం అందించడానికి ఆపరేషన్ అమిస్తాద్ (Operation Amistad) చేపట్టింది. భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, అత్యవసర సమయాల్లో క్షతగాత్రులకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందించే సామర్థ్యమున్న రెండు మొబైల్ ఆసుపత్రి టెంట్లు (BHISHM Cubes) సహా 35 టన్నులకు పైగా సహాయక సామగ్రి, ఔషధాలు, వైద్య పరికరాలను తీసుకెళ్లి సేవలందించింది. తాజాగా అక్కడి భారత్ ఆర్మీ ఫీల్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఫొటోలు, వీడియోలను విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఘోర ప్రకృతి విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడినవారు, వారి కుటుంబ సభ్యులు భారత్ సాయానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
తాజావార్తలు
- ●తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనం..!
- ●Minister Uttam Kumar Reddy | హైదరాబాద్‌లో అందుబాటులోకి అంతర్జాతీయ న్యాయ నిపుణులు
- ●MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల
- ●Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
- ●Accident | ఒకే కుటంబంలో పెను విషాదం.. గంటల వ్యవధిలో నలుగురి మృతి
- ●రేవంత్ ‘యూఎస్ టూర్’ బ్రేక్: వివాదాన్ని పొలిటికల్ అస్త్రంగా మార్చిన తెలంగాణ సీఎం!

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనం..!

Minister Uttam Kumar Reddy | హైదరాబాద్‌లో అందుబాటులోకి అంతర్జాతీయ న్యాయ నిపుణులు

MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల

Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్






