Muharram | మొహర్రం ఊరేగింపులో పేలుడు.. పలువురికి గాయాలు.. వీడియో
Muharram | జనాన్ని ఆకర్షించడానికి, సోషల్ మీడియాలో (social media) హైలట్ కావడానికి చేసే పనులు అప్పుడుప్పుడు అనర్ధాలు జరుగుతుంటాయి. అలాంటి మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఉజ్జయినిలో (Ujjain) కూడా చోటుచేసుకుంది.
Muharram | త్రినేత్ర.న్యూస్: జనాన్ని ఆకర్షించడానికి, సోషల్ మీడియాలో (social media) హైలట్ కావడానికి చేసే పనులు అప్పుడుప్పుడు అనర్ధాలు జరుగుతుంటాయి. అలాంటి మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఉజ్జయినిలో (Ujjain) కూడా చోటుచేసుకుంది. మొహర్రం (Muharram) ఊరేగింపులో భాగంగా యువకులు చేసిన స్టంట్ భక్తులు గాయపడ్డారు.
ఈ నెల 23న ఉజ్జయిని నగరంలోని బద్‌నగర్ ప్రాంతంలో మొహర్రం ఊరేగింపు (Muharram Procession) నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ టాటా ఏస్ వాహనాన్ని కేన్ సహాయంతో 40 అడుగుల ఎత్తులో వేలాడదీశారు. దానిపై ఇద్దరు యువకులు ఎర్రటి జెండాలను ఊపుతూ ఊరేగింపునకు వచ్చిన భక్తులను ఉత్సాహ పరుస్తున్నారు. ఈ క్రమంలో టాటా ఏస్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి దాని డోరు, అద్దాలు ఊడి కిందపడిపోయాయి. దీంతో అక్కడున్న భక్తులపై అవి పడటంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం జరిగినప్పటికీ.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.
అయితే జనాన్ని ఆకర్షించడానికి, సోషల్ మీడియా (Social Media) దృష్టిలో పడటం కోసం ఇది చేశారని పోలీసులు తెలిపారు. అఖాడాల మధ్య పోటీలో భాగంగా వాహనంలో రాకెట్ లాంటి పటాకును కాల్చారని, అయితే అద్దాలు మూసి ఉండటంతో గ్యాస్ పేరుపోవల్ల అవి పగిపోయిందని చెప్పారు. అది పేలుడు జరిగినట్లు ప్రభావం చూపిందని వెల్లడించారు. వాహనం లోపల పటాకులు (Firecrackers) మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలో నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
A video showing a car being blown up during a Muharram procession in Madhya Pradesh's Ujjain district has gone viral.
The footage has sparked controversy and led to a police probe after clips of the incident went viral on social media.
The incident reportedly took place on the… pic.twitter.com/of96I00XKg
— Hate Detector 🔍 (@HateDetectors) June 25, 2026
తాజావార్తలు
- ●Road Accident | వ్యాన్‌ను ఢీకొట్టిన బొగ్గులారీ.. బ్యాండ్ బృందంలోని ఏడుగురు మృతి
- ●Moringa Cultivation | టీచర్ జాబ్‌ను వదిలేసి.. మునగ సాగు వైపు అడుగులు.. రెండేండ్లలోనే రూ. 2 కోట్ల టర్నోవర్..
- ●Ecuador vs Germany | ఈక్వెడార్ సంచలనం.. ఫేవరెట్ జర్మనీకి షాక్
- ●Ponnam Prabhakar | బీసీ గురుకుల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఐఐటీ, ఎన్ఐటీలకు ఎంపికైతే ల్యాప్‌టాప్‌లు: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Netherlands vs Tunisia | నాకౌట్లోకి నెదర్లాండ్స్.. ట్యునీషియాపై 3-1 తేడాతో విక్టరీ
- ●Bank Holidays | బ్యాంకులకు నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు..

Road Accident | వ్యాన్‌ను ఢీకొట్టిన బొగ్గులారీ.. బ్యాండ్ బృందంలోని ఏడుగురు మృతి

Moringa Cultivation | టీచర్ జాబ్‌ను వదిలేసి.. మునగ సాగు వైపు అడుగులు.. రెండేండ్లలోనే రూ. 2 కోట్ల టర్నోవర్..

Ecuador vs Germany | ఈక్వెడార్ సంచలనం.. ఫేవరెట్ జర్మనీకి షాక్

Ponnam Prabhakar | బీసీ గురుకుల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఐఐటీ, ఎన్ఐటీలకు ఎంపికైతే ల్యాప్‌టాప్‌లు: మంత్రి పొన్నం ప్రభాకర్






