Minister Uttam | ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు రూ.10 వేల కోట్లతో ప్రత్యేక కార్యాచరణ
Minister Uttam | వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం రూ.10 వేల కోట్లతో ఐదు నెలల ప్రత్యేక కరువు నివారణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
- సంక్రాంతి తర్వాత ఐదు నెలలపాటు కరువు నివారణ పనులు
- ప్రతి నెలా రూ.2 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
- రైతులు, గ్రామీణ ప్రజలు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది
- మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
Minister Uttam | వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం రూ.10 వేల కోట్లతో ఐదు నెలల ప్రత్యేక కరువు నివారణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రతి నెలా రూ.2 వేల కోట్ల చొప్పున అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రైతులు, గ్రామీణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ బేగంపేటలోని ఐటీసీ గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన తెలంగాణ క్లైమేట్ కాన్‌క్లేవ్ కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
ముందస్తు ప్రణాళికతో కరువుకు చెక్
కరువు వచ్చిన తర్వాత స్పందించడం కంటే.. వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ స్పష్టం చేశారు. రూ.10 వేల కోట్ల కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తులను సృష్టించడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, తాగు, సాగునీటి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఖర్చు చేసే ప్రతి రూపాయితో ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రజల భాగస్వామ్యంతో పనులను ఎంపిక చేస్తామని తెలిపారు.
ఐదంచెల వ్యూహంతో జల సంరక్షణ
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయనుంది. ఇందులో వర్షపు నీటి సంరక్షణ, నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. చెరువులు, కాలువలు, గ్రామీణ జల వనరులను పునరుద్ధరించడంతో పాటు వాగుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. భూగర్భ జలాల మట్టాలను పెంచేందుకు విస్తృతంగా పనులు నిర్వహించనున్నారు. ‘పొలం బాట’ కార్యక్రమం ద్వారా వ్యవసాయ క్షేత్రాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించనున్నారు. గ్రామాల్లో అంతర్గత మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు నీటి వనరుల సమర్థ నిర్వహణకు చర్యలు తీసుకోనున్నారు.
శాఖల మధ్య సమన్వయంతో అమలు
కరువు నివారణ కార్యక్రమం విజయవంతం కావాలంటే అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అవసరమని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ తదితర శాఖలు సమష్టిగా పనిచేయాలన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను పెట్టుబడులు, ఉపాధి అవకాశాలుగా మలచుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజల జీవనోపాధిని కాపాడటంతో పాటు వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక భరోసా కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
గ్రీన్ ఎనర్జీకి భారీ ప్రోత్సాహం
పునరుత్పాదక ఇంధన రంగంలోనూ తెలంగాణను ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఉత్తమ్ తెలిపారు. 6,000 మెగావాట్ల సౌర, పవన విద్యుత్, బ్యాటరీ స్టోరేజీ సామర్థ్యం కోసం టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావాలని ఆహ్వానించారు. జల సంరక్షణ, సమర్థ సాగునీటి నిర్వహణ రంగాల్లోనూ పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
క్లైమేట్ కాన్‌క్లేవ్
తెలంగాణ క్లైమేట్ కాన్‌క్లేవ్‌ను డిసెంబర్ 7, 8 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనతోనే ఈ కాన్‌క్లేవ్‌కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. 2026–2036 కాలానికి తెలంగాణ క్లైమేట్ రెసిలియన్స్ అజెండాను సిద్ధం చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. వాతావరణ అంచనాలు, కరువు నివారణ, వడగాలుల ప్రభావం, పునరుత్పాదక ఇంధనం, క్లైమేట్ ఫైనాన్స్, జీవవైవిధ్యం వంటి అంశాలపై నిపుణులు విస్తృతంగా చర్చించనున్నట్లు చెప్పారు. శాస్త్రీయ పరిజ్ఞానానికి సంప్రదాయ జ్ఞానాన్ని, ప్రజల భాగస్వామ్యాన్ని జోడించాలని ఉత్తమ్ సూచించారు. కాన్‌క్లేవ్‌లో జరిగే చర్చలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు కనిపించే ఫలితాలను అందించాలని ఆకాంక్షించారు. పచ్చదనం, జలభద్రతకు పెద్దపీట వేస్తూ వాతావరణ ప్రతికూలతలను తట్టుకునే తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●blast in school | పాఠశాలలో భారీ పేలుడు.. ఆరుగురు చిన్నారులు మృతి
- ●Harish Rao meets Jagga Reddy | 21 ఏండ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్‌రావు
- ●Kodangal Land Scam | సీఎం ఇలాకాలో రూ.60 కోట్ల భూస్కాం.. బినామీల నుంచి 50 శాతం కమీషన్!
- ●HDFC Bank | హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అప్డేట్.. రూ.500లోపు యూపీఐ చెల్లింపులపై కీలక మార్పు..
- ●Supreme Court | ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గింపుపై పిటిషన్.. విచారణకు సుప్రీం నో
- ●Instagram For TV | టీవీలోనూ ఇన్స్టాగ్రామ్.. ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్..

blast in school | పాఠశాలలో భారీ పేలుడు.. ఆరుగురు చిన్నారులు మృతి

Harish Rao meets Jagga Reddy | 21 ఏండ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్‌రావు

Kodangal Land Scam | సీఎం ఇలాకాలో రూ.60 కోట్ల భూస్కాం.. బినామీల నుంచి 50 శాతం కమీషన్!

HDFC Bank | హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అప్డేట్.. రూ.500లోపు యూపీఐ చెల్లింపులపై కీలక మార్పు..




