త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dr. C. Laxma Reddy | కేసీఆర్ బ‌య‌ట‌కొస్తే అదే నీ ఆఖ‌రి రోజైత‌ది.. త‌ట్టుకోలేవ్‌

Dr. C. Laxma Reddy | కేసీఆర్ బ‌య‌ట‌కొస్తే అదే సీఎం రేవంత్‌(Revanth Reddy)కు ఆఖ‌రి రోజ‌వుతుంద‌ని.. త‌ట్టుకోలేర‌ని మాజీ మంత్రి డా.సి.ల‌క్ష్మారెడ్డి (Dr. C. Laxma Reddy) హెచ్చరించారు.

S

Telangana | Published On Nov 27, 2026, 1.46 pm IST

Dr. C. Laxma Reddy | కేసీఆర్ బ‌య‌ట‌కొస్తే అదే నీ ఆఖ‌రి రోజైత‌ది.. త‌ట్టుకోలేవ్‌
Advertisement
  • నువ్వెవ‌రు మా సార్‌ను బ‌య‌టికి ర‌మ్మ‌న‌డానికి
  • కేసీఆర్ నీళ్లెత్తిపోస్తే నువ్ ఢిల్లీకి డ‌బ్బులు ఎత్తిపోస్తున్న‌వ్‌
  • మేం పెండింగ్ ప్రాజెక్టుల‌న్నీ ర‌న్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినం
  • మా ప్ర‌భుత్వం చేసింది మాట్లాడే ముందు నువ్ ఏం పీకిన‌వో చెప్పు
  • హౌలా మాట‌లు మాట్లాడుకుంట‌ జిల్లా ప‌రువు తీస్తున్న‌వ్‌.. ముందు పని చేసి చూపించు
  • సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి డా.సి.ల‌క్ష్మారెడ్డి ధ్వ‌జం

Dr. C. Laxma Reddy | త్రినేత్ర న్యూస్‌: కేసీఆర్ బ‌య‌ట‌కొస్తే అదే సీఎం రేవంత్‌(Revanth Reddy)కు ఆఖ‌రి రోజ‌వుతుంద‌ని.. త‌ట్టుకోలేర‌ని మాజీ మంత్రి డా.సి.ల‌క్ష్మారెడ్డి (Dr. C. Laxma Reddy) హెచ్చరించారు. కేసీఆర్‌ను బ‌య‌టికి ర‌మ్మ‌న‌డానికి నువ్వెవ‌ర‌ని ఫైర‌య్యారు. కేసీఆర్ నీళ్లెత్తి పోస్తే రేవంతేమో ఢిల్లీకి డ‌బ్బులు ఎత్తి పోస్తున్నాడ‌ని ఆరోపించారు. తాము పెండింగ్ ప్రాజెక్టుల‌ను ర‌న్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామ‌ని చెప్పారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై మాట్లాడే ముందు రేవంత్ ఏం పీకారో చెప్పాల‌న్నారు. నిన్న కూడా హౌలా మాట‌లు మాట్లాడుకుంట మా జిల్లా ప‌రువు తీసిండ‌ని ధ్వ‌జ‌మెత్తారు. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ల‌క్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

మా జిల్లా వ్య‌క్తి సీఎం అని చెప్పుకోవ‌డానికి సిగ్గ‌నిపిస్తుంది

అవ్వే తొండి మాటలు, అవ్వే హౌల మాటలు మాట్లాడి మా జిల్లా పరువు తీశాడు. మా జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అంటే మేం సంతోషపడ్డం.. కానీ ఇప్పుడు మా జిల్లా ప్రజలు అంత బాధపడుతున్నారు. మా జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నారు. మూడు సంవత్సరాల కాలం గడించింది ఇంకా మమ్ములను తిట్టుడే తప్ప ఇంకోటి లేదు. మైక్ పడితే చాలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తిట్టుడు తప్ప ఇంకోటి లేదు. తిట్టడంలో మా జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రిగా రికార్డ్.

ఆయన నోరు తెరిస్తే గత ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు ఆయన పీకింది ఏందో. పది సంవత్సరాల కాలంలో మేం ఉన్నాం. మరి అంతకుముందు ఎవరు ఉన్నారు? మీ దరిద్రం పాలనలో తాగు నీళ్లు లేకుండా చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఇంకా దరిద్రం. అనాడు కాంగ్రెస్ పాలనలో దరిద్రపు జిల్లా వలసల జిల్లా అని బిరుదులు ఇచ్చారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అన్ని మారాయి. ఆరు నెలలో అన్ని సెట్ చేశారు. కేవలం మేం అధికారంలో ఉన్నది తొమ్మిదన్నర ఏండ్లు మాత్రమే. అందులో రెండు ఏండ్లు కరోనా ఉంది. అంటే కేవలం 7 ఏండ్లు మాత్రమే మేం పూర్తిగా పాల‌న‌ చేసింది.

మహబూబ్ నగర్ జిల్లాను బాగు చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత మొట్టమొదటగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. ఆనాడు మా జిల్లా ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్ట్ లు అని పేరు ఉండే. వాటిని రన్నింగ్ ప్రాజెక్ట్ లుగా మార్చి పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారు కేసీఆర్. వలసలు వాపస్ అయ్యాయి. పంటల‌ సాగు పెరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది.. వలసలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యమంత్రి వచ్చాక కూడా తట్టెడు మట్టి తీయలేదు. మేం 27 వేల కోట్లు ఖర్చు చేస్తే వాళ్ళు కనీసం 27 కోట్లు కూడా ఖర్చు చేయలేదు.

మేముంటే క‌రివెన నింపేవాళ్లం

నిన్న మాట్లాడుతూ 8 వేల కోట్లు ఖర్చు చేయలేదు అన్నాడు. లెక్కలు తెల్వకపోతే తెలుసుకో. 30 వేల కోట్లు ఖర్చు చేశాం. దాదాపు 80 శాతం పనులు పూర్తి చేశాం. కరివెన దగ్గర కొంత వ‌ర‌కే పనులు పెండింగ్ ఉన్నాయి. మేం అధికారంలోకి వస్తె కరివెన నింపేవాళ్ళం. ఉద్దండపూర్ లో కూడా నీళ్లు నింపేవాళ్లం. కల్వకుర్తిలో ఒక్క ప్రాజెక్టు డిజైన్ చేయలేదు. మ‌నం దూరదృష్టితో ఆలోచన చేసి డిజైన్ చేయడం జరిగింది. ఎల్ నినో వస్తుంది అని ఎవరికి తెల్వదు. కానీ ఇలాంటి పరిస్థితులను కూడా తట్టుకొని ఇవాళ నీళ్ళు ఇచ్చేలా డిజైన్ చేశాం.

నీ చేతకాని దద్దమ్మ పనులు కావు మావి. నీ తెలివి తక్కువ పనుల వల్ల‌నే రాష్ట్రంలో కరువు పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కెనాల్ లకు టెండర్లు పిలిచేవాళ్ళం. మూడు సంవత్సరాల కాలంలో దేశంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పనులను కేసీఆర్‌ పూర్తి చేశారు. మూడు ఏండ్లలో తట్టెడు మట్టి తీయలేదు ఈ చేతకాని దద్దమ్మ రేవంత్.

కేసీఆర్ ఉన్న‌ప్పుడు మా జిల్లాకి 5 మెడికల్ కాలేజ్ వచ్చాయి. అన్ని జిల్లాలకు నిధులు ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో తాగు నీటి సమస్యలు తీవ్రంగా ఉంటుండే. తండాల్లో కూడా తాగు నీటి సమస్య లేకుండా కేసీఆర్ చూసుకున్నారు. ఏ రకంగా చూసినా అభివృద్ధి చెందింది కేసీఆర్ హయాంలో తప్ప ఈ రేవంత్ రెడ్డి హయాంలో కాదు.

నీకు సీఎం ప‌ద‌విస్తే చేసింది ఏముందో చెప్పు

పార్లమెంటులో క్లియర్ గా అప్పులపై చెప్పింది. ఈ మూడు ఏండ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పులు చేశావు. ఏం చేసినవో ఏందో ఎవరికి తెల్వదు. మా కేసీఆర్ నీళ్ళు ఎత్తిపోస్తే రేవంత్ మాత్రం డబ్బులు ఎత్తిపోస్తున్నాడు. కింది నుంచి ఢిల్లీకి డబ్బులు ఎత్తిపోస్తున్నాడు. హ‌రీశ్ రావు రాజశేఖర్ రెడ్డి మనిషి అని.. వార్డు మెంబ‌ర్ కాకుండానే ఆయ‌న్ని మంత్రిని చేశాడ‌ని హరీష్ రావుపై నువ్ మాట్లాడిన‌వ్‌. హరీశ్‌ రావు అన్నింటికీ అర్హుడు కాబట్టే ఆ మంత్రి పదవి ఇచ్చారు. ప్రజలు నీకు ఇచ్చారు తెలివి లేకా.. హరీశ్‌ రావుకు మంత్రి పదవి ఇస్తే బ్రహ్మాండంగా పని చేశాడు. మంత్రి కాకుండానే నీకు ముఖ్యమంత్రి ఇస్తే నువ్ చేసింది ఏంది?

రాష్ట్రంలో ఎక్కువ లబ్ధి పొందినవారు గిరిజనులు. వారికి అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఎవరు వస్తారో రండి తండాలకు పోదాం. అభివృద్ధి చూపిస్తాం. మా కేటీఆర్, హరీశ్‌ రావునే తట్టుకుంట లేవు. ఇక కేసీఆర్ బ‌య‌ట‌కొస్తే త‌ట్టుకుంట‌వా? ఆయన రావడమే అభివృద్ధా? మాటలు కాదు అభివృద్ది చేసి చూపించు అని ల‌క్ష్మారెడ్డి హిత‌వు ప‌లికారు.

Advertisement
Advertisement