MK Stalin | డీఎంకేకు షాక్.. వెనుకంజలో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి
MK Stalin | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార డీఎంకేకి షాకిస్తున్నాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. డీఎంకే కేవలం 37 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది.
MK Stalin | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార డీఎంకేకి షాకిస్తున్నాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. డీఎంకే కేవలం 37 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. ఈ ఫలితాల్లో డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో (Kolathur Seat) స్టాలిన్ వెనుకబడి ఉన్నారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 1,200 ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. మరోవైపు స్టాలిన్ కుమారుడు, ఉపముఖ్యమంత్రి ఉదనిధి సైతం చెపాక్‌లో వెనుకంజలోనే కొనసాగుతున్నారు.
కొళత్తూరు నియోజకవర్గం డీఎంకేకి కంచుకోట. 2011 నుంచి ఎంకే స్టాలిన్ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థి ఆది రాజారాంపై ఎంకే స్టాలిన్ 70,384 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ప్రస్తుతం ఇక్కడ స్టాలిన్ వెనుకంజలో ఉండటం పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ఎన్నికల్లో విజయ్ స్థాపించిన టీవీకే దూసుకెళ్తోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన నటుడు విజయ్ 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దొరక్కుండా అనూహ్యమైన ఫలితాలతో దూసుకుపోతుంది. డీఎంకే పార్టీ కంచుకోటలను సైత టీవీకే అభ్యర్థులు బద్దలు కొడుతున్నారు. టీవీకే పార్టీ అధినేత విజయ్ తాను పోటీ చేస్తున్నరెండు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకేను ఢీ కొట్టే ఉద్దేశంతో విజయ్ టీవీకేని స్థాపించిన విషయం తెలిసిందే.
Also Read..
మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు
విజయ్ కోసం.. తిరుమలలో త్రిష పూజలు
తమిళనాడులో త్రిముఖ పోరు.. ద్రవిడ పార్టీలకు సవాల్ విసురుతున్న టీవీకే.. 80 స్థానాల్లో ముందంజ
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



