Actor Trisha | విజయ్ కోసం.. తిరుమలలో త్రిష పూజలు
Actor Trisha | ప్రముఖ నటి త్రిష (Actor Trisha) తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకోవడం హాట్‌టాపిక్ అవుతోంది. సోమవారం ఉదయం సుప్రభాత సేవలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
Actor Trisha | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరికాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాల వేళ ప్రముఖ నటి త్రిష (Actor Trisha) తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకోవడం హాట్‌టాపిక్ అవుతోంది. సోమవారం ఉదయం సుప్రభాత సేవలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. త్రిషను చూసిన అభిమానులు గెలుపు మనదే మేడమ్ అంటూ నినాదాలు చేశారు. కాగా, తమిళనాడులో ద్రవిడ పార్టీలకు సవాల్ విసురుతున్న విజయ్ పార్టీ టీవీకే గెలుపు కోసమే త్రిష శ్రీవారిని దర్శించుకున్నట్లు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
#WATCH | Andhra Pradesh: Actor Trisha Krishnan had the darshan of Lord Sri Venkateswara Swamy at Tirumala Tirupathi Devasthanam earlier this morning. pic.twitter.com/mhiaHMOu5l
— ANI (@ANI) May 4, 2026
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి త్రిష పేరు తమిళనాట ప్రముఖంగా వినిపిస్తోంది. అందుకు కారణం తమిళ స్టార్, టీవీకే చీఫ్ విజయ్. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుమెట్లెక్కడం ప్రచారానికి మరింత ఆజ్యం పోసింది. త్రిష కారణంగానే సంగీత.. విజయ్‌కు విడాకులు ఇచ్చేందుకు రెఢీ అయ్యారంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే (DMK), అన్నాడీఎంకే, విజయ్‌కు చెందిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీల మధ్య తీవ్రమైన త్రిముఖ పోరు నడుస్తోంది. ద్రవిడ పార్టీలకు టీవీకే (TVK) సవాల్ విసురుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు గట్టి పోటీనిస్తూ టీవీకే సత్తా చాటుతుండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. టీవీకే దాదాపు 80 స్థానాల్లో ముందంజలో దూసుకెళ్తోంది. ఇక ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కేవలం 54 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఏఐడీఎంకే-బీజేపీ కూటమి 44 స్థానాల్లో ముందంజలో ఉంది. విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ముందంజలో కొనసాగుతున్నారు.
Also Read..
హైదరాబాద్‌లో ఘోరం.. కుమారుడితో కలిసి ప్రియుడిని కత్తితో పొడిచి చంపింది..
తమిళనాడులో త్రిముఖ పోరు.. ద్రవిడ పార్టీలకు సవాల్ విసురుతున్న టీవీకే.. 80 స్థానాల్లో ముందంజ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

Anitha Radhakrishnan | విజయ్ ప్రభుత్వం నాలుగు నెలలకంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



