త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MK Stalin | టీవీకే ప్ర‌భుత్వ ఏర్పాటుకు మేం అడ్డుప‌డం.. స్టాలిన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

MK Stalin | త‌మిళ‌నాడులో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంలో ప్ర‌తిష్టంభ‌వ‌న కొన‌సాగుతున్న వేళ‌.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విజ‌య్ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే అడ్డుప‌డ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఆరు నెలల పాటు విజయ్‌ పాలన చూసిన తర్వాతనే తాను మాట్లాడుతానని పేర్కొన్నారు.

D

National | Published On May 7, 2026, 1.51 pm IST

MK Stalin | టీవీకే ప్ర‌భుత్వ ఏర్పాటుకు మేం అడ్డుప‌డం.. స్టాలిన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
Advertisement

MK Stalin | త‌మిళ‌నాడులో విజ‌య్‌ను అడ్డుకునేందుకు డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) చేతులు క‌లుపుతున్నాయంటూ జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర‌ప‌డింది. ఈ విష‌యంలో డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తన వైఖరిని స్పష్టం చేశారు. విజ‌య్ (TVK Vijay) ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విజ‌య్ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఎలాంటి ఇబ్బందులు సృష్టించదని తెలిపారు. ఆరు నెలల పాటు విజయ్‌ పాలన చూసిన తర్వాతనే తాను మాట్లాడుతానని పేర్కొన్నారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం తమ పార్టీకి లేదని ఈ సంద‌ర్భంగా స్టాలిన్ స్ప‌ష్టం చేశారు.

టైమ్స్ ఆఫ్ ఇండియాతో స్టాలిన్ మాట్లాడుతూ.. "రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత జోసెఫ్ విజయ్‌కి అవకాశం ఇవ్వడానికి డీఎంకే సిద్ధంగా ఉంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు మా పార్టీ ఎలాంటి ఆటంకం క‌లిగించ‌దు. ఆరునెల‌ల‌పాటూ వారి పాల‌నను గ‌మ‌నిస్తాం. రాష్ట్రంలో తక్షణమే రాజ్యాంగ సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డం గానీ, మరో ఎన్నికకు వెళ్ల‌డం గానీ మా పార్టీకి ఇష్టం లేదు. అందుకే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మేం అవకాశం ఇస్తున్నాం. ఆరు నెలల పాటు మేం ఎలాంటి ఇబ్బందులూ సృష్టించకుండా వారి పనితీరును గమనిస్తాం"
అని స్టాలిన్ స్ప‌ష్టం చేశారు.

వాటిని కొన‌సాగించాలి..

అదే స‌మ‌యంలో టీవీకే త‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంతోపాటూ, డీఎంకే ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అన్ని ప‌థ‌కాల‌నూ కొత్త ప్ర‌భుత్వం కొన‌సాగిస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల కోసం తాము తెచ్చిన 'ఉచిత అల్పాహార పథకం', అలాగే మహిళలకు నెలకు రూ. 1000 అందించే 'కలైంజ్ఞర్ మగలిర్ ఉరిమై తొగై' పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపి వేయవద్దని కోరారు.

అది టీవీకేకి సాధ్యం కాదు..

విజయ్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల‌పై స్టాలిన్ స్పందించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆ పార్టీకి సాధ్యం కాదన్నారు. ముఖ్యంగా మహిళలకు రూ.2,500 ఇవ్వడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. "అంత పెద్ద మొత్తం ఇవ్వడం కష్టం. కానీ కనీసం మేం ఇచ్చినట్లుగా రూ.1000 అయినా మహిళలకు అందేలా చూడాలి" అని ఆయన సూచించారు. అదే స‌మ‌యంలో 2021 మేనిఫెస్టోలో చెప్పిన 90 శాతం హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందని స్టాలిన్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

Also Read..

బీహార్‌లో కేబినెట్‌ విస్త‌ర‌ణ‌.. మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన నితీశ్ కుమార్ త‌న‌యుడు

మ‌నీలాండ‌రింగ్ కేసులో ఈడీ సోదాలు.. తొమ్మిదో అంతస్తు నుంచి నోట్ల క‌ట్ట‌లు నిండిన బ్యాగును విసిరేశారు..

త‌మిళ‌నాడులో రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు పెట్టాలి: శ్రీధర్ వెంబు

Advertisement
Advertisement