త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar Vembu | త‌మిళ‌నాడులో రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు పెట్టాలి: శ్రీధర్ వెంబు

Sridhar Vembu | త‌మిళ‌నాడులో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని జోహో స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు శ్రీ‌ధ‌ర్ వెంబు డిమాండ్ చేశారు. ఓటుకు నోటు ప్రభావాన్ని పూర్తిగా అరికట్టేలా కఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌న్నారు. మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే టీవీకే ఇప్ప‌టికంటే మెరుగైన ఫ‌లితాల‌ను సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. విజ‌య్ భారీ మెజారిటీతో గెలుస్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ్యాఖ్యానించారు. బీజేపీ మాత్రం ఒంటరిగానే పోరాడాల‌న్నారు.

D

National | Published On May 7, 2026, 11.49 am IST

Sridhar Vembu | త‌మిళ‌నాడులో రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు పెట్టాలి: శ్రీధర్ వెంబు
Advertisement

Sridhar Vembu | త‌మిళ‌నాడులో (Tamil Nadu) ప్ర‌భుత్వ ఏర్పాటుకు ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతున్న వేళ‌.. జోహో స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు శ్రీ‌ధ‌ర్ వెంబు (Sridhar Vembu) తాజాగా ఆసక్తికర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న (President rule) విధించి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

"ప్ర‌స్తుతం ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజారిటీ రాలేదు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన సంఖ్యాబ‌లం స‌రిపోవ‌ట్లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏ ప్ర‌భుత్వం ఏర్ప‌డినా ర‌క‌ర‌కాల ఒత్తిళ్ల కార‌ణంగా అస్థిరంగా ఉండే అవ‌కాశం ఉంది. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు మెరుగైన పాల‌నకు అర్హులు. అందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించి.. పారదర్శకమైన విధానంలో మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డ‌మే అత్యుత్త‌మ మార్గం. ఈ సారి ఓటుకు నోటు ప్రభావాన్ని పూర్తిగా అరికట్టేలా కఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయాలి. అప్పుడు ప్ర‌జ‌ల నిజ‌మైన తీర్పు ఎవ‌రి ప‌క్షాన ఉందో తెలుస్తుంది" అని శ్రీ‌ధ‌ర్ వెంబు అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలో మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే టీవీకే ఇప్ప‌టికంటే మెరుగైన ఫ‌లితాల‌ను సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. విజ‌య్ భారీ మెజారిటీతో గెలుస్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఒకవేళ డీఎంకే-ఏఐఏడీఎంకే (DMK-AIADMK) పార్టీలు విజ‌య్‌ని అడ్డుకోవాలనుకుంటే.. అవి కలిసి పోటీ చేయాల‌ని సూచించారు. బీజేపీ మాత్రం ఒంటరిగానే పోరాడాల‌న్నారు. ఆ పోరాటంలో ఒక్క సీటు కూడా రాక‌పోయినా పర్వాలేద‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీకి ఇది కొత్త అధ్యాయం అవుతుంద‌న్నారు. ప్రజలే మళ్లీ కొత్త నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఇవ్వాల‌ని శ్రీ‌ధ‌ర్ వెంబు త‌న పోస్టులో రాసుకొచ్చారు.

కాగా, త‌మిళ‌నాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను టీవీకే (TVK) పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాల మెజార్టీని అందుకోలేకపోయింది. దీంతో ఇత‌ర పార్టీల సాయంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజ‌య్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ విజ‌య్‌కి అధికారికంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. అయితే, హ‌స్తం పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలే ఉండ‌టంతో మెజారిటీ స‌రిపోవ‌డం లేదు. ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేల అవ‌స‌రం ఏర్ప‌డింది. ఆ ఐదుగురి మ‌ద్ద‌తు కోసం టీవీకే నేత‌లు చిన్న పార్టీల సాయం కోరుతున్నారు.

Also Read..

దేశ భ‌ద్ర‌త విష‌యంలో రాజీప‌డేది లేదు.. ఆప‌రేష‌న్ సిందూర్‌కు ఏడాది పూర్తైన వేళ ప్ర‌ధాని పోస్ట్‌

200ఎంపీ టెలిఫొటో కెమెరాతో లాంచ్ అయిన వివో ఎక్స్‌300 అల్ట్రా ఫోన్‌.. ఫొటోగ్ర‌ఫీ ప్రియుల‌కు ప్ర‌త్యేకం..

ఫ్లాట్‌గా ట్రేడ‌వుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబ‌డిదారుల్లో పెరిగిన అప్ర‌మ‌త్త‌త‌..

Advertisement
Advertisement