Bihar Cabinet Expansion | బీహార్‌లో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ తనయుడు
Bihar Cabinet Expansion | జేడీయూ అధ్యక్షుడు, మాజీ సీఎం నితీశ్ కుమార్ తనయుడు నిషాంత్ కుమార్ (Nishant Kumar).. బీహార్‌లోని సీఎం సమ్రాట్ చౌధరి ప్రభుత్వంలో చేరారు. నేడు జరిగిన కేబినెట్ విస్తరణలో నిషాంత్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Bihar Cabinet Expansion | బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేడీయూ అధ్యక్షుడు, మాజీ సీఎం నితీశ్ కుమార్ తనయుడు నిషాంత్ కుమార్ (Nishant Kumar).. బీహార్‌లోని సీఎం సమ్రాట్ చౌధరి ప్రభుత్వంలో చేరారు. నేడు భారీగా ఆ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ (Bihar Cabinet Expansion) జరిగింది. ఇందులో నిషాంత్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర మంత్రులు అమిత్ షా, బీజేపీ చీఫ్ నితిన్ నబిన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
రికార్డు స్థాయిలో 10 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ (Nitish Kumar) రాజ్యసభ (Rajya Sabha)కు ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తదుపరి ముఖ్యమంత్రి (Bihar CM)గా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) సీఎంగా గత నెల బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆ సమయంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో బీజేపీ నేతలంతా బిజీగా ఉండటంతో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఎన్నికలు పూర్తై, ఫలితాలు కూడా వెళ్లడవడంతో.. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణను చేపట్టారు. బీజేపీకి 15, జేడీయూకి 13 మంత్రి పదవులు దక్కాయి.
ఇప్పటి వరకూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న నితీశ్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ ఇటీవలే జేడీయూలో చేరిన విషయం తెలిసిందే. పార్టీలో చేరి రెండు నెలల కూడా కాకముందే ఆయనకు మంత్రిపదవి దక్కడం గమనార్హం. అయితే, ప్రభుత్వంలో చేరేందుకు నిషాంత్ తొలుత నిరాకరించారట. మంగళవారం జరిగిన జేడీయూ సమావేశంలో సీనియర్ నేతలు ఆయనను ప్రభుత్వంలో చేరేందుకు ఒప్పించినట్టు తెలిసింది. నిషాంత్.. ప్రస్తుతం ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, నితీశ్ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల ఫీడ్‌బ్యాక్‌ను సేకరించేందుకు పలు జిల్లాల్లో 'బీహార్ గుడ్‌విల్ యాత్ర' చేపడుతున్నారు.
Also Read..
తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు పెట్టాలి: శ్రీధర్ వెంబు
రాత్రిపూట కీరదోసను తినవచ్చా.. వైద్యులు ఏం చెబుతున్నారు..?
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






