NALCO | ఐటీఐ, డిప్లొమా అర్హతతో నాల్కోలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
NALCO | ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ అల్యూమినయం కార్పొరేషన్ లిమిటెడ్ (NALCO) నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 268 పోస్టులను భర్తీ చేస్తున్నది.
NALCO | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ అల్యూమినయం కార్పొరేషన్ లిమిటెడ్ (NALCO) నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 268 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగిన వారు జూన్ 10 వరకు https://www.nalcoindia.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ కెమిస్ట్రీ, మైనింగ్ మేట్ సర్టిఫికెట్, మైనింగ్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికెట్ కలిగినవారు అర్హులు. ఎంపికైన వారు ఒడిశాలోని దామంజోడి మైన్స్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 268
ఆపరేటర్ (HEMM) గ్రేడ్-III- 6
మైనింగ్ మేట్ గ్రేడ్-III- 21
జూనియర్ ఫోర్‌మ్యాన్ (మైన్స్)- 8
జూనియర్ ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్)- 3
ఆపరేటర్ సూపరింటెండెంట్ (JOT)- 55
ఆపరేటర్ గ్రేడ్-III- 54
సూపరింటెండెంట్ (JOT) ఫిట్టర్- 12
టెక్నీషియన్ (ఫిట్టర్) గ్రేడ్-III- 13
సూపరింటెండెంట్ (JOT) ఎలక్ట్రికల్- 35
టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) గ్రేడ్-III- 35
సూపరింటెండెంట్ (JOT) లాబొరేటరీ- 6
సూపరింటెండెంట్ (JOT) ఇన్‌స్ట్రుమెంటేషన్ - 10
టెక్నీషియన్ (ఇన్‌స్ట్రమెంటేషన్) గ్రేడ్-III- 10
అర్హతలు
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీస్సీ ఉత్తీర్ణత ఉండాలి. అనుభవం కలిగినవారికి ప్రాధాన్యత. అభ్యర్థులు 27 నుంచి 40 ఏండ్ల మంధ్య ఉండాలి.
ఎంపిక విధానం
రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఎంపికైన వారికి నెలకు రూ.12,000 నుంచి రూ.1,15,000 వరకు వేతనం అందుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: మే 21
చివరితేదీ: జూన్ 10
వెబ్‌సైట్: https://www.nalcoindia.com
తాజావార్తలు
- ●Google Gemini 4 Argon | గూగుల్ నుంచి జెమిని 4 ఆర్గాన్.. సంక్లిష్ట పనుల్లో సరికొత్త ఏఐ మోడల్..
- ●Asaduddin Owaisi | SIRపై సుప్రీంకోర్టుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ..
- ●Bank of Baroda | భారీగా పతనమైన బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు.. కారణం ఇదే..
- ●Air India Flight | హైజాక్ పుకార్లు.. ఫ్రాంక్ఫర్ట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం దారిమళ్లింపు
- ●TG SAFE | కిచెన్‌లో అపరిశుభ్రత.. 4 హోటళ్ల లైసెన్సులు రద్దుచేసిన టీజీ సేఫ్
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. మార్కెట్లలో అనిశ్చితి..

Google Gemini 4 Argon | గూగుల్ నుంచి జెమిని 4 ఆర్గాన్.. సంక్లిష్ట పనుల్లో సరికొత్త ఏఐ మోడల్..

Asaduddin Owaisi | SIRపై సుప్రీంకోర్టుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ..

Bank of Baroda | భారీగా పతనమైన బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు.. కారణం ఇదే..

Air India Flight | హైజాక్ పుకార్లు.. ఫ్రాంక్ఫర్ట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం దారిమళ్లింపు




