త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Animation Movie | వెండితెర‌పై ఇస్కాన్ వ్య‌వ‌స్థాప‌కుడి క‌థ – ఏఐ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో బ‌యోపిక్‌

ఇస్కాన్ వ్య‌వ‌స్థాప‌కుడు శ్రీల ప్ర‌భుపాద జీవితం వెండితెర‌పైకి రాబోతుంది. ఆయ‌న బ‌యోపిక్‌తో కేజీఎఫ్‌, స‌లార్ నిర్మాణ హోంబ‌లే ఫిల్మ్స్ ఓ యానిమేష‌న్ సినిమాను తెర‌కెక్కిస్తోంది. శ‌ర‌ణాగ‌తి పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Nov 10, 2026, 8.36 pm IST

Animation Movie | వెండితెర‌పై ఇస్కాన్ వ్య‌వ‌స్థాప‌కుడి క‌థ – ఏఐ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో బ‌యోపిక్‌
Advertisement

Animation Movie |  ఇస్కాన్ వ్య‌వ‌స్థాప‌క ఆచార్యులు ఏసీ భ‌క్తి వేదాంత స్వామి శ్రీల ప్ర‌భుపాద జీవితం వెండితెర‌పై ఆవిష్కృతం కాబోతుంది. ఏఐ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో యానిమేష‌న్‌లో కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తోంది. శ‌ర‌ణాగ‌తి పేరుతో రూపొందుతోన్న ఈ మూవీని మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్రక‌టించారు. మంగ‌ళ‌వారం టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు.

ఏఐ మోష‌న్ క్యాప్చ‌ర్‌...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోషన్ క్యాప్చర్ (AI Motion Capture) టెక్నాలజీని శ‌ర‌ణాగ‌తి సినిమా కోసం ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ విజన్ టెక్నాలజీలను కలిపి మనుషుల కదలికలను డిజిటల్ యానిమేషన్‌గా మార్చే ఈ ఆధునిక సాంకేతికత.. యానిమేషన్ పాత్రలకు మరింత నాచురాలిటీని తీసుకురాబోతుంది.

త్రీడీ క‌ద‌లిక‌లు...

AI మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా కెమెరాల సాయంతో మనుషుల కదలికలను రికార్డ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో శరీరంలోని వివిధ భాగాల కదలికలు, హావభావాలు, ఎక్స్‌ప్రెషన్స్‌ను గుర్తించి ట్రాక్ చేస్తారు. ఆ డేటాను డిజిటల్ యానిమేషన్ గా మార్చి, 3D క్యారెక్టర్‌కు సంబంధించిన స్కెలిటన్‌పై మ్యాప్ చేస్తారు. ఈ విధానం వ‌ల్ల‌ ఆ పాత్రలు మనుషుల అసలు కదలికలను సహజంగా అనుకరించగలుగుతాయి. మ‌నుషుల ఎమోష‌న్స్‌కు త‌గ్గ‌ట్లుగా స‌హ‌జ‌మైన‌ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఆడియెన్స్‌కు ఈ సినిమా ద్వారా అందించ‌బోతున్నారు.

ఆధ్యాత్మిక ప్ర‌యాణం...

స్వామి శ్రీల ప్రభుపాదుల అసాధారణ జీవితం, ఆధ్యాత్మిక సేవా ప్రస్థానానికి ఘనమైన నివాళిగా ‘శరణాగతి – ది లైఫ్ ఆఫ్ ఎ సరెండర్డ్ సోల్’ సినిమాను రూపొందించ‌బోతున్నారు. 1965లో తన 69వ ఏట శ్రీల ప్రభుపాద అమెరికా వెళ్లారు. భగవద్గీతలోని బోధనలు, శ్రీకృష్ణుడి సందేశాన్ని ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో మొద‌లైన ఈ ప్ర‌యాణం ఎలాంటి మ‌లుపులు తిరిగింది...ప్ర‌పంచవ్యాప్తంగా లక్షలాది మందికి కృష్ణుడి చైతన్య సందేశాన్ని చేరవేసే మహోద్యమంగా ఎలా మారిం అన్న‌ది ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు.

2027 ఆగ‌స్ట్‌లో...

‘శరణాగతి’ సినిమాకు గౌర శక్తి దాస ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాజేష్ సింగ్, లోహిత్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీధర్ శికారిపుర విజువల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2027 ఆగస్టులో వ‌ర‌ల్డ్ వైడ్‌గా శ‌ర‌ణాగ‌తి మూవీ రిలీజ్ కాబోతుంది.

 

Advertisement
Advertisement