Instagram For TV | టీవీలోనూ ఇన్‌స్టాగ్రామ్.. ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్..
Instagram For TV | సోషల్ మీడియా సంస్థ మెటా భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇకపై స్మార్ట్‌ఫోన్లలోనే కాకుండా యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీల్లోనూ రీల్స్, స్టోరీస్, ఫొటోలు, క్రియేటర్ల వీడియోలను పెద్ద స్క్రీన్‌పై వీక్షించవచ్చు. ఒకే టీవీలో ఐదు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను వినియోగించుకునే సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది.
Technology | Published On Nov 28, 2026, 2.18 pm IST
Instagram For TV | సోషల్ మీడియా సంస్థ మెటా భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇకపై స్మార్ట్‌ఫోన్లలోనే కాకుండా యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీల్లోనూ రీల్స్, స్టోరీస్, ఫొటోలు, క్రియేటర్ల వీడియోలను పెద్ద స్క్రీన్‌పై వీక్షించవచ్చు. ఒకే టీవీలో ఐదు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను వినియోగించుకునే సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది.
ఏయే డివైస్‌లలో పనిచేస్తుంది..?
సోషల్ మీడియా వినియోగదారులకు మెటా గుడ్‌న్యూస్ అందించింది. ఇన్‌స్టాగ్రామ్ సేవలను స్మార్ట్‌ఫోన్లకే పరిమితం చేయకుండా టెలివిజన్లకు కూడా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ సేవలను తీసుకొస్తున్నట్లు ముంబైలో నిర్వహించిన వార్షిక క్రియేటర్ ఈవెంట్ హౌస్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ లో ప్రకటించింది. రానున్న రోజుల్లో భారత్‌లోని యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీకి మద్దతిచ్చే పరికరాల్లో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. ఈ సేవ ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన క్రియేటర్ల వీడియోలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పెద్ద తెరపై వీక్షించవచ్చు. ముఖ్యంగా రీల్స్, స్టోరీస్‌తోపాటు హారిజాంటల్‌గా రూపొందించిన వీడియోలను వైడ్‌స్క్రీన్ ఫార్మాట్‌లో చూడవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌లోని ఫొటోలు, ఫొటో కలెక్షన్లను కూడా బ్రౌజ్ చేసే అవకాశం ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్ ద్వారా కాస్టింగ్..
ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీలో వినియోగదారుల అభిరుచులు, పాపులర్ కంటెంట్, వారు ఫాలో అవుతున్న ఖాతాల ఆధారంగా ప్రత్యేక రీల్స్ ఛానళ్లను ఏర్పాటు చేస్తారు. రీల్స్ ఆటోమేటిక్‌గా ప్లే అవుతాయి. ప్రతీ వీడియో కోసం ప్రత్యేకంగా స్క్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. టీవీ రిమోట్‌తో వీడియోలను నియంత్రించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ నుంచి నేరుగా టీవీకి రీల్స్‌ను కాస్ట్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. ఇందుకోసం ఫోన్, టీవీ ఒకే వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉండాలి. ఫోన్‌లోని కాస్ట్ ఆప్షన్ ద్వారా టీవీని ఎంచుకుని వీడియోలను పెద్ద స్క్రీన్‌పై చూడవచ్చు. అయితే ఈ ఫీచర్ అందుబాటు పరికరాన్ని బట్టి మారుతుంది. అలాగే ఫ్రెండ్స్ ట్యాబ్ ద్వారా స్నేహితులు షేర్ చేసిన కంటెంట్, వారు వీక్షిస్తున్న పాపులర్ వీడియోలను కూడా తెలుసుకోవచ్చు.
ఎలా వినియోగించుకోవాలి?
ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మద్దతిచ్చే యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ లేదా గూగుల్ టీవీ పరికరాల్లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం ఇప్పటికే ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో లాగిన్ కావాలి. మొబైల్ యాప్‌లోని సెట్టింగ్స్ బుక్‌మార్క్ ద్వారా కూడా ఈ టీవీ అనుభవాన్ని యాక్సెస్ చేయవచ్చు. లాగిన్ అయిన తర్వాత రీల్స్, స్టోరీస్, క్రియేటర్ ప్రొఫైల్స్, వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన కంటెంట్ ఛానళ్లను వీక్షించవచ్చు. ఒకే టీవీ యాప్‌లో గరిష్ఠంగా ఐదు ఖాతాలను జోడించుకునే అవకాశం కల్పించారు. దీంతో కుటుంబంలోని వేర్వేరు సభ్యులు తమకు నచ్చిన కంటెంట్‌ను విడివిడిగా వీక్షించవచ్చు. టీవీ కోసం ప్రత్యేకంగా మరో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించుకునే సదుపాయం కూడా ఉంది. అయితే భారత్‌లో ఈ సేవల ప్రారంభానికి సంబంధించి మెటా ఇంకా కచ్చితమైన తేదీని ప్రకటించలేదు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Samantha | కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో సమంత - కమ్‌బ్యాక్ అప్పుడేనా?
- ●Self Employed Indians | పింఛన్, ఈపీఎఫ్ లేవు.. రిటైర్మెంట్ ఆదాయం ఎలా పొందాలి?
- ●PM Modi | నారీ శక్తికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
- ●Ramchandar Rao | పూలే దంపతుల స్ఫూర్తితో మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తం
- ●Bisleri water | బిస్లరీ నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా.. ప్రాసిక్యూషన్‌కు FSSAI అనుమతి
- ●Ethics Committee Meeting | ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం

Samantha | కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో సమంత - కమ్‌బ్యాక్ అప్పుడేనా?

Self Employed Indians | పింఛన్, ఈపీఎఫ్ లేవు.. రిటైర్మెంట్ ఆదాయం ఎలా పొందాలి?

PM Modi | నారీ శక్తికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ

Ramchandar Rao | పూలే దంపతుల స్ఫూర్తితో మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తం






