Melodi | ఇటలీలో ప్రధాని మోదీ.. మరోసారి ట్రెండింగ్‌లో “మెలోడీ” మూమెంట్
Melodi | ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటలీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని కలిశారు. ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇరువురు నేతలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఎక్స్‌లో "మెలోడీ" మూమెంట్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Melodi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) మధ్య స్నేహబంధం మరోసారి నెటిజన్లను ఆకర్షిస్తోంది. ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇటలీ (Italy) చేరుకున్న విషయం తెలిసిందే. రోమ్ (Rome)లో ల్యాండ్ అయిన మోదీకి ఆ దేశ ప్రధాని మెలోనీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి డిన్నర్ చేశారు. అనంతరం రోమ్‌లోని చారిత్రక ప్రదేశమైన కొలోసియమ్ (Colosseum)ను సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వివిధ అంశాలపై ఇరువురు అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. భారత్-ఇటలీ మధ్య స్నేహ బంధాలను మరింత పెంపొందించే దిశగా నేడు చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi meets Prime Minister of Italy, Giorgia Meloni in Rome, Italy.
(Source: ANI/DD News) pic.twitter.com/ZbtaPgYNaK
— ANI (@ANI) May 20, 2026
అంతకుముందు తన మిత్రుడు ప్రధాని మోదీతో దిగిన సెల్ఫీ ఫొటోను ఇటలీ ప్రధాని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. "వెల్ కమ్ టు రోమ్.. మై ఫ్రెండ్" అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టుకు ఇటలీ, భారత్ జాతీయ జెండాలను ఎమోజీలుగా జత చేశారు. ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మెలోనీ షేర్ చేసిన సెల్ఫీ ఫొటోకి ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ వ్యూస్‌లు, దాదాపు 60 వేల లైక్‌లు వచ్చాయి. వీరి మధ్య స్నేహాన్ని అభినందిస్తూ దాదాపు రెండు వేల మంది కామెంట్లు చేశారు.
Welcome to Rome, my friend! 🇮🇹🇮🇳 pic.twitter.com/mUjFL4HIqY
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 19, 2026
ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు "మెలోడీ" (Melodi) హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. కాగా, ఇప్పటికే పలుసార్లు వీరిద్దరి ఫొటోలూ వైరల్ అయిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో కాప్28 సదస్సు జరిగిన సమయంలో కూడా వీరి సెల్ఫీ ఫోటో వైరల్ అయ్యింది. గతంలో ఇటలీలో జరిగిన జీ7 సదస్సు సమయంలోనూ వీరి ఫొటో నెటిజన్లు ఆకర్షించింది. ఇప్పుడు మరోసారి "మెలోడీ" మూమెంట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్ ఎక్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the… pic.twitter.com/df0bDYKCdU
— Narendra Modi (@narendramodi) May 20, 2026
Also Read..
NALCO | ఐటీఐ, డిప్లొమా అర్హతతో నాల్కోలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనం.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
నేను క్షేమంగానే ఉన్నా.. హాస్పిటల్లో చేరాడన్న వార్తలపై అమితాబ్ క్లారిటీ
సంబంధిత వార్తలు

Pope Leo | పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీ విజయవంతం
అక్టోబర్ 14, 2026

Boat Capsizes | గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు, చిన్నారులు సహా 14 మంది మృతి
అక్టోబర్ 14, 2026

L Murugan resigns Union Minister | కూలీల కొడుకును కేంద్ర మంత్రిని చేశారు.. ఇక చాలు : నన్ను మంత్రి పదవి నుంచి తప్పించండి
అక్టోబర్ 13, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. మార్కెట్లలో అనిశ్చితి..
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చేరిన ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను షెడ్యూల్ చేయవచ్చు..
- ●CJP | సీజేపీ నేతలకు జ్యుడీషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు సౌరవ్ దాస్, రాంకా
- ●Stock Markets | స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్ల జోరు..
- ●TOMCOM | ఖతార్‌లో నర్సు ఉద్యోగాలు.. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న TOMCOM

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. మార్కెట్లలో అనిశ్చితి..

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చేరిన ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్

WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను షెడ్యూల్ చేయవచ్చు..

CJP | సీజేపీ నేతలకు జ్యుడీషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు సౌరవ్ దాస్, రాంకా



