త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google Gemini AI | గూగుల్ జెమిని ఏఐకి భారీ అప్ డేట్స్‌.. ఏజెంటిక్ ఏఐలో కొత్త విప్ల‌వం..

Google Gemini AI | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న వార్షిక I/O 2026 ఈవెంట్‌లో భారీ స్థాయిలో ఏఐ ఫీచర్లను ప్రకటించింది. కంపెనీ ప్రొడక్ట్స్, సర్వీసుల్లో కొత్త జనరేటివ్ ఏఐ సామర్థ్యాలను తీసుకువస్తూ, జెమిని యాప్‌ను మరింత శక్తివంతమైన ఏజెంటిక్ ప్లాట్‌ఫామ్‌గా మార్చే దిశగా అడుగులు వేసింది.

S

Technology | Published On May 20, 2026, 11.00 am IST

Google Gemini AI | గూగుల్ జెమిని ఏఐకి భారీ అప్ డేట్స్‌.. ఏజెంటిక్ ఏఐలో కొత్త విప్ల‌వం..
Advertisement

Google Gemini AI | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న వార్షిక I/O 2026 ఈవెంట్‌లో భారీ స్థాయిలో ఏఐ ఫీచర్లను ప్రకటించింది. కంపెనీ ప్రొడక్ట్స్, సర్వీసుల్లో కొత్త జనరేటివ్ ఏఐ సామర్థ్యాలను తీసుకువస్తూ, జెమిని యాప్‌ను మరింత శక్తివంతమైన ఏజెంటిక్ ప్లాట్‌ఫామ్‌గా మార్చే దిశగా అడుగులు వేసింది. ముఖ్యంగా కొత్తగా తీసుకొచ్చిన జెమినీ స్పార్క్, జెమినీ ఓమ్ని, జెమినీ 3.5 ఫ్లాష్ మోడళ్లతో వినియోగదారులకు 24/7 ప్రోయాక్టివ్ సపోర్ట్ అందించడమే లక్ష్యంగా నిర్ణయించుకుంది. గూగుల్ జెమినీ యాప్‌కు పూర్తిగా కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ను తీసుకొచ్చింది. దీనికి న్యూరల్ ఎక్స్‌ప్రెసివ్ అని పేరు పెట్టింది. ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌లో ఫ్లూయిడ్ యానిమేషన్స్, వైబ్రెంట్ కలర్స్, కొత్త టైపోగ్రఫీ, హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇకపై జెమినీ సమాధానాలు సాధారణ టెక్స్ట్ రూపంలో కాకుండా, యూజర్ ప్రశ్నకు అనుగుణంగా రియల్‌టైమ్‌లో డైనమిక్‌గా రూపొందుతాయి. రిచ్ ఇమేజెస్, ఇంటరాక్టివ్ టైమ్‌లైన్స్, నేరేటెడ్ వీడియోలు, డైనమిక్ గ్రాఫిక్స్ రూపంలో సమాధానాలు ఇస్తుంది.

ఏ మోడ‌ల్ ఏం చేస్తుంది..

జెమిని లైవ్ ని ఇప్పుడు ప్రధాన జెమిని యాప్‌లోనే ఇంటిగ్రేట్ చేశారు. దీంతో టైపింగ్ నుంచి వాయిస్ కన్వర్సేషన్‌కు సులభంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే యూజర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మైక్ కట్ అవకుండా గూగుల్ కొత్త మైక్రోఫోన్ సిస్టమ్‌ను రూపొందించింది. ప్రాంతీయ డైలెక్ట్‌లకు వాయిస్ సపోర్ట్ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ న్యూరల్ ఎక్స్‌ప్రెసివ్ అప్‌డేట్ ఇవాళ్టి నుంచే ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రపంచవ్యాప్తంగా అందరికీ విడుద‌ల అవుతోంది. గూగుల్ ఓమ్ని అనేది గూగుల్ కొత్త కంటెంట్ క్రియేషన్ మోడల్. జెమినీ ఓమ్ని ఫ్లాష్ అనే మోడల్ ద్వారా టెక్స్ట్, ఇమేజ్, వీడియో వంటి ఏ ఇన్‌పుట్ నుంచైనా హైక్వాలిటీ వీడియోలను రూపొందించవచ్చని గూగుల్ తెలిపింది. ఈ ఓమ్ని ఫ్యామిలీ మోడల్‌ను జెమినీ యాప్, గూగుల్ ఫ్లో, యూట్యూబ్ షార్ట్స్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో యూజర్లు సింపుల్ ప్రాంప్ట్‌లతో సినిమాటిక్ జూమ్స్ జోడించడం, బ్యాక్‌గ్రౌండ్ మార్చడం, రెడీమేడ్ టెంప్లేట్స్ ఉపయోగించడం వంటి వీడియో ఎడిటింగ్ పనులు చేసుకోవచ్చు. ఉదాహరణకు.. వ్యక్తి అద్దాన్ని తాకినప్పుడు అది ద్రవంలా అలలతో మారాలి, శిల్పాన్ని బుడగలతో తయారు చేయాలి.. అంటూ ప్రాంప్ట్ ల‌ను ఇస్తే, వాటికి అనుగుణంగా వీడియోలను రూపొందిస్తుంది. ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఏఐ ప్లస్, ప్రో, అల్ట్రా సబ్‌స్క్రైబర్లకు ఇవాళ్టి నుంచే అందుబాటులోకి వస్తోంది.

ఏజెంటిక్ ఏఐ..

జెమిని స్పార్క్ ని గూగుల్ తన ఏజెంటిక్ ఏఐ విజన్‌లో ప్రధాన ఫీచర్‌గా పరిచయం చేసింది. జెమినీ 3.5, ఆంటీగ్రావిటీ హార్నెస్ ఆధారంగా పనిచేసే ఈ క్లౌడ్-బేస్డ్ ఏఐ ఏజెంట్, ఫోన్ లాక్‌లో ఉన్నా లేదా ల్యాప్‌టాప్ మూసివేసినా బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేస్తూనే ఉంటుంది. ఇది జీమెయిల్‌, గూగుల్ డాక్స్‌, గూగుల్ స్లైడ్స్ వంటి వర్క్‌స్పేస్ టూల్స్‌తో డీప్ ఇంటిగ్రేషన్ కలిగి ఉంటుంది. ప్రతి నెల స్టేట్‌మెంట్‌లను ఆటోమేటిక్‌గా విశ్లేషించి హిడెన్ సబ్‌స్క్రిప్షన్ ఫీజులను గుర్తించడం, ఇన్‌బాక్స్‌లో స్కూల్ అప్‌డేట్స్ ట్రాక్ చేసి భాగస్వామితో కలిసి డైజెస్ట్ పంపించడం, మీటింగ్ నోట్స్‌ను సమీకరించి గూగుల్ డాక్స్ తయారు చేయడం, ఫాలోఅప్ ఈ-మెయిల్స్ డ్రాఫ్ట్ చేయడం వంటి ప‌నుల‌ను స్పార్క్ చేయ‌గ‌లుగుతుంది. ఇక కాన్వా, ఓపెన్ టేబుల్‌, ఇన్‌స్టా చార్ట్ వంటి భాగస్వాములతో ఎంసీపీ ఇంటిగ్రేషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ-మెయిల్ పంపడం లేదా డబ్బు ఖర్చు చేసే చర్యల ముందు స్పార్క్ తప్పనిసరిగా యూజర్ అనుమతి కోరుతుంది. ఏ యాప్‌లతో కనెక్ట్ అవ్వాలో, ఎప్పుడు పని చేయాలో పూర్తి నియంత్రణ యూజర్‌కే ఉంటుంది.

జెమిని స్పార్క్‌కు మ‌రిన్ని హంగులు..

త్వరలో స్పార్క్‌కు మరిన్ని సామర్థ్యాలు కూడా రానున్నాయి. స్పార్క్‌కు నేరుగా టెక్స్ట్ లేదా ఈ-మెయిల్ పంపడం, కస్టమ్ సబ్-ఏజెంట్స్ సృష్టించడం, లోకల్ బ్రౌజర్ ఆపరేట్ చేయడం వంటి ప‌నుల‌ను త్వ‌ర‌లో చేయ‌గ‌లుగుతుంది. జెమినీ స్పార్క్ ఈ వారం ట్రస్టెడ్ టెస్టర్లకు విడుదలవుతుండగా, వచ్చే వారం అమెరికాలోని గూగుల్ ఏఐ అల్ట్రా సబ్‌స్క్రైబర్లకు బీటా వెర్షన్ అందుబాటులోకి రానుంది. డెయిలీ బ్రీఫ్ అనే కొత్త ఏఐ ఏజెంట్‌ను కూడా గూగుల్ ప్రకటించింది. ఇది యూజర్‌కు ప్రతి ఉదయం వ్యక్తిగత డైజెస్ట్‌ను అందిస్తుంది. జీమెయిల్‌లోని అత్యవసర మెయిల్స్, క్యాలెండర్ ఈవెంట్స్, పెండింగ్ ఫాలోఅప్స్ వంటి సమాచారాన్ని సేకరించి, చదవడానికి సులభంగా ఉండే బ్రీఫింగ్ రూపంలో చూపిస్తుంది. అలాగే తదుపరి చర్యలపై సూచనలు కూడా ఇస్తుంది. యూజర్ థంబ్స్ అప్ లేదా డౌన్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కాలక్రమేణా ఇది మరింత ప‌ర్స‌న‌లైజ్ చేయ‌బ‌డుతుంది. ఈ ఫీచర్ అమెరికాలో గూగుల్ ఏఐ ప్లస్, ప్రో, అల్ట్రా సబ్‌స్క్రైబర్లకు ఇవాళ్టి నుంచే అందుబాటులోకి వస్తోంది.

డెస్క్‌టాప్ తో మెరుగైన క‌నెక్టివిటీ..

గత నెలలో గూగుల్ జెమిని మాక్ ఓఎస్ యాప్ ను విడుదల చేసింది. ఇప్పుడు దీనికి కూడా భారీ అప్‌డేట్స్ రాబోతున్నాయి. త్వరలో జెమినీ స్పార్క్ డెస్క్‌టాప్ యాప్‌లోకి వస్తోంది. దీంతో లోకల్ ఫైల్ టాస్క్స్, డెస్క్‌టాప్ వర్క్‌ఫ్లో ఆటోమేషన్ చేయవచ్చు. అలాగే కొత్త వాయిస్ ఫీచర్ ద్వారా యూజర్ స్క్రీన్‌పై ఉన్న కాంటెక్స్ట్‌ను అర్థం చేసుకుని, మధ్యలో ఆగుతూ మాట్లాడినా లేదా ఫిల్లర్ వర్డ్స్ వాడినా, వాటిని సరైన ఫార్మాట్‌లో డ్రాఫ్ట్‌లుగా మారుస్తుంది. ఈ కొత్త అప్‌డేట్స్‌పై గూగుల్ జెమిని యాప్, ఏఐ స్టూడియో, గూగుల్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ జోష్ వుడ్ వ‌ర్డ్ మాట్లాడుతూ ఇవాళ ప్రకటించిన అప్‌డేట్స్ ద్వారా వ్యక్తిగత, ప్రోయాక్టివ్, శక్తివంతమైన యూనివర్సల్ అసిస్టెంట్ విజన్‌కు మరింత చేరువయ్యామ‌ని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, చిన్న వ్యాపార యజమానులు జెమినీతో ఎన్నో పనులు చేయగలరని ఆశిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

Advertisement
Advertisement