Fire | పేలిన ఏసీ యూనిట్.. రెసిడెన్షియల్ టవర్‌లో భారీ అగ్నిప్రమాదం
Fire | ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire) సంభవించింది. నోయిడా (Noida)లోని ఒక రెసిడెన్షియల్ టవర్‌లో మంటలు చెలరేగాయి.
Fire | ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire) సంభవించింది. నోయిడా (Noida)లోని ఒక రెసిడెన్షియల్ టవర్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన నివాసితులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాలోని సెక్టార్ 119లో ఉన్న అరణ్య సొసైటీలోని (Aranya Society ) ఓ టవర్‌లో 21వ అంస్తులో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని సమాచారం. నివాసితులంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఏసీ యూనిట్ పేలడం (AC blast) వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.
#WATCH | Noida, Uttar Pradesh: Fire broke out at a a flat at Aranya Society, Sector-119, within the jurisdiction of the Sector-113 Police Station. Six fire service tenders have arrived at the scene. Firefighting operations are underway. There have been no casualties as of now. pic.twitter.com/pDukGRov5V
— ANI (@ANI) June 29, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Surendra Koli | నిఠారీ వరుస హత్యల కేసు.. సురేందర్ కోలీ ఆత్మహత్య
సెప్టెంబర్ 18, 2026

Surat textile market | సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దుకాణాలు ధ్వంసం
సెప్టెంబర్ 9, 2026

Asaduddin Owaisi | రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక ముస్లింలకు వర్తించదా..? మసీదు కూల్చివేతపై ఒవైసీ ఆగ్రహం
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన
- ●Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..
- ●Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు
- ●Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన

Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..

Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు

Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం



